జనవరి 10లోపే ఎన్నికల నోటిఫికేషన్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

జనవరి పదో తేదీ లోపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కోర్టును కొంత సమయం కోరామన్నారు. రిజర్వేషన్ల ఖరారు తరువాత కూడా చట్ట ప్రకారం ఎన్నికల నిర్వహణకు కొంత సమయం కావాల్సి ఉంటుందని చెప్పారు. ఈనెల 27 నుంచి జనవరి 2 మధ్యలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్లకు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్‌ తరువాత 15రోజులకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయని, నోటిఫికేషన్‌ తరువాత 23 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో విడతకు మధ్య నాలుగు రోజుల సమయం ఉంటుందని నాగిరెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here