మహానగరంలో ఉద్యోగుల బిక్షాటన

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బంగారు తెలంగాణలో బిచ్చగాళ్లను నిషేధించిన తెరాస ప్రభుత్వం… అస్థవ్యస్త విధానాలతో నగరంలోని గాంధీ ఆసుపత్రి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు తమ కుటుంబాలతో రోడ్లు ఎక్కి బిక్షాటన చేయ్యాలని తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. విశ్వనగరంలో ప్రఖ్యాతిగాంచిన ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు గత ఆరునెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారంతా నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టినా ఫలితం కనిపించలేదని ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులే లేకుండా, ఉన్న వాళ్ళందరినీ పర్మినెంట్‌ చేస్తానని

ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండవసారి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తన హామీని నెరవేర్చకపోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. దశాలవారీగానైన తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ అవుతాయని ఆశిస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించకుండా పూట గొడవలేని స్థితిలో బంగారు తెలంగాణలో బిక్షటనకు బయలుదేరడం అరుదైన సంఘటనగా వివిధ కార్మిక సంఘాల నాయకులు అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన హామీలన్నింటినీ అమలు చేశానని, మ్యానిఫెస్టోలు ఇవ్వని హామీలను సైతం అమలు చేసి ప్రజలని బంగారు బాటలో నడిపిస్తున్ననని ప్రగల్భాలు పలుకడం ఎంతవరకు సమంజసం అని వారు అభివర్ణించారు. దశాలవారీగా తమ ఉద్యోగాలు పర్మినెంటు అవుతాయని భావించిన గాంధీ ఆసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగుల

వేతనాలతో పాటు ఇఎస్‌ఐ, పి.ఎఫ్‌ లాంటి కనీస నిబంధనలు అమలు కాకపోవడం పట్ల వారు విచారం వ్యక్తపరిచారు. ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఇక తాము పూర్తి స్థాయిలో ఉద్యమం చేపట్టేందుకు అన్ని సన్నాహాలను పూర్తి చేశామని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. ప్రజలకు సైతం వాస్తవ పరిస్థితులను తెలిపేందుకు తమ కుటుంబ సభ్యులకు బుక్కెడు అన్నం పెట్టేందుకు తమకు బిక్షాటనే శరణ్యమని వారు పేర్కొన్నారు. తమ ఉద్యోగాలను కాంట్రాక్టు నుండి తొలగించి పర్మినెంటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇంతవరకు చెల్లించాల్సిన ఆరు నెలల వేతనాన్ని వెంటనే చెల్లించాలని కార్మిక శాఖ నిబంధనల మేరకు ఇఎస్‌ఐ, పి.ఎఫ్‌ లాంటి సౌకర్యాలన్నింటిని అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here