Featuredప్రాంతీయ వార్తలు

ఢిల్లీలో భూప్రకంపనలు

  • వణికిన ఉత్తరాది
  • రిక్టర్‌ స్కేల్‌పై 5.3గా నమోదు

ఉత్తర భారతదేశంలో స్వలంగా భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం భారత్‌, నేపాల్‌ సరిహద్దుల్లో భూమి కంపించింది. ఈ ప్రభావంతో ఢిల్లీ-నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌తోపాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. లక్నో, మురాదాబాద్‌ తదితర నగరాల్లో ప్రకపంనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.3గా నమోదైంది. భూకంప ప్రభావానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సోమవారం రాత్రి 7 గంటలకు గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close