Featuredస్టేట్ న్యూస్

కేటీఆర్‌ స్థాయికి మించి మాట్లాడకు

  • సీనియర్‌ నేతను బఫూన్‌ అంటావా?
  • గ్లోబరీనాకోసం 20ఏళ్లుగా పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థను తప్పించారు
  • విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆర్‌, కేటీఆర్‌లు బాధ్యత వహించాలి
  • కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో 48గంటల నిరసన దీక్ష
  • పాల్గొని సంఘీభావం తెలిపిన వీహెచ్‌, రేవంత్‌

హైదరాబాద్‌, (ఆదాబ్‌ హైదరాబాద్‌): నిన్నమొన్న రాజకీయాల్లో వచ్చిన కుర్రకుంక కేటీఆర్‌ అని.. అలాంటి కుర్రకుం సీనియర్‌ నేతలపై బఫ్రూన్‌ అంటూ వ్యాఖ్యానిస్తున్నాడని, కేటీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. ఇంటర్‌ అవకతవకలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. గురువారం గాంధీభవన్‌ వద్ద యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ నేతలు 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. వారి దీక్షకు రేవంత్‌తో పాటు వీహెచ్‌ హన్మంతరావులు సంఘీ భావం తెలిపారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ.. విర్థుల జీవితాలతో ప్రభుత్వం, అధికారులు చెలగాటం ఆడుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై వి. హనుమంతరావు పోరాడుతుంటే.. కుర్రకుంక (కేటీఆర్‌) ఆయన్ని బఫూన్‌ అంటున్నారని మండిపడ్డారు. ఎంత బలుపు పాలన కొనసాగుతుందో దీనిబట్టి అర్థం చేసుకోవాలని అన్నారు. వీళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చిందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 20 ఏళ్లుగా పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ సంస్థను తప్పించి.. కేటీఆర్‌ తన స్నేహితుల సంస్థ గ్లోబరీనాకు టెండర్‌ ఇచ్చారని రెవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఎంసెట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ఇంతవరకు చర్యలు లేవని విమర్శించారు. కేటీఆర్‌ ఫ్రెండ్‌ మామ సంస్థ అయిన మాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌పై.. ఇంత వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తండ్రి, కొడుకులు ఎందుకు మాట్లాడడం లేదని రేవంత్‌రెడ్డి నిలదీశారు.

నేను రెచ్చిపోతే ప్రభుత్వం పడిపోతుంది – వీహెచ్‌

తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేటీఆర్‌ ఇంకా పుట్టలేదని అన్నారు. అలాంటిది ఆయన తనను బఫూన్‌ అంటున్నారని... మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. తాను రెచ్చిపోతే ప్రభుత్వం పడిపో తుందని హెచ్చరించారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నారని వీహెచ్‌ విమర్శించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇళ్లపై ప్రజలు దాడులు చేయాలని వీహెచ్‌ పిలుపు ఇచ్చారు. కేటీఆర్‌ తన బావ మరిది స్నేహితుడికి గ్లోబరీనా టెండర్‌ ఇచ్చారని మరోసారి ఆరోపించారు. బావమరిది విూద మోజుతో 22మంది విద్యార్థులను బలిగొన్నారని హనుమంతరావు విమర్శించారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ తలపెట్టిన ఈ దీక్షలో  కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద వీరికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఇంటర్‌ బోర్డులో అనేక అక్రమాలు జరిగాయని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌ ఆరోపించారు. దీనిపై అనేక సార్లు ఇంటర్‌ బోర్డు విద్యార్ధులకు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఫలితాలన్నీ తప్పులతడకగా ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిని ఎందుకు బర్తరఫ్‌ చేయరని ప్రశ్నించారు. విద్యార్ధుల పేపర్లను ఆన్‌ లైన్‌ లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన విద్యార్ధుల కుటుంబాలను గాలికి వదిలేశారని అన్నారు. చనిపోయిన ఒక్కో విద్యార్ధి కుటుంబానికి రూ.25లక్షల ఆర్ధిక సహాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బోర్డు అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జ్‌ తో విచారణ జరపాలని, ఈ దీక్ష కేవలం 48 గంటలకు పరిమితం కాదు.. అవసరమైతే టీఆర్‌ఎస్‌ నాయకులను రోడ్లపై తిరుగనివ్వమని వెంకట్‌ స్పష్టం చేశారు.
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close