Featuredజాతీయ వార్తలు

ఆ ఇద్దరి హయాంలోనే బ్యాంకులకు నష్టాలు

  • మాజీప్రధాని మన్మోహన్‌, రఘురామరాజన్‌లపై నిర్మల మండిపాటు

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆ ఇద్దరి హయాంలోనే దేశీయ బ్యాంకింగ్‌ రంగ పరిస్థితి దిగజారిందని మాజీ ప్రధాని మన్మోహన్‌, మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. వాళ్లు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తూ.. బ్యాంకింగ్‌ వ్యవస్థకు జీవంపోసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అమెరికాలో ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ మంగళవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే పగ్గాలు చేపట్టిన తొలి ఐదేళ్లలో ఆర్థికవృద్ధికి చేపట్టాల్సిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇటీవల రఘురామ్‌ చేసిన వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. రాజన్‌ హయాంలోనే విపరీతంగా రుణాలు మంజూరు చేశారన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో కేవలం ఫోన్‌కాల్స్‌ ఆధారంగా అప్పులు ఇచ్చేశారని ఆరోపించారు. దీంతో బ్యాంకింగ్‌ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి.. నిధుల కోసం నేడు ప్రభుత్వం వైపు చూడాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. దేశంలో అధికారం కొంతమంది నాయకుల వద్దే కేంద్రీకృతమైందన్న రాజన్‌ వ్యాఖ్యల్ని కూడా ఆమె తప్పుబట్టారు. కాంగ్రెస్‌ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో రుణాల ఎగవేత తీవ్రస్థాయిలో ఉందని ఆమె విమర్శించారు. కొలంబియా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ పబ్లిక్‌ అఫేర్స్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రసగింస్తూ ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రాఘురాం రాజన్‌ చెబుతున్న ప్రతి మాట ఆయనకే వర్తిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌, ఆర్‌బిఐ గవర్నర్‌గా రఘురాం రాజన్‌ ఉన్నపుడే ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యంత దుర్భరమైన దశను ఎదుర్కొన్నాయన్న వాస్తవాన్ని తాను ప్రజల ముందు ఉంచుతున్నానని నిర్మల అన్నారు. ఆ కాలంలో తమకు ఈ విషయమే తెలియదని ఆమె చెప్పారు. ఆర్‌బిఐ చెబుతున్న వివరాల ప్రకారం 2011-12లో రూ. 9,910 కోట్లు ఉన్న రుణ ఎగవేతలు 2013-14 సంవత్సరానికి రూ. 2.16 లక్షల కోట్లకు పెరిగాయి. ఎన్‌డి ఎ ప్రభుత్వ 2014 మేలో అధికారాన్ని చేపట్టింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close