Featuredరాజకీయ వార్తలు

ఎన్నికల ఏర్పాట్లు.. సంతృప్తిగా ఉన్నాయి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ అన్నారు. తెలంగాణలో మూడు రోజుల పర్యటన ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో ఓపీ రావత్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ అధికారులు చాలా కష్టపడి పని చేస్తున్నారన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సవిూక్షించామని చెప్పారు. నగదు, మద్యం పంపిణీ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను బయటపెట్టేలా నామినేషన్‌, అఫిడవిట్‌ పత్రాలను రూపొందించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు దాఖలుచేసిన అఫిడవిట్‌ ను 24 గంటల్లోగా ఇంటర్నెట్‌ లో అప్‌ లోడ్‌ చేస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించేవారిపై ఫిర్యాదు చేయడానికి సీ-విజిల్‌ అనే ఆండ్రాయిడ్‌ యాప్‌ ను తీసుకొచ్చామన్నారు. ఎన్నికల సందర్భంగా 100 శాతం వీవీ ప్యాట్‌ యంత్రాలు ఉన్న ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఉద్యోగుల కోసం ఎలక్టాన్రిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌ ను వాడుతున్నట్లు ఓపీ రావత్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం 32,574 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు తెలంగాణ సిద్ధంగా ఉందనీ, ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయన్నారు. పార్టీలు, ప్రజా సంఘాలు, దివ్యాంగుల అభిప్రాయం తీసుకున్నామన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులతో పూర్తిస్థాయి వివరాలు తెలుసుకున్నామన్నారు. ఓటర్ల జాబితా గురించి అడిగి తెలుసుకున్నామన్నారు. తప్పులు ఉన్న ఓటర్ల జాబితాను మార్చాలని సూచించామని తెలిపారు. డబ్బు పంపిణీపై మెజార్టీ రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయని, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని మెజార్టీ నేతలు కోరారన్నారు. కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాల తీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయన్నారు. కొందరికి అనుకూలంగా ప్రసార మాధ్యమాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వచ్చాయన్నారు. వృద్ధులు, వికలాంగులు ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తులు వచ్చాయన్నారు. పొరుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ అధికారుల తీరుపై కొన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీలు వెల్లడించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలనూ స్వీకరించినట్లు చెప్పారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ యంత్రాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు.

ముగిసిన రావత్‌ పర్యటన… రాష్ట్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేటితో ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఈసీ ఓపీ రావత్‌ ఆధ్వర్యంలోని 11 మంది సభ్యుల బృందం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఓటర్ల జాబితా, రాజకీయ పార్టీల నాయకులతో భేటీ, పోలీసు, ఆబ్కారీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సీఈసీ బృందం భేటీ అయింది. నగరంలోని ¬టల్‌ తాజ్‌కృష్ణలో ఓపీ రావత్‌ పర్యటన విశేషాలను విూడియాతో పంచుకున్నారు. మూడు రోజుల పాటు పలు పార్టీలు, వివిధ వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. ఎన్నికలను పాదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close