Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

రాష్ట్రంలో ఆర్థిక దుస్థితి

జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం

కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ లక్ష్మణ్‌

హైదరాబాద్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతున్నాయని రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు

ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన

మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని, తెలంగాణ

అప్పులమయమైందన్నారు. తెలంగాణ సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సకలజనుల సమ్మెలో

పాల్గొన్నారని, వారి జీవితాలిప్పుడు ప్రశ్నార్ధకంలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ప్రయివేట్‌ సంస్థలు

కోట్లు గడిస్తుంటే… ఆర్టీసీ మాత్రం నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ప్రతి అంశాన్ని పొరుగు రాష్ట్రంతో

పోల్చే సీఎం కేసీఆర్‌ ఏపీ ఆర్టీసీలో జరుగుతున్న సంస్కరణలు కనబడడం లేదా? అని లక్ష్మణ్‌

ప్రశ్నించారు. ఉద్దేశ్య పూర్వకంగానే ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల్లో కురుకుపోయేలా చేస్తోందని

విమర్శించారు. ప్రయివేట్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ వ్యవస్థకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, టిఆర్‌ఎస్‌ ఏ

మీటింగ్‌ పెట్టినా ఆర్టీసీ బస్సులను వాడుకొని డబ్బులు ఎగ్గొడుతోందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ

లోపాలు సరిదిద్ది గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కార్మికుల శ్రేయస్సు కోసం బీజేపీ

పోరాడుతుందని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ కుటుంబపాలనతో మంత్రులు, ఎమ్మెల్యేలు

అభద్రతాభావంతో కుంగిపోతున్నారని లక్ష్మణ్‌ అన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవల

మాట్లాడిన తీరు చూస్తే టీఆర్‌ఎస్‌ పరిస్థితి తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన

మునిగిపోయే నావలా తయారైందని, కేసీఆర్‌ అవినీతి పాలనను అంతమొందించడం బీజేపీకే

సాధ్యమని అన్నారు. ఎన్నికల ముందు కేటీఆర్‌..అరచేతిలో వైకుంఠం చూపి ఓట్లు దండుకున్నారని

విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న మతతత్వ పార్టీ మజ్లిస్‌తో టీఆర్‌ఎస్‌

అంటకాగడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీతోనే బీసీల అభివృద్ధి సాధ్యమని లక్షణ్‌

అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close