Featuredస్టేట్ న్యూస్

ఏరులై పారుతున్న మద్యం డబ్బు

  • మున్సిపల్‌ ఎన్నికల్లో జోరుగా ప్రచారం
  • మద్యం డబ్బు పంపిణీ.. పట్టించుకోని అధికారులు

మెదక్‌ ప్రతినిధి (ఆదాబ్‌ హైదరాబాద్‌): కొత్త మున్సిపాలిటీల్లో మద్యం ,డబ్బు ఏరులై పారుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మున్సిపాలిటీలలో మద్యం, డబ్బు ఇళ్లల్లోకి వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు పలువురు అంటున్నారు. మెదక్‌ జిల్లాలో నూతనంగా మూడు మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. అయితే మెదక్‌ మున్సిపాలిటీ గత కొన్ని 3సంవత్సరాలుగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 3 మున్సిపాలిటీలలో ఇటీవలె నూతనంగా ఎన్నికలు జరుగుతున్నాయి. వీరికి గతంలో గ్రామపంచాయతీలో ఉండేవి. అదే తరహాలో మున్సిపాలిటీలు డబ్బు, మద్యం పంపిణీ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇది చూసిన పంచాయతీ అధికారులు గాని ప్రత్యేక అధికారి గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కొందరు బడా నాయకులు పోలీసుల ముందే డబ్బు పంపిణీ చేయడం అందుకు తోడు మద్యం బాటిళ్లు ఇవ్వడం చూసిన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక రెండు రోజులు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆయా మున్సిపాలిటీల్లో ముమ్మర ప్రచారం కొనసాగుతుంది. కొందరు ప్రచారం చేస్తుండగా మరి కొందరు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఓటర్లను మభ్య పెట్టడం జరుగుతుందని అంటున్నారు. దీన్ని అరికట్టాల్సిన ఎన్నికల అధికారులు చూసిచూడనట్లు ప్రభుత్వానికి తొత్తులుగా మారి వారికే మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే దీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని నూతన మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలు కూని చేస్తున్నట్లు సమాచారం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close