మోగిన ఎన్నికల నగారా,˜ డిసెంబర్‌ 7న ఓటింగ్‌…11న ఫలితాలు

0

119 స్థానాలకూ ఒకేరోజు పోలింగ్‌

˜ నవంబర్‌ 12న నోటిఫికేషన్‌ విడుదల

– నవంబర్‌ 12 నామినేషన్ల ప్రారంభం

– నవంబర్‌ 19 నామినేషన్లకు చివరి తేదీ

– నవంబర్‌ 20న నామినేషన్ల పరిశీలన

– నవంబర్‌ 22న నామినేషన్ల ఉపసంహరణ

– కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఏడాది డిసెంబర్‌ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్ని కలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్‌ ప్రకటించారు. ఒకే దఫాలో 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తామని చేశారు. తెలంగాణతో పాటు నాలుగు ఉత్తరాది రాస్ట్రాల ఎన్నికలకు సంబంధిం చి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విూడియాతో మాట్లాడారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన ఓపీ రావత్‌.. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్‌ 7న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 11న ఎన్నికల కౌంటింగ్‌ చేపట్టి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల చివరి తేదీ నవంబర్‌ 19. నామినేషన్ల పరిశీలన తేదీ నవంబర్‌ 20, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 22గా షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ రకంగా తెలంగాణ శాసనసభకు డిసెంబర్‌ 7న ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని, 11న కౌంటింగ్‌ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నవంబర్‌ 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున ఓటర్ల జాబితా ప్రకటనకు సమయం పడుతుందన్నారు. వాస్తవానికి అక్టోబర్‌ 8వ తేదీనే తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉండగా.. ఇందులో అక్రమాలు జరిగాయని ఆరో పిస్తూ హైకోర్టులో కేసు నడుస్తున్నందున ఈ పక్రి యకు బ్రేక్‌ పడింది. ఈ పరిణామంపై రావత్‌ స్పందిస్తూ అసెంబ్లీ ర్దద్దయిన ఆరు నెలల్లోపు ఎన్ని కలు జరగాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగా కొ త్త ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 12న విడుదల చేస్తామని రావత్‌ తెలిపారు. అయితే ముందుగా హైకోర్టుకు సమర్పించిన తర్వాతే ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందన్నారు. గతనెల 6న సిఎం కెసిఆర్‌ తెలంగాణ అసెంబ్లీని 9నెలల ముందే అర్థంతరంగా రద్దు చేశారు. సభ రద్దు చేసి ముందస్తు ఎన్నకలకు వెళ్లారు. దీంతో ఇసి నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలను ప్రకటించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నవంబర్‌లో మొదలు పెట్టి డిసెంబర్‌ 11 కల్లా ముగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులసమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందన్నారు. కాగా చత్తీస్‌ఘడ్‌లో రెండు దఫాలుగా, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో సెప్టెంబర్‌ 6న అసెంబ్లీ రద్దు చేయడంతో 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. సుప్రీం మార్గదర్శకాల మేరకు ఇక్కడ కూడా ఎన్నికల నిర్వహచేపట్టామన్నారు. ఇకపోతే నాలుగు రాష్ట్రాల్లోడిసెబర్‌లో కాలపరిమితి ముగుస్తోంది. దీంతో ఈ రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రక్రియను డిసెంబర్‌లోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

హైకోర్టు తీర్పు వచ్చాకే తుది జాబితా:

తెలంగాణలో ఈనెల 8న ఓటర్ల జాబితా అందాల్సి ఉందని, హైకోర్టు తీర్పు వచ్చాక 12న ఓటర్ల జాబితాను ప్రకటించాలని తాము నిర్ణయించినట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు. గతనెల 6న తెలంగాణ అసెంబ్లీ రద్దుకావడంతో తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, మిగతా రాష్ట్రాల్లో ఇప్పటి నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని స్పష్టంచేశారు. డిసెంబర్‌ 15నాటికి ఎన్నికల పక్రియను పూర్తిచేస్తామని వెల్లడించారు. మిజోరాంలో అభ్యర్థుల ప్రచార ఖర్చు రూ.20లక్షలు , మిగతా మూడు రాష్టాల్లో అభ్యర్థుల ఖర్చును రూ.28లక్షలు మించకూడదని నిబంధన విధించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఎలక్టాన్రిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని ఈ ఎన్నికల్లో అమలులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రతి పోలింగ్‌కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని రావత్‌ తెలిపారు.

ఎపిలో ఉపఎన్నిక లేదు.. తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినా ఎపిలో ఉప ఎన్నికలకు నో చెప్పింది. ఈ షెడ్యూల్‌తో పాటే ఆంధ్రప్రదేశ్‌లోని అరకు అసెంబ్లీ స్థానానికి, వైకపా ఎంపిలు రాజీనామా చేసిన స్థానాలకు కూడా ఉపఎన్నిక జరగొచ్చని భావించారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం అరకు అసెంబ్లీ స్థానానికి,ఎంపి స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించడం లేదని తేల్చిచెప్పింది. కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ఓపీ రావత్‌ దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు. గత నెల విశాఖపట్నం జిల్లా లివిటిపుట్టలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆ నియోజకవర్గానికి ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటే ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో.. అరకు స్థానానికి ఎన్నికను నిర్వహించడం లేదని తెలుస్తోంది. అలాగే లోక్‌సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరపడం లేదన్నారు. వైకాపాకు చ ఎందిన ఎంపిలు గత ప ఆరల్మెంట్‌ సమావేశాలకు ముందు తమ ఎంపి పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఏడాదిలోపే ఎన్నికలు ఉన్నందున అక్కడా నిర్వహించడం లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here