Featuredస్టేట్ న్యూస్

అంతుచిక్కని అతివల అదృశ్యాలు…

అంతుచిక్కని అతివల అదృశ్యాలు…

మాయమవుతున్న మహిళలపై పట్టింపేది..

చీకటిలో కలుస్తున్నా దారుణాలెన్నో…

మరో ముగ్గురు అమ్మాయిలు మాయం..

ఎవరూ పట్టించుకోరు.. ఎవరూ తమ బాధ్యతగా పనిచెయ్యలేరు.. పసిపాపల నుంచి పండు ముసలి వరకు ఎమవుతున్నారో, ఎక్కడికెళుతున్నారో తెలియని దుస్థితి.. చెప్పుకోలేని బాధతో, భయంతో బయట అడుగుపెడుతున్నారు.. బయటికి వెళ్లినా వారిని ఎవరూ తీసుకెళుతున్నారో, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో సమాచారమే లేని పాలనావ్యవస్థ మనది.. ఆడుతూ పాడుతూ తిరిగే తమ కంటిపాప కనబడడం లేదని అధికారయంత్రాంగం చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన అక్కడ సరియైన సమాధానం దొరకదు. వారి మీద నమ్మకం లేక బాధితులు వెతికి వెతికి నిరాశకు గురైనా చిన్న ఆచూకి కూడా కనిపించదు. ఎక్కడో గుర్తు తెలియని అమ్మాయి, గుర్తు తెలియని మహిళ చనిపోయిందని సమాచారంతెలిసినప్పుడల్లా మనసులో ఏదో తెలియన ఆందోళన, తన కన్నపేగు కావొద్దనే అతృత.. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ ఎక్కడ, ఏలాంటి పరిస్థితుల్లో ఉందో అని నిత్యం తల్లడిల్లే తల్లిమనసు… ఇన్ని జరుగుతున్నా, ఇంతమంది ఆవేదన పడుతున్నా స్పందించలేని, చైతన్యం చేయలేని పాలనా వ్యవస్థలో మనం జీవనం సాగిస్తున్నాం.. ఒక్కరోజు కాదు ప్రతి రోజుకు ఒక్కరూ కాదు, ఇద్దరూ కాదు పదుల సంఖ్యలో మాయమవుతున్నారు. మాయమైనవారిలో అధికులు మహిళలున్నారని తెలిసినా ఒక్కరంటే ఒక్కరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు.. మనకెందుకులే, మనవారు కాదులే అనుకుంటూ ఆలోచించే వారు ఎక్కువైపోతున్నారు.. అందుకే ఇప్పటి సమాజంలో మహిళకు భద్రత లేదు.. మహిళ హక్కులకు గుర్తింపు లేదు.. అతివను పొగడడానికి, అతివను మాటలతో అందలమెక్కించడానికి మాత్రమే మనం మన పాలకులు పనికొస్తున్నారు తప్ప ఆవిడను కాపాడుకోవడంలో, ఆవిడకు అవకాశాలు కల్పించడంలో మనమెప్పుడూ వెనుకనే…

హైదరబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

మాయమైపోతున్నాడు.. మనిషి కాలేజీకి వెళ్లి ఇంట్లోకి అడుగు పెట్టువరకు అనుమానమే.. పక్క సందులోకి వెళ్లినా పాప, పట్నంలో చదువుకుంటున్న విద్యార్థిని, కళాశాలకు వెళుతున్న యువతి, పొట్టపోసుకోవడం కోసం ఏదో ఒక కూలీ పనిచేస్తున్న మహిళ అందరూ ఎప్పుడు అదృశ్యమవుతున్నారో, ఎప్పుడు కనుమరుగవుతున్నారో తెలియడం లేదు.. ప్రపంచమంతా అరచేతిలో ఉంటుందన్నదీ వాస్తవమే ఐనా, అ అరచేతిలో ఉన్న మొబైల్‌తోనే మనుషులు మాయమైపోతున్నారు. కంటికి కనబడనంత దూరంగా వెళ్లిపోతున్నారు. అసలు మనుషులు మాయమవడానికి, మహిళలు కనబడకపోవడానికి మాత్రం కారణాలు ఏంటని ఆలోచించే యంత్రాంగం లేదు.. తమ విధి కాదనుకునే వారు కొందరు, తమ విధి ఐనా సమయంలేదని దాటవేసేవారు మరికొందరు ఎవ్వరికి తప్పించుకోవాలని ప్రయత్నంలోనే మిస్సింగ్‌ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక సంఘటన ఎన్నో మార్పులకు పునాదిగా మారాలి. ఒక అదృశ్యం ఎన్నో కొత్తకోణాలకు బీజం వేయాలి. ఒక ఆందోళన మళ్లీ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కాని అలాంటివేమి మన దగ్గర కనబడవు, కనబడినా అప్పటికప్పుడు చేసే హడావుడీ, నాయకులు ఓదార్పు, అధికారుల విచారణ పేరుతో అటకెక్కినా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న జరిగిన ఒక హాజీపూర్‌ సంఘటన అంతకు ముందు జరిగిన ఎన్నో కేసులు, బయటి సమాజానికి తెలియని సంఘటనలు ఎన్నో అన్ని కలిసి మనిషిని మాయం చేస్తున్నాయి. మామూలుగా మాయం చేయడం కాదు, మరీ చిత్రవథతో ఎవరికి చెప్పుకోలేని వ్యధతో అర్థాంతరంగా మాయమవుతూ తనువు చాలించేవారే ఎక్కువగా ఉన్నారు.

మరో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం!

హైదరాబాద్‌ మహానగరం పరిధిలో అదృశ్యాల కలకలం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 1 నుంచి 10 వరకు సుమారు 540 మందికి పైగా అదృశ్యం కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, ఇద్దరు విద్యార్థినులు జాడలేకుండా పోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినులు అదృశ్యమయ్యారు. పటాన్‌చెరుకు చెందిన ప్రశాంతి, గాయత్రి స్థానిక ఇంటర్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నారు. నిన్న ఉదయం ఇద్దరూ కళాశాలకు వెళ్తున్నామని చెప్పి మళ్లీ తిరిగి ఇంటికి రాలేదని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇద్దరు స్నేహితులు ఎక్కడికి వెళ్లారో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వారు పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్‌ కాలనీకి చెందిన శివాని అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అదృశ్యమైంది. నిన్న రాత్రి ఆమెను తన స్నేహితుడు కాలనీలో దింపినట్టు సీసీఫుటేజీ దృశ్యాలు లభ్యమయ్యాయి. నిన్న రాత్రి నుంచి తన కూతురు కన్పించకుండా పోయిందని శివాని తండ్రి పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 540 మంది అదృశ్యమైన కేసుల్లో 220 మందిని మాత్రమే ఎటువెళ్లారనే అంశాన్ని పోలీసులు గుర్తించారు. ఇంకా సుమారు 318కి పైగా కేసుల్ని గుర్తించాల్సి ఉంది. అదృశ్యమైన వారిలో సుమారు 270మందికి పైగా మహిళలే ఉండటం గమనార్హం.

కనబడనివారిలో అమ్మాయిలే ఎక్కువ..

రాష్ట్రంలో సగటున ఆరవై నుంచి డెబ్బైశాతం మంది వరకు అదృశ్యమైపోతున్నట్లు తెలిసిపోయింది. అందులో ఎక్కువశాతం మంది యువతులు, మహిళలే ఉండటం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఒక సర్వే ప్రకారం ఈ నెలలో 9వ తేది వరకు 545 మంది కనిపించకుండా పోయారు. ఇవి పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు మాత్రమే. వీరిలో సగం మందికి పైగా రాజధాని పరిసరాలకు చెందిన వారేనట. ఇంతమంది ఎందుకు అదృశ్యమవుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది బాధితుల కుటుంబ సభ్యులనే కాదు పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. అదృశ్యమవుతున్నవారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయసువారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన హజీపూర్‌ ఉదంతం ఇంకా మరుగునపడకముందే పెరిగిపోతున్న అదృశ్యం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెలలో 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రంలో 545 అదృశ్య కేసులు నమోదయ్యాయట. ఇందులో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లు అంటే రాజధాని పరిధిలోనే 296 మంది కనిపించకుండా పోయారు.

రెండు సంవత్సరాలలో 20000 మంది మిస్సింగ్‌…

ప్రతీ ఏటా దాదాపు 13000 మిస్సింగ్‌ కేసులు నమోదు అవుతున్నాయని, అయితే ఈ కేసుల్లో సుమారు 3 నుంచి 4వేల కేసులు మైనర్‌ బాలలవే కావడం దురదృష్టకరమని ఒక న్యాయవాది హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.. అయితే అదృశ్యమైన కేసుల్లో 1324 మంది మైనర్‌ బాలికలవే ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2015-2018 సంవత్సరాల మధ్య నమోదైన మైనర్‌ బాల బాలికల మిస్సింగ్‌ కేసులను రీ ఓపెన్‌ చేసేలా ఆదేశించాలని రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌ ఈ విషయమై మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ప్రతీ ఏటా దాదాపు 13000 మిస్సింగ్‌ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు.. అంతేకాదు పోలీస్‌ స్టేషన్లలో కేసు నమోదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రుల పట్ల కూడా పోలీసులు వ్యవవహరించే తీరు అవమానకరంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ మూసేసిన 20000 కేసులను తిరిగి ఓపెన్‌ చేయించి విచారణ జరిపించాలని ఆయన కోరారు. యాదాద్రి జిల్లా హాజీపూర్‌ గ్రామంలో మైనర్‌ బాలికలను వరుస హత్యల నేపథ్యంలో రాపోలు భాస్కర్‌ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అదృశ్యానికి కారణాలెంటీ…

పరీక్ష ఫలితాల వెల్లడి సమయంలో ఎంతో కష్టపడి చదివామని తగినన్ని మార్కులు రాలేకపోయ్యాయనే బాధతోనే ఎక్కువమంది తప్పిపోతున్నారని తెలుస్తోంది. వీరి భయంతో బయటికి వెళ్లి ఏ బస్టాండ్‌లోనే, రైల్వేస్టేషన్‌లోనే ఒంటరిగా కనపించడంతో మాయమాటలు చెప్పి వీరిని మోసం చేసేవారే ఎక్కువగా ఉంటున్నారు. వారి మాయమాటలకు నమ్మి వాళ్లతో వెళ్లడంతో వారు ఏం చేస్తున్నారో, ఎక్కడికి తరలిస్తున్నారో తెలియడం లేదు. మరికొంతమంది లైంగికంగా వాడుకొని వారిని హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వెళ్లిన పిల్లల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా తిరిగి వచ్చేస్తుంటారు. ప్రేమ వ్యవహారాలు మరో కారణం. మిస్సింగ్‌ కేసులలో ఎక్కువశాతం ఇలాంటివే ఉంటున్నాయి. ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులమీద అలిగి వెళ్లిపోతుంటారు. మధ్యవయసు వారయితే అప్పులు, ఇతర ఆర్థిక కారణాల వల్ల ఎవరికి చెప్పకుండా వెళ్లిపోతున్నారు. పిల్లలు తమను సరిగా చూడటంలేదని చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోతున్న వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక, బాలికలను, యువతులను, మహిళలను కిడ్నాపర్లు లక్ష్యంగా చేసుకొని ఎత్తుకెళ్తున్నారు.

యాదాద్రిలో బాలికను చంపింది ఎవరు

యాదాద్రి భువనగిరి జిల్లా బమ్మలరామారం మండలంలోని హజీపూర్లో దారుణం జరిగింది. పదో తరగతి స్పెషల్‌ క్లాసులకు వెళ్లిన శ్రావణి అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. బమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన పాముల నర్సింహ కుమార్తె శ్రావణి.. మేడ్చల్‌ జిల్లా కీసరలోని సెరినిటీ ప్రైవేట్‌ స్కూల్లో 9వ తరగతి పూర్తి చేసింది. వారం రోజులుగా పదోతరగతి ముందస్తు తరగతులకు హాజరవుతోంది. 15 కిలోవిూటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తుంది. గురువారం కూడా క్లాసులకు వెళ్లిన శ్రావణి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో రాత్రి వరకు ఎదురుచూసిన తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో ఊరంతా వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున గ్రామం సవిూపంలోని ఓ పాడుబడ్డ బావిలో శ్రావణి స్కూల్‌ బ్యాగ్ను గుర్తించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ కె. నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావు సందర్శించేందుకు రాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉదయమే ఫిర్యాదు చేసినా రాత్రి వరకు మృతదేహాన్ని గుర్తించలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దుండగులను అరెస్ట్‌ చేసేదాకా మృతదేహాన్ని బావిలో నుంచి తీయనివ్వబోమంటూ బైఠాయించారు. పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. డీసీపీ వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో డీసీపీ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో రాత్రి 11.30 వరకు గ్రామంలో ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు చివరికి బాలిక తల్లిదండ్రులకు, గ్రామస్తులకు నచ్చజెప్పి అర్ధరాత్రి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని తరలించారు. అయితే ఘటనా స్థలానికి కొంత దూరంలో ఖాళీ మద్యం సీసాలను క్లూస్‌ టీం సేకరించింది. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికను ఎవరు హత్య చేసి ఉంటారనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో ఒంటరి బాలికలపై దారుణాలు…

ఏదో ఒక భయంతో ఇంటినుంచి పారిపోయిన బాలిక ఎక్కడో ఒక దగ్గర తల దాచుకొంటుంది. ఆ ఏరియాలో తాగుబోతులు కాని మృగాలాంటి మనుషులు సంచరించినప్పుడు ఆ బాలిక కనబడుతే చాలు లైంగికంగా వేధిస్తూ అత్యాచారం చేస్తున్నారు. ఇదే సంఘటన ఇటీవల ఆరేళ్ల మైనర్‌ బాలికను దారుణంగా రేప్‌ చేసి, హత్య చేసిన సంఘటన నగర శివారు గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు చిన్నారిని అపహరించి ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుడు ఎత్తుకెళ్లడానికి ముందే సదరు బాలిక (6) అపస్మారక స్థితిలో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు మద్యం సేవించినట్టు పోలీసులు చెప్పారు. హత్యకు గురైన చిన్నారిది హైదరాబాద్‌ సవిూపంలోని తుర్కపల్లి గ్రామం. తండ్రి రోజువారీ కూలీ. గురువారం స్వగ్రామంలో ¬లీ ఆడుతున్న చిన్నారిని నిందితుడు ఎత్తుకెళ్లగా.. బాలిక మాయమైనట్టు గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే దగ్గరలోని అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్లో మిస్సింగ్‌ కేసు వేశారు. విచారణ చేపట్టిన పోలీసులు అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్‌ శివార్లలో చనిపోయి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు అతడిది బిహార్లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాగా నిర్ధారించారు. నిందితుడిపై ఐపీసీలోని పోక్సో సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సైబరాబాద్‌ పోలీసులు విూడియాకు తెలిపారు.

హైదరాబాద్‌ బాలిక… మహారాష్ట్రలో మృతి

హైదరాబాద్‌ లో అదృశ్యమైన బాలిక.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ లో శవమై కనిపించింది. బహదూర్పుర పోలీసుల కథనం ప్రకారం.. కిషన్బాగ్లోని అసద్బాబానగర్కు చెందిన ఎండీ సలీమ్‌ కుమార్తె సబాబేగం(14) 8వ తరగతి చదువుతోంది. ఈనెల 24న మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న సబాబేగం.. తర్వాత కనిపించకుండా పోయింది. జావేద్ఖాన్‌ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు బహదూర్పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జావేద్ఖాన్‌, సబాబేగం కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో.. ఔరంగబాద్లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఒక బాలిక మరణించిందని, ఆమెతో ఉన్న యువకుడు గాయాలపాలయ్యాడంటూ బహదూర్పుర పోలీసులకు సమాచారం అందింది. సబాబేగం తల్లిదండ్రులు ఇచ్చిన వివరాలతో మృతురాలి ఆనవాళ్లు సరిపోలడంతో.. ఎస్సై నర్సింహారావు నేతృత్వంలోని ఓ బృందం ఔరంగబాద్కు బయలుదేరింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close