ఖాళీ ముహూర్తం24న

0
  • తెలంగాణ కాంగ్రెస్కు బిగ్‌ షాక్‌..
  • ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌!
  • ప్రతిపక్ష ¬దా గల్లంతు
  • ముందే చెప్పిన ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ ఆదాబ్‌ హైదరాబాద్‌)

తెలంగాణ కాంగ్రెస్కు మరో బిగ్‌ షాక్‌ తగలనుంది. ఈనెల 24న ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్లో చేరనున్నారు.ఈ విషయాన్ని ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ నెల 17న ముందే చెప్పింది. కోవర్ట్‌ ఆ’పరేషన్‌’ గురించి పూర్తి వివరాలు ప్రచురించింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రముఖులు అనధికారికంగా అది తప్పు అంటూ గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు ఆ నేతలు ఏం అంటారో వేచిచూద్దాం.

కారు ఎక్కేది వీరే:

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి కారెక్కనున్నారు. ఈనెల 24న టీఆర్‌ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

మిగిలింది వీరే..:

ఉత్తమ్‌, భట్టి, శ్రీధర్బాబు, రాజగోపాల్రెడ్డి, రోహిత్రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. ఉత్తమ్‌ కుమార్‌ ఒక వేళ పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిస్తే… వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కేవలం ఐదుగురు మాత్రమే మిగులుతారు.

ప్రతిపక్ష ¬దా గల్లంతు:

ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి ఒకొక్కరగా చేరడంతో కాంగ్రెస్‌ శిబిరం కొంచెం కొంచెంగా ఖాళీ అవుతోంది. దీంతో శాసనసభలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష ¬దా కూడా కోల్పోనుంది. జూన్‌ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా చేరికలతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 104కు చేరనుంది.

ఇలా క్యూ కట్టారు:

పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు మార్చి 2వ తేదీన, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ మార్చి 10న, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి మార్చి 14న, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మార్చి 17న తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ బి-ఫారం విూద పోటీ చేసిన వారిలో ఐదుగురు తెరాస వైపు మొగ్గుచూపగా.. ప్రస్తుతం సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు డీసీసీ పదవికీ మార్చి 18వ తేదీన రాజీనామా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీనే డీసీసీ అధ్యక్షులను నియమించారు. మూడు నెలలు గడవకముందే మళ్లీ డీసీసీ అధ్యక్షుడు లేని దిక్కులేని పార్టీగా కాంగ్రెస్‌ మారింది. ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన డీసీసీ అధ్యక్షులను ఉభయ జిల్లాలకు నియమించినా.. భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేయడం, కారెక్కడం గమనించాల్సిన అంశం. ప్రస్తుతం పార్టీ సమన్వయకర్తతోపాటు నియోజకవర్గ బాధ్యులు, జిల్లా, మండల నేతలు పార్టీని ముందుకు తీసుకువెళ్లే పనిలో పడ్డారు. త్వరలోనే డీసీసీ అధ్యక్షుడిని నియమించాలన్న డిమాండ్‌ కూడా స్థానిక నేతల నుంచి వినిపిస్తోంది. రాజీనామాలతో ఏర్పడిన చేదు అనుభవాలు, శాసనమండలి ఫలితాల తీపి గుర్తులతో కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థలను ఎదర్కొనేందుకు సర్వం సిద్ధం అవుతోందనడంలో సందేహం లేదు.

స్థానిక టిష్యూ ‘అఫిడవిట్‌’:

రాష్ట్రంలో తిరిగి తెరాస అధికారంలోకి రావడం.. కాంగ్రెస్‌ వలసలు దాదాపుగా పూర్తి కావడం వరుసగా జరుగుతున్నాయి. ఈసారి ఇలా కాకుండా పార్టీ బీ-ఫాంపై పోటీ చేసే అభ్యర్థులు గెలిచిన తర్వాత పార్టీ మారననే అఫిడవిట్ను ఒక స్టాంప్‌ పేపరుతో జతపరిచి పార్టీ నాయకులకు అందించాలని టీపీసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో ఈ అనాలోచిత పెద్దలు ఈ అఫిడవిట్‌ విషయం నాడు గుర్తుకు రాకపోవడం విడ్డూరం. ”అఫిడవిట్‌ సమర్పించాలనేది మంచి నిర్ణయమే. అప్పుడే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవారు పోటీ చేస్తారు. దీనికి చట్టబద్ధత కల్పించేలా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అఫిడవిట్‌ స్టాంప్‌ పేపర్తో కలిసి సమర్పించినా దానికి ఎలాంటి విలువ ఉండదు. పార్టీ మారేవాళ్లకు ఇవేవి అడ్డంకులు కాలేవు” అని టీపీసీసీ ఆలోచిస్తున్న అఫిడవిట్పై ఏఐసీసీ సభ్యులు ఒకరు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధి’తో అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఃూచీ

ఇకనైనా మారండి:

అసెంబ్లీ టిక్కెట్లు అమ్ముకున్నారని టికెట్‌ ఆశించిన నేతలు ఆడియోలు, వీడియోలను బయటపెట్టారు. జెండా మోసిన కార్యకర్తలకు కాకుండా అప్పటికప్పుడు పార్టీలో చేరిన ‘జంపింగ్‌ జఫా’లకు కొందరు ‘పట్టుబట్టి’ సీట్లు ఇప్పించుకున్నారు. ఇలా టికెట్లు పొందిన వారందరూ గులాబీ కండువాలు కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారిని కూడా టిపిసిసి కాపాడుకోలేక పోయింది. రాష్ట్రస్థాయిలో ఇరగదీస్తున్నామని ‘లేని విూసాలకు సంపెంగ నూనె’ రాసుకొని జబ్బలు చరిచిన నాయకులు నేడు కార్యకర్తల దగ్గర మొఖం చాటేస్తున్నారు. ఇకనైనా ఆ నాయకులు మూసధోరణి, గ్రూపు రాజకీయాలు కట్టిబెట్టి ముందుకు సాగాలి. కార్యకర్తల మనోభావాలకు తగ్గట్లుగా ప్రజాదరణ కలిగిన నాయకులకు స్థానిక నాయకత్వం అప్పగించాలి. సుమారుగా 30 ఏళ్ళకు పైబడి కాంగ్రెస్‌ తో కలసి నడుస్తున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు బాధ్యతలు అప్పగించాలి. లేదంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here