Featuredరాజకీయ వార్తలు

మహాకూటమికి ఓటు మరణశాసనమంత చేటు

”ఎన్నికల కమిషన్‌ పార్టీల తీరుకు తగ్గట్టుగానే గుర్తులను కేటాయించిందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పుల్లలు పెట్టేటోళ్లకు అగ్గిపుల్ల గుర్తు (టీజేఎస్‌) కేటాయించిందని, మొండిచేయి చూపించేటోళ్లకు చేయి గుర్తు (కాంగ్రెస్‌), చెవుల్లో పువ్వులు పెట్టేటోళ్లకు పువ్వు గుర్తు (బీజేపీ), స్పీడ్‌తో దూసుకుపోతున్న వారికి కారు గుర్తు (టీఆర్‌ఎస్‌) కేటాయించింది.” – కేటీఆర్‌

‘ఇప్పుడు జరిగే ఎన్నికలు ఏ ఒక్కరికీ సంబంధించినవి కావు.. తెలంగాణ రైతుల తలరాత మార్చే ఎన్నికలు.. అందుకే మాయమాటలకు మోసపోయి పొరపాటున మహాకూటమికి ఓటేస్తే మనకు మనం మరణశాసనం రాసుకున్నట్లేనని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తతస్థాయి సమావేశంలో.. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో జరిగిన సభలో ఆయన చెప్పారు. ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలని ఆయన కోరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు గోదావరి జలాలను తెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు వద్దంటూ కాంగ్రెసోళ్లు కోర్టుల్లో 200 కేసులు వేశారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ”తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని కాంగ్రెసోళ్లు కేసులు వేస్తే.. ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీకి 30 ఉత్తరాలు రాశారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు వారిద్దరూ ఈ రోజు తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటై తెలంగాణ అభివ ద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఈ ఎన్నికలు మీ తలరాతలు మీరే రాసుకొనే ఎన్నికలు. మహాకూటమి..మాయా కూటమి, కాంగ్రెస్‌కు ఓటేస్తే మన కంటిని మనం పొడుచుకున్నట్టే. కరెంటు అడిగితే కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ది. అడగకపోయినా 24గంటల పాటు రైతులకు విద్యుత్‌ ఇస్తూ కేసీఆర్‌ రైతు బంధువయ్యారు. ఆగమాగమై ఓటేయొద్దు. డిసెంబర్‌లో కేసీఆర్‌ మళ్లీ సీఎం అయ్యాక ఎక్కడ పేదవాడికి జాగా ఉంటే అక్కడే రూ.5లక్షలతో ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. గత మూడు ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచారు. ఆశీర్వదించారు. ఈ సారి కూడా ఆశీర్వదించండి. డిసెంబర్‌ 7న ఎన్నికలు ఉన్నాయి. ఈ 40 రోజుల్లో నాకోసం కష్టపడితే.. వచ్చే 60 నెలలు మీకోసం పాటుపడతా. నాకు చేతనైనంతగా నియోజకవర్గ అభివ ద్ధికి క షిచేశాను. ఆలోచించి ఓటు వేయండి.. ఆషామాషీగా ఓటు వేయొద్దు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ద్రోహులకు పొరపాటున కూడా ఓటు వేయొద్దు” అని ప్రజలకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వస్తున్న మంచి ఆదరణను చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ నేతలు.. ఎక్కడ తమ ఉనికి పోతుందోనన్న భయంతో కోర్టుల్లో కేసులు వేస్తూ కాళ్లకు అడ్డం పెడుతున్నారని మండిపడ్డారు. కోటి ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే.. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 200 కేసులు వేశారని, పనులు జరగకుండా ఆటంకాలు కల్పించామని ప్రతిపక్ష నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు. కోటీ 20 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తే తమ కిందకు నీళ్లొస్తాయనే భయంతో కాంగ్రెస్‌ నేతలు.. చనిపోయిన వారి పేర్లతో కోర్టుల్లో కేసులు వేయించారని, ఇదే విషయాన్ని నీటిపారుదలశాఖ మంత్రి అసెంబ్లీలో రుజువు చేశారని గుర్తు చేశారు. కామారెడ్డి సభలో రాహుల్‌గాంధీ చెప్పినవన్నీ అబద్ధాలేనని కేటీఆర్‌ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు అయితే లక్ష కోట్లు అని రాహుల్‌ పేర్కొన్నారని విమర్శించారు. రీ డిజైన్‌ కారణంగా 16 లక్షల ఎకరాల ఆయకట్టు 36 లక్షల ఎకరాలకు పెరిగిందని, అందువల్లే రూ.40 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు అంచనాలు పెరిగాయని తెలిపారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో మనం కీలక పాత్ర పోషించబోతున్నామని, అప్పుడు కేంద్రంతో ముడిపడి ఉన్న రాష్ట్ర ప్రయోజనాలన్నీ నెరవేర్చుకోవచ్చన్నారు. కేసీఆర్‌ వైద్యం కోసం ఢిల్లీకి వెళ్తే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లాడని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పోలింగ్‌ శాతం పెంచడం ద్వారా మెజారిటీ పెరుగుతుందని ప్రతి కార్యకర్త ఓటర్లందరితో ఓట్లు వేయించే ప్రయత్నం చేయాలని కోరారు. ఎన్నికల కమిషన్‌ పార్టీల తీరుకు తగ్గట్టుగానే గుర్తులను కేటాయించిందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పుల్లలు పెట్టేటోళ్లకు అగ్గిపుల్ల గుర్తు (టీజేఎస్‌) కేటాయించిందని, మొండిచేయి చూపించేటోళ్లకు చేయి గుర్తు ( కాంగ్రెస్‌), చెవుల్లో పువ్వులు పెట్టేటోళ్లకు పువ్వు గుర్తు (బీజేపీ), స్పీడ్‌తో దూసుకుపోతున్న వారికి కారు గుర్తు (టీఆర్‌ఎస్‌) కేటాయించిందని ఆయన చమత్కరించారు. 2004లో తాము కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న దానికేనని కేటీఆర్‌ వివరించారు. 2009లో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ తీర్మానం చేసినందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు టీజేఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకున్నాయో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుతో ఏ ప్రాతిపాదికన పొత్తులు పెట్టు కుంటున్నారో కోదండరాం ప్రకటించాలన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close