ముందస్తు ఆందోళనలు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మహాకూటమిలో సీట్ల పంపకాల పై ఓ స్పష్టతకు వచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం, శనివారం కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది.. ఈ నేపథ్యంలో టికెట్‌లు దక్కవని భావిస్తున్న పలువురు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ, హైదరాబాద్‌లతో పాటు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. తమకు అన్యాయం జరుగుతుందని, అటు ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట, హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ ఎదుట నిరసనకు దిగారు. కుటమి ఒప్పందంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం టికెట్‌ను కాంగ్రెస్‌ ముందస్తు ఆందోళనలు అధిష్ఠానం తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) కేటాయించడంతో శుక్రవారం వివాదం చెలరేగింది. తమ నేత నందికంటి శ్రీధర్‌ ను కాదని బయటి పార్టీకి ఇవ్వడంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ లోని గాంధీభవన్‌ ను ముట్టడించిన కార్యకర్తలు అధిష్ఠానం తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. కోదండరాం డౌన్‌ డౌన్‌, టీజేఎస్‌ నశించాలి, మల్కాజిగిరి సీటును శ్రీధరన్నకే కేటాయించాలి అంటూ నినాదాలతో ¬రెత్తించారు. దీంతో ఇక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను సముదాయించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ అనుచరుడు ఒకరు మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పట్టుందని తెలిపారు. ఎన్నికల సమయంలో మరో కొత్త పార్టీకి నియోజకవర్గాన్ని అప్పగించడం టీఆర్‌ఎస్‌ కు మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్‌ సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

భక్తచరణ్‌ కుమారుడు టికెట్లు అమ్ముకుంటున్నాడు ..

మండల, గ్రామ స్థాయిలో ఉంటూ.. పార్టీ పటిష్టతకు పాటుపడిన వారికి.. మొండి చేయి చూపడంపై.. ప లువురు ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, పాలకుర్తి తో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు.. ఢిల్లీలో మకాం వేసి ఆందోళనలు జరుపు తున్నారు. తుంగతుర్తి టికెట్‌ ఆశించిన జ్ఞాన సుందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల పంపిణీలో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్త చరణ్‌ దాస్‌ కుమారుడు టికెట్లు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. రంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.3కోట్లు వసూలు చేశాడని విలేకరుల ఎదుట తెలి పారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని వదిలేసి.. ఢిల్లీ, హైదరా బాద్‌లో భజన చేసేవారికి టికెట్లు ఇస్తున్నారని జ్ఞాన సుందర్‌ ఆరోపించారు. అదేవిధంగా బీసీలు, ఎస్సీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, కేవలం కాంగ్రెస్‌ పార్టీలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలతో కాంగ్రెస్‌ పార్టీలో దుమారం చేలరేగుతుంది. డబ్బులకు ప్రలోభ పడి టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here