విద్యార్థికి చేయూత

0

నోట్‌బుక్స్‌ను అందించిన శ్రీ ఆకాంక్ష చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు పాలపర్తి సంధ్యారాణి

ఉన్నత విద్య… పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారుతోంది. మంచి విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ప్రతిభ ఉన్నా డబ్బులు లేక ఉన్నత చదువులకు దూరమయ్యే విద్యార్థులెందరో. వారికోసమే అనేక సంస్థలు ఆర్థికంగా చేయూతనిస్తుంటాయి. అలాంటే సంస్థ శ్రీ ఆకాంక్ష చారిటబుల్‌ ట్రస్ట్‌. ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు పాలపర్తి సంధ్యారాణి కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ గంగపుత్ర కాలనీలో చదువుతున్న చిన్నారి షణ్ముఖకు ఏడవ తరగతి పుస్తకాలను, నోట్‌బుక్స్‌ను, ఆర్థిక ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పాలపర్తి సంధ్యారాణి మాట్లాడుతూ.. శ్రద్ధగా చదువుకొని మార్కుల తెచ్చుకుంటే పై చదువులకు సాయం చేస్తానని అన్నారు. చదువులో ఎలాంటి ఒత్తిళ్లకు గురికావద్దని, వాటిని జయిస్తూ వత్తిళ్లను అధిగమించాలనిసూచించారు. ఈ కారక్రమం లో మేఘన, వేణు, గీతిక తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here