విద్య

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు..

నేటినుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు!

రేపటినుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ ల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్‌ ప్రారంభం కానున్నాయి. ఆన్‌ లైన్‌ లో నిర్వహించే ఈ పరీక్షలు 11 వ తేదీవరకూ కొనసాగుతాయి. దీనికోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈమధ్య మార్పు చేసిన ప్రశ్నాపత్రాల ఆధారంగా తొలిసారి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా పెన్ను, పెన్సిల్‌.. అంతెందుకు చిన్న కాగితం ముక్క కూడా పరీక్షకు వెళ్లేవారు తీసుకురావద్దని కచ్చితంగా వారు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన పెన్ను, పెన్సిల్‌, రఫ్‌ వర్క్‌ కోసం కాగితాలు తామే అందిస్తామని వివరించారు. విద్యార్థులు ఈ విషయాలు గమనించాలని అధికారులు తెలిపారు.

తెలంగాణా నుంచి 75 వేల మంది..

ఈ పరీక్షలకు తెలంగాణా రాష్ట్రం నుంచి దాదాపు 75 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారికోసం తెలంగాణలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌ జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్షలు ఇలా..

సోమవారం నుంచి 11వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారితంగా ఆన్లైన్‌ లో పరీక్ష నిర్వహించనుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్ట్‌లుగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మొదటి షిఫ్ట్‌ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయం త్రం 5:30 గంటల వరకు ఉంటుంది. మొదటి షిఫ్ట్‌ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటలలోపు, రెండో షిఫ్ట్‌ పరీక్షకు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గం టలలోపే పరీక్ష హాల్లోకి అనుమతిస్తా రు. ఈ పరీక్షల ఫలితాలను ఈనెల 31వ తేదీలోగా వెల్లడించేందుకు అవకాశం ఉంది.

ప్రశ్నాపత్రం ఇలా..

ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌లో 360 మార్కులకు 90 ప్రశ్నలు ఇచ్చేది. అవన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే. వాటికి నెగటివ్‌ మార్కుల విధానం ఉంది. ఇప్పుడు మాత్రం 75 ప్రశ్నలతో 300 మార్కులకు పరీక్ష నిర్వహించబోతోంది. గణితంలో 25, ఫిజిక్స్‌లో 25, కెమిస్ట్రీలో 25 ప్రశ్నలు ఉంటాయి. ఆ మూడు సబ్జెక్టుల్లో 20 చొప్పున ప్రశ్నలకు ఆబ్జెక్టివ్‌ విధానంలో, 5 చొప్పున ప్రశ్నలను న్యూమరికల్‌ వ్యాల్యూ జవాబు వచ్చే ప్రశ్నలు ఇవ్వనుంది. న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలకు మాత్రం నెగటివ్‌ మార్కుల విధానం ఉండదు.

గుర్తింపు కార్డు తప్పనిసరి..

విద్యార్థుల హాల్‌టికెట్లలో పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో (ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఫొటో కలిగిన ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్‌ తదితర) ఏదేని ఒక ఒరిజినల్‌ ఐడీ కార్డును, హాల్‌టికెట్‌ను తెచ్చుకోవాలి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close