ప్రత్యర్థులను వదిలేది లేదు

  0

  తమ పార్టీ అధికారంలోకి రావద్దని, రాకూడదని అందరూ వ్యతిరేకంగా పనిచేశారు.. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారారు. ఎన్నికలలో ఎవరెవరు ఏలా పనిచేశారో, ఎవరికి మద్దతు పలికారో అంతా మాకు తెలుసు. ఎవరి ప్రచారం ఏలా ఉందనే విషయాలపై కూడా పూర్తి సమాచారం ఉంది. అందరి జాతకాలు ఉన్నాయి.. అందుకే వ్యతిరేకులెవరిని వదిలెట్టేదీ లేదంటున్నారు తారక రామారావు.. బంగారు తెలంగాణలో తెరాస పార్టీ ప్రజల కోసం ఎన్నో చేసింది. ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టింది. తెలంగాణను మిగతా రాష్ట్రాలు స్పూర్తిగా తీసుకుంటుంటే మన దగ్గరి వాళ్లు మాత్రం తెరాస ప్రభుత్వం పని తక్కువ, మాటలు ఎక్కువ అన్నట్టు వ్యవహరించింది అంటున్నారు కెటిఆర్‌. తండ్రి కెసిఆర్‌ రెండోసారి అధికారం ఇచ్చిన ప్రజలకు మంచి చేయాలని చెపుతుండగా కేటీఆర్‌ మాత్రం వ్యతిరేకుటను వదిలేది లేదంటున్నారు.. 

  హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ప్రజల సమస్యలను పరిష్కరించండీ, గ్రామాలను, రాష్ట్రాలను అభివృద్ది చేయండని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రజలు అధికారం ఇచ్చారని వారికి అనుకూలంగా ఉంటూ, వారి అభివృద్దికి పాటుబడుతూ, వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఎన్నికల ప్రచారంలో జరిగిన కోపతాపాలు ఎన్ని ఉన్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా లోలోపల దాచుకుంటూ అవసరం వచ్చినప్పుడు వాడుతుంటారు, అదీ అధికారంలో ఉన్న నాయకులు చేసే పని, కాని బంగారు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చారని సంతోషపడకుండా ఎవరెవరు వ్యతిరేకంగా పనిచేశారో, వారి చిట్టా మొత్తం విప్పుతానంటుంది. గెలిచినా, ఓడినా నాయకులు చేయాల్సిన పని అదీ కాదని ఎంత చెప్పినా మాకు నచ్చిందే చేస్తాం అంటూ ముందుకు పోవడం కరెక్ట్‌ కాదంటున్నారు రాజకీయ నిపుణులు. ఎన్నికలలో ఎవరెవరు వ్యతిరేకంగా పనిచేశారు… ఎవరెవరు ప్రతిపక్షాలకు అనుకూలంగా ప్రచారం చేశారో వారందరిని వదిలేది లేదు.. ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే టిఆర్‌ఎస్‌ను శత్రువుల్లా చూపించారు.. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారారు. అందరి జాతకాలు మా దగ్గర ఉన్నాయి. నేను మా తండ్రిలాగ ఉదారత్వం లేదని తమ పార్టీని నష్టపరిచేవారిని, వ్యతిరేకించే వారిని ఉపేక్షించే సమస్యే లేదంటున్నారు కెటిఆర్‌.. ఇప్పటికైనా పద్దతి మార్చుకోకుంటే అవకాశాన్ని బట్టి తాము ఏం చెయ్యాలో ఆలోచిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి గెలుపు అంత ఈజీ కాదని ఊహించిన తెరాస పార్టీనే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థులపై, పార్టీ వ్యతిరేకులపై విరుచుకుపడుతుంది. తెలంగాణలో తామే బలమైన రాజకీయ శక్తి అంటూ ఆ బలం బాధ్యతతో కెసిఆర్‌, కెటిఆర్‌లు ఆనందంతో ఉన్నారు. ఐదే తండ్రి కెసిఆర్‌ గెలిచాక కాస్త సంయమనం పాటించాలని ఎన్నికల ముందు జరిగిన విషయాలను వదిలేయాలని, ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై మాటల తూటాలు మామూలేనంటూ చెపుతున్న కెసిఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపేలా ఆలోచన చేస్తున్నారు. మన మీద ప్రతిపక్షాల్లో ఇంత వ్యతిరేకత ఉన్న ప్రజలు మాత్రం నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టారని దానికి కాపాడుకుంటూ ప్రజలకు నాలుగు మంచి పనులు చేస్తే మంచిదనే ఆలోచనలతో కెసిఆర్‌ ఉండగా, కెటిఆర్‌ మాత్రం తమ పార్టీపై, మాపై తప్పుగా ప్రచారం చేసిన వారెవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. కెసిఆర్‌ పార్టీ వ్యతిరేకులు, శత్రువులపై అంత ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది కాని కెటిఆర్‌ మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. తమను ఓడించేందుకు కుట్ర పన్నిన వారికి తగిన బుద్ది చెప్పేలాగానే ఉన్నాయి ఆయన మాటలు, పనితీరు…

  వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవు..

  కెసిఆర్‌ ఎన్ని చెప్పినా కెటిఆర్‌ మాత్రం మాటలు వినే పరిస్థితిలో లేరు. పార్టీని, ప్రభుత్వాన్ని మరింత అభివృద్ది చేయాలంటే శత్రువులను, మిత్రులుగా చేసుకుంటే అందరిని కలుపుకొని ముందుకు పోవాలి. అప్పుడే పార్టీ నిర్మాణం బలంగా ఉంటుంది. కాని ఇక్కడి యువ నాయకుడు మాత్రం ఏది ఏమైనా కాని ఎవ్వరిని వదిలేది లేదు అంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ వర్కింగ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కెటిఆర్‌ కొన్ని రోజుల్లోనే తెలంగాణ సిఎంగా కూడా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఒక రాష్ట్రానికి సిఎంగా పనిచేస్తున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రజలందరికి జవాబుదారీగానే ఉండాలి. అప్పుడు మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ది కోసం పాటుబడాలి. కాని ఇక్కడ జరుగుతున్న తతంగమంతా వేరుగానే ఉంది. తెలంగాణ ఎన్నికలప్పుడు కొంతమంది అధికారులు, తెరాసలోని నాయకులతో పాటు సోషల్‌ మీడియాలో కూడా వ్యతిరేకంగా ప్రచారం చేసారని తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మరథం పట్టారని, చంద్రబాబు రంగ ప్రవేశంతో చేయడంతో టిఆర్‌ఎస్‌ వ్యతిరేకంగా చూస్తే కాంగ్రెస్‌కు ప్రచారం చేశాయి. దాదాపు కాంగ్రెస్‌ గెలుస్తుందంటూ ప్రచారం చేశారు. ఎన్నికల ముందు సోషల్‌ మీడియాతో పాటు పార్టీ వ్యతిరేకులు చేసిన ప్రచారాన్ని చూసి కెటిఆర్‌, కెసిఆర్‌ సైతం ఓటమి తప్పదేమోనంటూ డీలా పడిపోయారు. ధైర్యం కొల్పయారు. కాని ప్రజలు టిఆర్‌ఎస్‌కే పట్టం కట్టడంతో కెసిఆర్‌ ఎన్నికల ముందు జరిగినా విషయాలను వదిలేసినా, కెటిఆర్‌లో మాత్రం ఆ బాధ రగులుతూనే ఉంది. అందుకే ఎప్పటికప్పుడు జరుగుతున్న సమావేశాల్లో ఆయన తెలిసి, తెలియనట్టే బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలంగాణలో తమకు బలమైన ప్రత్యర్థులు లేరని, ఇక రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడపాలని ఆలోచిస్తుండగా కెటిఆర్‌ మాత్రం తన తండ్రి మాదిరిగా తనకు ఉదారత్వం లేదని, తమను తమ పార్టీని నష్టపరిచేలా చేసే చర్యల్ని తాను ఉపేక్షించనని తన సన్నిహితులతో చెప్పడం సంచలనాన్ని రేపుతోంది. ఎన్నికల వేళ టిఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించేవారిని అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశమవుతున్నాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here