Featuredజాతీయ వార్తలు

పాక్‌లోనే డాన్‌

? లేడని బుకాయింపు

? ఆధారాలు బయటపెట్టిన భారత్‌

? చాలహవలేక బతుకుతున్న నీచుడు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

విదేశాలలో బాంబులు పేల్చిన నరహంతకులకు పాకిస్థాన్‌ క్షేమ స్థావరంగా ఉంది. అదిప్పుడు ఆదేశ పాలిట శాపంగా మారింది. అమెరికా కూడా ఒసామా బిన్‌ లాడిన్‌ను మట్టుబెట్టింది ఈ పాక్‌లోనే. భారత్‌లో వరుస బాంబు పేలుళ్ళతో 257మంది అమాయకులను బలిగొన్న ఢీ కంపెనీ సూత్రధారి దావూద్‌ ఇబ్రహీంకు విలాసవంతమైన భవనాన్ని ఏర్పాటు చేసింది కూడా పాకిస్థానే. తీవ్రవాద సంస్థ జైషేకు ‘టచ్‌’లో ఉన్నట్లు పాక్‌ బహిరంగంగా అంగీకరించింది. ఉగ్రవాది మసూద్‌ కూడా తమ దగ్గరే ఉన్నట్లు పాక్‌ తెలిపింది. ఇలాంటి ఉగ్ర మూలాలను భారత వేగులు సంపాదించి ఎన్నిసార్లు అంతర్జాతీయ వేదికలపై చెప్పినా వినే నాథులు కరవయ్యారు. ఇప్పుడు భారత్‌ బలీయమైన దేశంగా ఎదుగుతోంది. మనదేశంతో స్నేహంగా, సన్నిహితంగా ఉండటానికి అగ్ర దేశాలు తహతహ లాడుతున్నాయి. పాకిస్థాన్‌ దేశాన్ని ఉగ్రమూలాల నుంచి బయటపడేయటానికి భారత్‌ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గురించి ఆధారాలతో భారత ఇంటిలిజెన్స్‌ బ్యూరో ఐక్యరాజ్యసమితికి అందించిన నివేదిక ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ సంపాదించి అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఎవడీ దావూద్‌ ఇబ్రహీం:

దావూద్‌ 1955, డిసెంబరు 27న మనదేశంలోని మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. తండ్రి ఒక సాధారణ కానిస్టేబుల్‌.ముంబై మహా నగర నేరకేంద్రం డోంగ్రీలో 1974లో సృష్టించిన సంచలనం ద్వారా మొట్టమొదట నేర సామ్రాజ్యంలో ఇతని పేరు మారుమోగింది. అప్పటికి అక్కడ డాన్గా ఉన్న పఠాన్‌ బాషు దాదా విూద ఇతడు సోడాసీసాలతో దాడి చేశా డు. ఆపై హాజీ మస్తాన్‌, వరదరాజన్‌ మొదలియార్‌, కరీంలాలా వంటి డాన్లను పక్కకు నెట్టేసి పైకొచ్చాడు. 1950లలో కేవలం కత్తిపోట్లకు పరిమితమైన ముంబైమాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకువెళ్లినవాడు దావూద్‌.

డి కంపెనీ:

1976లో అతడు ప్రారంభించిన ‘డి కంపెనీ’ పెద్ద నేరాలే చేసేది. 1982 నాటి ముంబై కార్మికుల సమ్మె నగరం స్వరూపాన్నే కాదు, మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది. డి కంపెనీ ఆయుధాల రవాణా, హవాలా, దొంగనోట్లు, మత్తు పదార్థాల రవాణా, బెదిరించి డబ్బు వసూలు చేయడం, కాంట్రాక్ట్‌ హత్యల వరకు విస్తరించింది. ‘బిగ్‌ డి’ సినిమాలకు పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాడు. బాలీవుడ్‌ ప్రముఖులతో కూడా దావూద్‌ సంబంధాలు కలిగి ఉన్నాడు. భరత్షా వంటి వారు ఈ కారణంగా అరెస్టయ్యారు. నటి మందాకినితో దావూద్‌ సంబంధం ఇంకా గాఢమైనది. అయోధ్య పరిణామాల అనంతరం ఛోటా రాజన్‌ కొత్త కుంపటి పెట్టుకున్నాడు. అయోధ్య ఘటనలకు ప్రతీకారంగానే 1993 ముంబై వరస పేలుళ్లు జరిగాయి. దీంట్లో కీలక పాత్రధారి టైగర్‌ మెమన్‌, దావూద్‌ ముఖ్య అనుచరుడు. ఆ పేలుళ్ల సమయంలో నగరంలోని లేని దావూద్‌ మళ్లీ భారత్లో కనిపించలేదు. 257 మంది మృతికి కారణమైన ఆ పేలుళ్ల వెనుక దావూద్‌ ఉన్నాడని మన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత ఇతను మనదేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్‌ పారిపోయాడు. అప్పటినుండి డి కంపెనీకి పాక్‌ కేంద్రమైంది. అల్‌ కాయిదా, లష్కరే తాయిబా వంటి మత ఛాందస సంస్థలతో దావూద్‌ బంధం అక్కడ నుంచే ప్రారంభమైంది.ఒసామా బిన్‌ లాడెన్తో దావూద్కు సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది అఫ్ఘానిస్థాన్‌ నుంచి అల్‌ కాయిదా సభ్యులు పారిపోవడానికి తన మాఫియా మార్గాలను దావూద్‌ చూపించాడు.కరాచీలో దావూద్‌ ఉన్నాడని మొదటి నుంచి మనదేశం ఆరోపిస్తూనే ఉంది. దావూద్‌ భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్‌ పాస్పోర్టులు ఉన్నాయి. అయితే దావూద్‌ దేశంలో ఉన్నట్టు పాకిస్థాన్‌ ఏనాడూ అంగీకరించలేదు.కరాచీకేంద్రంగా ఇతడు దక్షిణాసియా మొత్తం తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు.మలేసియా, సింగపూర్‌,థాయ్లాండ్‌, శ్రీలంక,నేపాల్‌, దుబాయ్‌ లతో పాటు జర్మనీ, ఫ్రాన్స్‌,ఇంగ్లండ్లలో కూడా ఇతడి కార్యకలాపాలు విస్తరించాయి. ఇతడి లావాదేవీల విలువ 3 వేల కోట్ల రూపాయలకు పైనే. 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణంలోనూ డి కంపెనీ పాత్ర ఉంది.

టఔనీబివ:

ఃనీలీ 1బబి జూజీణవ లో కొంచహత వాడండి)

దావూద్‌ అడ్రస్‌ లు ఇవే:

కరాచీ శివార్లలోని క్లిప్‌ టన్‌ అనే ప్రాంతంలో ప్రస్తుతం దావూద్‌ ఇబ్రహీం నివాసం ఉంటున్నాడు. అతగాడి మూడు చిరునామాలు ఇవి.

1) డి-13, బ్లాక్‌-4, కారాచీ డెవలప్‌ మెంట్‌ అథారిటీ, ఎస్‌ సీహెచ్‌-5, క్లిప్టన్‌, కరాచీ, పాకిస్థాన్‌

2) 6ఏ, ఖయబాన్‌ తంజీమ్‌, ఫేజ్‌ 5, డిఫెన్స్‌ హౌసింగ్‌ ఏరియా’, కరాచీ, పాకిస్థాన్‌.

3) మెయిన్‌ ప్యాలెస్‌, రెండో అంతస్థు, అబ్దుల్లా షా ఘాజీ దర్గా సవిూపంలో, క్లిఫ్టన్‌, కరాచీ, పాకిస్థాన్‌.

ఇంటర్‌ పోల్‌ ఇప్పటికే రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసిన మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు ముచ్చటగా మూడు పాస్‌ పోర్టులు కూడా పాకిస్థాన్‌ ఇచ్చింది.

సకుటుంబ సపరివారంగా..:

దావూద్‌ కు భార్య, ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని వెలుగు చూసింది. భార్య మెహజబీన్‌ షేక్‌, కొడుకు మె?యి?న్‌ నవాజ్‌, కుమార్తెలు మహరుక్‌, మెహ్రీన్‌, మాజియాతో కాలిసి దావూద్‌ ఇబ్రహీం ఒకే ప్రాంతంలో వేర్వేరుగా ఉంటున్నారు.

దావూద్‌ ఇబ్రహీం కుమారుడు మె?యి?న్‌ కు సానియా అనే అమ్మాయితో వివాహం అయింది.

కుమార్తె మహరూఖ్‌ కు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ జూవేద్‌ మియాందాద్‌ కొడుకు జునాయిద్‌ తో వివాహం అయ్యింది.

టెలిఫోన్‌ బిల్లులు:

2015 ఏప్రిల్‌ నెలలో దావూద్‌ ఇబ్రహీం భార్య మెహజబీన్‌ షేక్‌ పేరుతో ఉన్న టెలిఫోన్‌ బిల్లులు భారత్‌ నిఘా వర్గాలు సేకరించాయి.

మా వద్ద లేడు: పాక్‌

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రదారి అయిన దావూద్‌ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాక్‌ పదే పదే పాట పాడింది.అయితే ఇప్పుడు భారత్‌ నిఘా వర్గాలు పక్కా ఆదారాలు సేకరించడంతో పాక్‌ కు నోరు మెదపలేని పరిస్థితి వచ్చింది. దావూద్‌ చెందిన ఈ ఆధారాలు బయటపడటంతో పాక్‌ నోట్లో వెలక్కాయపడినట్లు అయ్యింది.

2పనీలీ:

వారసుల ఆధ్యాత్మిక మార్గం

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, ఆయన ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్కు ‘ఆద్యాత్మిక రూపంలో’ షాక్‌ తగిలాయి. దావూద్‌ కొడుకు మోయిన్‌ నవాజ్‌ (31) ఇస్లాం మత ప్రబోధకుడి (మౌలానా)గా మారడంతో దావూద్‌ ఇబ్రహీం డిప్రెషన్కు గురయ్యాడు. అతని ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్‌ కొడుకు కూడా ఆధ్యాత్మిక జీవితానికే మొగ్గుచూపడంతో ముంబై అండర్‌ వరల్డ్‌ లో తీవ్ర అలజడి నెలకొంది. దీంతో డీ-గ్యాంగ్‌ సృష్టించిన కోట్ల రూపాయల అధో ప్రపంచానికి వారసుడు కరువయ్యాడని కొందరు చెప్తున్నారు. కాగా, ముబషీర్‌ అంటే మంచి వార్తలు మోసుకురావడం అని అర్థం. దావూద్‌ కొడుకు స్ఫూర్తితో ముబషీర్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని పలువురు భావిస్తున్నారు. చివరకు ఈ మాఫియా డాన్ల పరిస్థితి ఆరోగ్యం సరిగా లేక , కొడుల వ్యాపకాలతో దయనీయంగా మారింది. దటీజ్‌ గాడ్‌.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close