Featuredస్టేట్ న్యూస్

అంతరాష్ట్ర ఎలక్ట్రిక్‌ ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్‌

దొంగలించిన, 10 క్వింటాళ్లు రాగి తీగలు స్వాధీనం

జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌

ఆదిలాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

అంతరాష్ట్ర ఎలక్ట్రిక్‌ ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్ట్‌ చేసి వారి నుండి దొంగలించిన, 10 క్వింటాళ్లు రాగి తీగలను స్వాధీనం చేసుకున్నామని, దొంగిలించిన రాగి విలువ దాదాపు 5.65 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ కిస్మస్‌ భార్యను తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌ లోని పోలీస్‌ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శ్రీ విష్ణు ఎస్‌ వారియర్‌, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం తెలిపారు. గత ఐదు నెలలుగా ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి తీగల దొంగతనాలు తరచూ జరగడంతో వారిని పట్టుకోవడానికి ఆదిలాబాద్‌ డివిజన్‌ డిఎస్పి ఎన్‌ఎస్‌వి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యా ప్తు బందం ఇంచార్జి కే లక్ష్మీనారాయణ బందం సభ్యులు నెల రోజుల పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మకాం వేసి నిందితుల ఆచూకీ తెలుసుకోవడానికి నిఘా పెట్టారు. ప్రత్యేక దర్యాప్తు బం దం కుటుంబానికి దూరంగా ఉంటూ రేయింబవళ్ళు కష్టపడి చలి తీవ్రత ను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణయే ధ్యేయంగా పని చేసి, నెలరోజుల్లోనే జైనథ్‌ సిఐ కే లక్ష్మీనారాయణ బందం కేసును ఛేదించినట్లు చెప్పారు. అదిలాబాద్‌ జిల్లాతో పాటు నిర్మల్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో తరచుగా పల్లె గ్రామాల శివారులో ఉన్న ఎలక్ట్రిక్‌ ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి తీగల దొంగతనాలు జరగడంతో రైతాంగం పండించిన పంట చేతికి అందే సమయంలో కరెంటు లేకుండా వ్యవసాయ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతుందనే భావించి, ఛాలెంజ్‌ గా తీసుకున్న జిల్లా ఎస్పీ ప్రణాళిక రచించి ప్రత్యేక బ ందాన్ని నియమించడంతో చోరీలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించడంలో సఫలమయ్యారు. జైనథ్‌ మండలం పూసాయి గ్రామం వద్ద జైనథ్‌ ఎస్‌ఐ సాయి రెడ్డి వెంకన్న పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా మొదటి ముఠాకు చెందిన సభ్యులైన మహారాష్ట్ర వాసిం జిల్లా మంగళూరు పీర్‌ గ్రామానికి చెందిన ఏ1- జమాలుద్దీన్‌ ఖాన్‌, మహారాష్ట్ర యవత్మాల్‌ పట్టణం శారదా చౌక్‌ కాలనీకి చెందిన ఏ3- ఆరిఫ్‌ షా, లను అదుపులో తీసుకున్నారు. భీంపూర్‌ మండలం ఆర్లి – టి గ్రామ శివారులో ఎస్సై ఎండి అరిఫ్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా రెండవ ముఠా సభ్యులైన మహారాష్ట్ర యవత్మాల్‌ జిల్లా యావలి గ్రామానికి చెందిన ఏ1- బొద్గే గోపాల్‌, మహారాష్ట్ర యావత్మల్‌ జిల్లా సిజ్ఞపుర్‌ గ్రామానికి చెందిన ఏ 2- పింపడ్కర్‌ గణేష్‌, మహారాష్ట్ర యవత్మాల్‌ జిల్లా యావల్‌ గ్రామానికి చెందిన ఏ3- ఎలకర్‌ జ్ఞానేశ్వర్‌ లను అదుపులో తీసుకున్నారు. అనంతరం ప్రత్యేక దర్యా ప్తు బందం అధికారుల సమక్షంలో నిందితులను విచారించగా నిందితులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి ముఠాకు చెందిన ప్రధాన నిందితుడు ఏ2-పాస్వాన్‌ రామ్‌ కరణ్‌, (ప్రస్తుతం పరారీలో ఉన్నాడు)తో కలిసి రెండు ముఠాలుగా ఏర్పడి రెండు మూడు రోజులకు ఒకసారి నల్ల రంగు పల్సర్‌ ద్విచక్ర వాహనంలో బయల్దేరి రాత్రి 8 గంటల నుండి 12 గంటల లోపు పల్లె గ్రామాల శివారులో ఉన్న 3 నుంచి 5 వరకు ఎలక్ట్రిక్‌ ట్రాన్స్ఫార్మర్లను క్రింద పడవేసి అందులోని విలువైన రాగి తీగలను దొంగలించి, పూసాయి గ్రామం వద్ద ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ వెనుక శివారులో దాచి ఉంచేవారని తెలిపారు. అనంతరం నిందితులు తెలిపిన ప్రదేశంలో గాలించగా 10 క్వింటాళ్లు (వెయ్యి కేజీలు) 5.65 లక్షల రూపాయల విలువైన రాగి తీగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన ఐదుగురు నిందితులను న్యాయస్థానంలో హాజరు పరుస్తామని, స్వాధీనం చేసుకున్న సొత్తును న్యాయస్థాన ఆదేశాల మేరకు ట్రాన్స్‌కో విభాగానికి అందించడానికి క షి చేస్తామని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు పస్వాన్‌ రామ్‌ కరణ్‌ ను పట్టుకోడానికి గాలింపు చర్యలు కొనసాగు తాయని తెలిపారు.

పట్టుబడిన నిందితులపై మహారాష్ట్రలో రెండు, అదిలాబాద్‌, నిర్మల్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 37 కేసులు, మొత్తం 39 కేసులు నమోదైనట్లు వెల్లడించారు, నమోదైన 39 కేసుల్లో 88 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి విలువైన రాగి తీగలను దొంగలించారని తెలిపారు. ప్రజల సంచారం లేని పల్లె గ్రామాల శివారులో, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల నుండి విలు వైన రాగి తీగలను దొంగలించి అనంతరం రాగిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవా టుపడి నేర ప్రవత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు. రాగి తీగల దొంగతనాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి చాలెంజ్‌ గా తీసుకొని అనతికాలంలోనే దర్యాప్తు బందం చేదించినట్లు వివరించారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లేకున్నా నెల రోజుల పాటు రెక్కీ నిర్వహించి, నిందితులను పసిగట్టడంలో డిఎస్పి వెంకటేశ్వరరావు, జైనథ్‌ సిఐ కే లక్ష్మీనారాయణ, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎండి. సిరాజ్‌ ఖాన్‌ లు చురుకైన పాత్ర పోషిం చారని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల చోరీలతో పంటలు పండించే రైతాంగానికి తీవ్రమైన అంతరాయం కలిగేదని, అందువల్ల ఇలాంటి కేసులపై ప్రత్యేక ద ష్టి సారించి, నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలోని అన్ని కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ప్రత్యేక దర్యాప్తు బందం అధికారులను అభినందిస్తూ, రివార్డులు అందిస్తామని తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బందంలో డిఎస్పి ఎన్‌ఎస్‌వి వెంకటేశ్వరరావు, జైనథ్‌ సిఐ, కే లక్ష్మీనారాయణ, తాంసీ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎండి సీరాజ్‌ ఖాన్‌, జైనథ్‌ ఎస్సై సాయి రెడ్డి వెంకన్న, భీంపూర్‌ ఎస్‌ఐ ఎండి ఆరిఫ్‌, సిసిఎస్‌ కానిస్టేబుళ్లు రాథోడ్‌ ప్రేమ్‌ సింగ్‌, సయ్యద్‌ జకీర్‌ అలీ, ఏ మంగళ్‌ సింగ్‌, ఎమ్‌ ఏ కరీం, నార్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ పి ప్రవీణ్‌, జైనథ్‌ కానిస్టేబుల్‌ జే రమేష్‌, ఐటి కోర్‌ విభాగం జిల్లా ఇంచార్జ్‌ సింగజ్‌ వార్‌ సంజీవ్‌ కుమార్‌, సభ్యుడు రియాజ్‌,లు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి ఎన్‌ ఎస్‌ వి వెంకటేశ్వరరావు, జైనథ్‌ సిఐ కే లక్ష్మీనారాయణ, సిసిఎస్‌ ఇన్స్పెక్టర్లు జే క ష్ణమూర్తి, చంద్రమౌళి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్పెక్టర్‌ పి. సుబ్బారావు, జైనథ్‌, భీంపూర్‌, బేల ఎస్సైలు సాయి రెడ్డి వెంకన్న, ఎండి అరిఫ్‌, ఈ సాయన్న, హెడ్‌ కానిస్టేబుళ్లు ఎండి సిరాజ్‌ ఖాన్‌, రాథోడ్‌ ప్రేమ్‌ సింగ్‌, ఎస్కే తాజుద్దీన్‌, కానిస్టేబుళ్లు సయ్యద్‌ జకీర్‌ అలీ, మంగళ్‌ సింగ్‌, ఎం ఏ కరీం, ఐటి కోర్‌ జిల్లా ఇంచార్జ్‌ సింగజ్‌ వార్‌ సంజీవ్‌ కుమార్‌, రియాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close