Featuredస్టేట్ న్యూస్

తాటాకు చప్పుళ్లకు భయపడొద్దు

  • ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు
  • కార్మికుల ఆందోళనకు అండగా ఉంటా
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
  • కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే : అశ్వత్థామ రెడ్డి

హైదరాబాద్‌

ఆర్టీసీ ఆస్తులపై తెరాస నేతల కన్ను పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా బీజేపీ ఉంటుందని మరోమారు భరోసా ఇచ్చారు. భాజపాకు ఓటములు కొత్తకాదని.. ఎన్నో ఓటముల తర్వాతే కేంద్రంలో భాజపా వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని.. భాజపా జాతీయ నాయకత్వం కూడా దీన్ని సీరియస్‌గానే పరిగణిస్తోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్‌ కార్యాచరణపై ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్‌ రాజిరెడ్డి చర్చలు జరిపారు. శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యలపై శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా సమ్మె కొనసాగించాలన్నారు. ఎలాంటి బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడవద్దని లక్ష్మణ్‌ చెప్పారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడటమే తమ పార్టీ ధ్యేయమన్నారు. అప్పనంగా రూ.వేలకోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేయడానికి తెరాస ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తప్పకుండా భగ్నం చేస్తామన్నారు. ఆర్టీసీ ఐకాస చేపట్టే ప్రతి కార్యక్రమానికి భాజపా మద్దతిస్తుందని.. అవసరమైతే ఉద్యమాన్ని దిల్లీ స్థాయికి కూడా తీసుకెళ్తామన్నారు. కెసిఆర్‌ చేసినప్రకటన ఆర్టీసి కార్మికులను బెదిరించేదిగా ఉందన్నారు. సంస్థను మూసేస్తామని అనడం ఆయన అహంకారానికి పరాకాష్ట అన్నారు. కార్మికులతో కావాలనే సిఎం కెసిఆర్‌ పెట్టుకుంటే చేసేదేవిూ లేదన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్రం ఏర్పడగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాల్లో మునగడానికి ప్రభుత్వం చేసున్న విదానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఇది ప్రజా రవాణా సంస్థపై పన్నుల భారం మోపుతుందని అభిప్రాయపడ్డారు. ఇక నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. కేసీఆర్‌ ! ఇక విూ పతనం ప్రారంభమైంది, ప్రజలు విూ పాలనను గమనిస్తున్నా రంటూ మండిపడ్డారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ సమ్మె ప్రారంభించి శుక్రవారం నాటికి 21వ రోజుకు చేరిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్ని బెదిరింపులు చేసినా.. ఏ ఒక్క కార్మికుడు విధులకు హాజరుకాలేదన్నారు. సీఎం తన స్థాయి తగ్గి కార్మికులను విమర్శించడం సభ్య సమాజం మొత్తం గమనించిందన్నారు.గురువారం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మనస్తాపం చెంది, ఒత్తడికి లోనై ఓ ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో చనిపోయాడని.. ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం వాస్తవాలు గమనించాలని, బెదిరింపులకు భయపడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెకు అన్ని పార్టీల మద్దతు ఉందని, కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా పోరాడాలని అశ్వత్థామరెడ్డి పిలుపు ఇచ్చారు.

కేసీఆర్‌ చులకన చేసి మాట్లాడారు

ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కార్మికులను చులకన చేసి మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం బెదిరింపులకు కార్మికులు ఎవరూ భయపడటం లేదని చెప్పారు. న్యాయస్థానాలను కూడా ఖాతరు చేయనట్లు కేసీఆర్‌ మాట్లాడారన్నారు. ఈనెల 30న సరూర్‌నగర్‌ మైదానంలో సకల జనుల సభ నిర్వహిస్తామని చెప్పారు. ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని అశ్వత్థామ ఆరోపించారు. కేసులకు భయపడకుండా కార్మికుల పక్షాన మరింత పోరాటం చేస్తానని చెప్పారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితంతో ఆర్టీసీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close