Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలు

ఈఎస్‌ఐలో మందులు లేక అలమటిస్తున్న కార్మికులు

మంత్రి మల్లారెడ్డి అండతో కోట్లకు పడగలెత్తిన ఐఎంఎస్‌ డైరెక్టర్‌

  • దేవికారాణి అవినీతి భాగోతం
  • డయాలసిస్‌ రోగులకు మందులు లేక క్షీణిస్తున్న ఆరోగ్యం
  • మందుల కొనుగోలులో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయాలి

రోజు కూలీ నుండి ఓ మోస్తరు జీతాలు తీసుకుంటున్న లక్షలాది మంది కార్మికులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న ఈ ఎస్‌ ఐ ఆసుపత్రిలో, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ అవినీతి లీలలు వారి ప్రాణాల మీదకు తెచ్చింది. మందులు లేక కొనుగోలు శక్తి లేక ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్న కార్మికులకు ఆమె ధనదాహం శాపంగా మారింది. ఒక్క ఫోన్‌ కాల్‌ తో అవినీతిని అంత్మౌందిస్తనన్న ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ సుమారు 466 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విజిలెన్స్‌ తేల్చి చెప్పిన తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం కార్మికులను అధోగతి పాలు చేస్తుంది.

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): ఈఎస్‌ఐ, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరిధిలోని దవాఖానలతో పాటు అన్ని డిస్పెన్సరీల్లో మందుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్‌ రీజియన్‌లో మొత్తం 53 డిస్పెన్సరీలు ఉండగా రాష్ట్రవ్యాప్తంగా 70 డిస్పెన్సరీలు ఉన్నాయి. అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్‌ పరిధిలోని ఈఎస్‌ఐ దవాఖానల్లో బీపీ, షుగర్‌ వంటి సాధారణ దీర్ఘకాలిక సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్‌, కిడ్నీ, థైరాయిడ్‌ వంటి ప్రాణాంతకమైన రోగాలకు సైతం ఔషధాలు లేకపోవడంతో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు.అత్యవసర మందులకు నెల నుంచి ఆరు నెలల వరకు నిరీక్షణ చేయవలసి వస్తుందని రోగులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు చాలా డిస్పెన్సరీల్లో పూర్తిస్థాయి వైద్యపరీక్షలు సైతం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు దవాఖానలకు వెళ్లాల్సివస్తున్నదని రోగులు వాపోతున్నారు. ప్రైవేట్‌ దవాఖానాల్లో చికిత్స చేసుకునే ఆర్థిక స్తోమత లేక ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ పరిధిలో ఉన్న కార్మిక రాజ్య బీమా చికిత్స లయానికి కు వస్తే మెరుగైన వైద్యం కానీ, పూర్తిస్థాయిలో మందులు కానీ, వైద్య పరీక్షలు కానీ చేయడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాల పై అనేకమార్లు కార్మిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శశాంక్‌ గోయల్‌ దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని రోగులు ఆరోపిస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కార్మిక రాజ్య భీమా డిస్పెన్సరీ లో గత ఆరు నెలల నుండి మందులు లేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నామని మొరపెట్టుకున్నా మంత్రి స్పందించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎస్‌ ఐ నియమ నిబంధనల ప్రకారం ప్రతి కార్మికుడు ఆరు నెలల్లో కనీసం డెబ్బై ఎనిమిది రోజులు విధులు నిర్వహించవలసి ఉంటుంది. ఆ విధంగా విధులు నిర్వహించిన వారికే ఈ ఎస్‌ ఐ వైద్య సేవలను అందిస్తుందని ఐ ఎం ఎస్‌ అధికారులు తెలియపరుస్తున్నారు. కానీ ఐ ఎం ఎస్‌ అధికారుల మందుల కొనుగోలులో అవినీతికి పాల్పడినందుకు గత ఆరు నెలల నుండి సక్రమంగా కార్మికులకు వైద్య సేవలు కానీ, మందులు కానీ పూర్తిస్థాయిలో ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ అందించడంలో విఫలమయ్యారు. మందులు అందక కార్మికుల ఆరోగ్యం మెరుగు పడక విధులను హాజరు కాకుంటే నిబంధనల ప్రకారం రెండు రోజులు తగ్గినా కూడా కార్మికునికి వైద్య సేవలు నిలిపేస్తున్నారు. సక్రమంగా మందుల సరఫరా చేయకపోవడంతో మా ఆరోగ్య పరిస్థితి మెరుగు పడక మేము విధులను హాజరు కాలేక పోతున్నాం అని మొరపెట్టుకున్నా కనికరించు కుండా వైద్య సేవలను అందించడం లేదు. మరి బీమా చెల్లిస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు, ఔషధాలు అందించవలసిన బాధ్యత ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ వారిది , బీమా చెల్లిస్తున్న కార్మికులకు వైద్య సేవలు అందించడానికి ఈ ఎస్‌ ఐ కార్పొరేషన్‌ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ వారికి బీమా చెల్లిస్తున్న ప్రతి కార్మికుడి చొప్పున రూపాయలు 2,150 నిధులను అందజేస్తున్నారు. ఈ సంవత్సరం నుండి బీమా చెల్లిస్తున్న ప్రతి కార్మికుడు చొప్పున రూపాయలు 3,000 నిధులు విడుదల చేస్తున్నా ఐ ఎం ఎస్‌ అధికారులు కార్మికులకు పూర్తిస్థాయిలో వైద్యచికిత్స కానీ, మందులు కానీ ఇవ్వడం లేదు వారికో న్యాయం మాకో న్యాయమా అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రిగారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు…. శ్రీనివాస్‌

దీర్ఘకాలికంగా మూత్రపిండ మార్పిడితో బాధపడుతున్నాను. గతంలో సనత్‌ నగర్‌లోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో మందులు ఇచ్చేవారు. ఔషధాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, సనత్నగర్‌ ఈఎస్‌ఐ హాస్పిటల్లో చీటీ రాయించుకున్న అనంతరం ప్రాంతాలవారీగా ఉన్న డిస్పెన్సరీలో మందులు సేకరించే విధంగా పేషెంట్లకు సూచించడం జరిగింది. కానీ డిస్పెన్సరీలో పేషెంట్లకు మందులు ఉండడం లేదు. ఈ విషయంపై అనేకసార్లు సంబంధిత అధికారులకు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. డిపార్ట్మెంట్‌ అధికారులు చేసిన తప్పిదాలకు పేషెంట్లకు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం. వెంటనే ప్రభుత్వం స్పందించి పేషెంట్లకు పూర్తిస్థాయిలో మందులు అదేవిధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.

తప్పు చేసింది ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికా రాణి శిక్ష అనుభవిస్తోంది కార్మికులు…

  • థైరాడ్‌ పేషంట్‌ మమత

ఔషధాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సంచాలకులు కానీ వారికి శిక్షించకుండా ఆరు నెలల నుండి డిస్పెన్సరీలో, దవాఖానలో మందులు లేక చాలా రోజులుగా బాధపడుతున్నాను. ఈ సమస్యకు సంబంధించిన వైద్య పరీక్ష కొరకు నాచారంలోని హాస్పిటల్‌కు వెళ్లగా అక్కడ మిషన్లు పని చేయడం లేదని, మీరు డిస్పెన్సరికి వెళ్లండి అక్కడ టెస్టులు చేస్తారని చెప్పడంతో సలీంనగర్‌లోని డిస్పెన్సరీకి వచ్చి సంబంధిత డాక్టర్లకు అడగగా వారు ఇక్కడ థైరాయిడ్‌ వైద్య పరీక్షలు చేయలేమని తెలిపారు. బయట ప్రైవేట్‌ హాస్పిటల్‌లో థైరాయిడ్‌ సమస్య వైద్య పరీక్షలు చేయించుకున్నాను. టెస్ట్‌ చేయించుకుని డాక్టర్‌ని సంప్రదించగా రిపోర్టు ఆధారంగా థైరాయిడ్‌ ఉండడంతో థైరాడ్‌ సమస్య సంబంధించిన మందులు రాయడం జరిగింది కానీ డిస్పెన్సరీలో గత ఆరు నెలల నుండి థైరాడ్‌ సంబంధించిన మందులు మాత్రం లేవని సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. బయట మందులు కొనడానికి స్తోమత లేక డిస్పెన్సరీలో అందక చాలా ఇబ్బందిగా ఉంది. ఇకనైనా ఉన్నతాధికారులు డిస్పెన్సరీ లో మందుల సమస్యపై దష్టి కేంద్రీకరించి సకాలంలో పేషెంట్లకు పూర్తిస్థాయిలో మందులు అందేవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాను.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close