ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్‌ చేయకండి: లారెన్స్‌

0

‘ముని’ సిరీస్‌లో భాగంగా లారెన్స్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాంచన 3’. ఈ సిరీస్‌లో వచ్చిన గత చిత్రాల్లో లాగే ఇందులో కూడా ఆయనే లీడ్‌ రోల్‌ పోషించారు. హార్రర్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించ బడువుతోంది. అయితే ఓ థియేటర్‌ వద్ద లారెన్స్‌పై తన అభిమానాన్ని చాటుకుంటూ ఓ అభిమాని రిస్కీ ఫీట్‌ చేశాడు. భారీ క్రేన్‌ సహాయంతో తన చేతుల మీదుగా లారెన్స్‌ కటౌట్‌కి పూలమాల వేసి పాలాభిషేకం చేశాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ లారెన్స్‌ దష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన లారెన్స్‌.. ఇలాంటి ఘటనలు తనకు నచ్చవంటూ అసంతప్తి వ్యక్తంచేశారు. ఈ మేరకు సామాజిక స్ప హతో ఆలోచించి సోషల్‌ మీడియా వేదికగా ఓ సందేశం ఇచ్చారు. ”అభిమానులు, స్నేహితులకు నా విన్నపం. ఓ అభిమాని క్రేన్‌కు వేలాడుతూ థియేటర్‌ ముందున్న నా బ్యానర్‌కు పాలాభిషేకం చేస్తున్న వీడియోను చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధనిపించింది. దయచేసి ఇలాంటి రిస్క్‌లను తీసుకోవద్దని నా అభిమానుల్ని కోరుతున్నాను. మీ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి.. నాపై ఉన్న ప్రేమను చూపడం సరికాదు. మీ కోసం ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు. వారిని మనసులో ఉంచుకుని మెదలండి. నిజంగా మీకు నాపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని ఉంటే.. పేద పిల్లలకు పుస్తకాలు కొనివ్వండి, ఫీజులు కట్టలేని వారికి ఫీజులు కట్టండి, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వ ద్ధులకు అన్నం పెట్టండి. అదే నాకు సంతోషాన్నిస్తుంది, గర్వపడేలా చేస్తుంది. ఇలాంటి పనులను నేను ప్రోత్సహించను. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకూడదని కోరుతున్నా. మీ జీవితం ఎంతో విలువైంది.. దాన్ని గుర్తు పెట్టుకోండి” అని లారెన్స్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here