కేటీఆర్ ఆస్తులపై ఈడీ కన్ను

? సొంత కంపెనీకే అన్నీ
? పోలీసు ‘ఇన్నోవా’ వెనుక బాగోతం
? కోట్లాది రూపాయల వ్యవహారం
? ‘హిమాంశు’ కథ ఏమిటి..?
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)
ఆయన మామూలు వ్యక్తి కాదు. ప్రస్థుతానికి యువరాజు. కాలం కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ఏ మచ్చా..లేదని వేదికలపై గర్జిస్తారు. ఊహించని శరాఘాతం ఏమిటంటే ఆయన ఓ కంపెనీకి డైరెక్టర్. అదే కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా 313 కోట్ల కాంట్రాక్టు పని అప్పగించింది తండ్రి ప్రభుత్వం. ఆయనే మన యువరాజు కల్వకుంట్ల తారక రామారావు. ఈ విషయంపై కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న సంచలన పరిశోధన కథనం.
సదరు కంపెనీ అసలు కథ:
‘హిమాంశు’ అనే కంపెనీ ఈ పోలీసు వాహనాల కొనుగోలు కాంట్రాక్టు చేజిక్కుంచుకుంది. ఈ కంపెనీ కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే సరఫరా చేస్తోంది. కానీ ఇక్కడ మాత్రం నాలుగు చక్రాలతో తయారు చేయబడిన ఇన్నోవా వాహనాలకు ఢిల్లీ పోలీసుశాఖకు, హైదరాబాద్ కు చెందిన సంస్థ అందిస్తుంది. ఆ కంపేనీ యువరాజుకు నచ్చలేదు. దీంతో ఏ కంపెనీకో ఎందుకు…? తన సొంత కంపెనీకే నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు.
ఈ కంపెనీ అసలు కథ:
‘హిమాంశు మోటర్స్ ప్రైవేటు లిమిటెడ్’ అనేది ఓ రిజిస్టర్ కంపెనీ. ఈ కంపెనీలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు, విద్యాసాగర్ అచ్చా అనే ముగ్గురు డైరక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థ ద్విచక్రవాహనాలను మాత్రమే సరఫరా చేస్తోంది. ఈ వాహనాల కొనుగోలుకు ఎలాంటి టెండర్లు పిలవలేదు. పదివేలు దాటితేనే టెండర్లు పిలవాల్సిన నిబంధన ఉఃది. ఈ కంపెనీతో పాటు హర్ష టయోట కంపెనీకి 313 కోట్ల కాంట్రాక్టు ఏంచక్కా కట్టబెట్టారు. ఈ కంపెనీలో డైరెక్టర్ గా ఉంటూ… ప్రభుత్వ అధినేత కుమారుడిగా… మంత్రిగా ఈ నిర్ణయాన్ని కేటీఆర్ ప్రభావితం చేశారనే ఆరోపణలు వచ్చాయి.
బయటకు ఎలా పొక్కింది..?:
సమాచారహక్కు చట్టం ద్వారా భానుమూర్తి అనే వ్యక్తి ఈ వాహనాల కోనుగోలుకు సంబంధించి వివరాలు కోరుతూ 2015లో దరఖాస్తు చేశారు. ఆ లేఖను మరో శాఖకు బదిలీ చేసి సంబంధిత అధికారులు చేతులు దులుపుకొన్నారు. సెప్టెంబర్ 30, 2015న
లెటర్ నెంబర్. 891/ఎంఇ-4/ఆర్టీఐ/2015
సమాధానం లేదు. అనంతరం దరఖాస్తు దారుడు నవంబర్ 6, 2015న మొదటి అప్పీల్ చేశారు. దానికి స్పందించిన యంత్రాంగం డిసెంబర్ 21, 2015న ఎల్.డిస్. నెంబరు. 1400/ఎంఇ-4/అప్పీల్/2015 ద్వారా ఈ సమాచారం ఇచ్చారు. అందులోని నీర్ఘాంతపోయే విషయాలున్నాయి. ఈ వాహనాల ప్రతిపాదన ఏదీ పోలీసుశాఖతో కనీసం సంప్రదించలేదు. ఇక్కడ ఎలాంటి నిబంధనలను పాటించలేదు. మరి ఢిల్లీలో ఇలాంటి వ్యవహారంలో అక్కడి ప్రభుత్వానికి స్కార్పియో ఎస్4 బిఎస్4 2డబ్ల్యూడి (నలుపు రంగు), సికింద్రాబాద్ కు చెందిన మహేంద్ర లిమిటెడ్ సరఫరా చేసింది. ద్విచక్ర వాహనాలను ఢిల్లీకి చెందిన రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ బుల్లెట్ ఎలక్ట్రా యుసీఇ వాహనాలను సరఫరా చేసింది.
సమాధానం లేదు..:
మరో ఎనిమిది ప్రశ్నలకు సహజంగా ఆఫీసులో సమాచారం లేదని చెప్పారు. ఈ ప్రక్రియకు ఢిల్లీ డైరెక్టరేట్ నుంచి అనుమతి తీసుకోవాలి. అలాంటి ప్రక్రియ జరగలేదని సగర్వంగా తెలిపారు.
ఇది నిజమేనా..?
నాటి కేంద్ర మాజీమంత్రి కుమారుడు హర్షవర్ధన్ కి టయోటా కార్ల డీలర్ షిప్, అదేవిధంగా కేసీఆర్ కుమారుడు కే.టి.ఆర్.కి హీరో ¬ండా మోటార్ సైకిల్స్ డీలర్ షిప్ ఉందని వారిరువురికి లబ్ది చేకూర్చేందుకే తెలంగాణా ప్రభుత్వం ఎటువంటి టెండర్లు పిలవకుండా రూ.271 కోట్లు వ్యయం చేసి ఒకేసారి 3,883 ఇన్నోవా కార్లు, 2000 హీరో ¬ండా మోటార్ సైకిల్స్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. నాటి కేంద్ర మంత్రి కుమారుడు హర్షవర్ధన్ నాయుడికి టయోటా కార్ల డీలర్ షిప్ ఉన్న మాట వాస్తవమే. కానీ మంత్రి కే.టి.ఆర్. తనకు హీరో ¬ండా మోటార్ సైకిల్స్ డీలర్ షిప్ ఉందన్న వార్తలను, దానికి తమ ప్రభుత్వం లబ్ది చేకూర్చిందన్న చేసిన ఆరోపణలను ఖండించారు.
ఇది ఏమంటారు…?:
లాభదాయకమైన పదవిలో కొనసాగుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ.. 2017లో సిపిఎం పార్టీ రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ కు పిర్యాదు చేసింది. 2015లోనే ఈ తతంగం గురించి ప్రజాసత్తా పార్టీ గవర్నర్ తో పాటు మరో ఆరుగురికి లిఖితపూర్వకంగా పిర్యాదు ఇచ్చింది. ఆ తరువాత ఏం జరిగిందో కానీ అంతా సహజంగానే నిశ్శబ్దంగా మారింది. అయితే ఈ కొనుగోళ్ళలో వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని కేంద్ర వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
కొసమెరుపు:
మళ్ళీ వాహనాలు కొనుగోలు చేయాలనే విజ్ఞప్తిని ఇటీవలే కేంద్రం తోసిపుచ్చినట్లు తెలిసింది.