ఈ ఛాన్స్‌ వదలొద్దు నిఖిల్‌

0

రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చిన నిఖిల్‌ అర్జున్‌ సురవరం ఎట్టకేలకు మరో డేట్‌ని పక్కా చేసుకుంది. మే 17కి రూట్‌ ని క్లియర్‌ చేసుకుని థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. నిజానికి ఏప్రిల్‌ చివర్లో వచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకున్న నిఖిల్‌ టీమ్‌ ఎవెంజర్స్‌ ప్రభంజనానికి కాస్త వెనుకంజ వేసింది. అది మరీ భారీగా కాదు కానీ నాలుగు రోజుల హం గామా తర్వాత చల్లబడిపోయింది. సరే మే 1 అనుకున్నారు కానీ మహర్షి దగ్గరలో ఉంటుంది ఉంది కాబట్టి థియేటర్ల సమస్య రావొచ్చనే ఉద్దే శంతో అదీ ఆప్షన్‌గా పెట్టుకోలేదు. ఇప్పుడు మహేష్‌ వచ్చేశాడు. బ్లాక్‌ బస్టర్‌ అయ్యుంటే ఓ పది రోజుల పాటు ఇంకెవరిని దరిదాపుల్లోకి రానిచ్చే వాడు కాదు కానీ సీన్‌ వేరేలా ఉంది. టాక్‌ పరంగా చూసుకుంటే మహేష్‌ సినిమా మరీ ఆశించిన అద్భుతాలు చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తు న్నాయి కంటెంట్‌లో రిపీట్‌ వేల్యూ తక్కువగా ఉండటంతో మహర్షి వీకెండ్‌ తర్వాత స్లో అయ్యే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. ఒకవేళ అలా జరిగినా జరగక పోయినా మే 17 నాటికి ఇదే జోరు కొనసాగించడం జరగని పని. ప్రేక్షకులు కొత్త సినిమా కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు అర్జున్‌ సురవరం ఫిక్స్‌ అయ్యింది కాబట్టి మంచి ఛాన్స్‌ అని చెప్పొచ్చు. ఇదేమి రెగ్యులర్‌ జానర్‌లో వచ్చే లవ్‌ స్టోరీనో యూత్‌ మూవీనో కాదు. సోషల్‌ కాజ్‌ మీద రూపొందించిన ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. సో అర్జున్‌ సురవరంపై లుక్‌ వేసే పబ్లిక్‌ ఎక్కువగా ఉంటారు. ఇది పసిగట్టే మహర్షి ఫ్యూచర్‌ ని ఆ టైంకంతా ఎలా ఉంటుందో లెక్కగట్టి మరీ తమ సినిమాని ఫిక్స్‌ చేసింది నిఖిల్‌ టీమ్‌. లేట్‌ అయితే అయ్యింది కానీ సరైన సమయంలోనే లాండ్‌ అవుతుంది అర్జున్‌ సురవరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here