Thursday, March 28, 2024

మీడియా సెంటర్ ను ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్

తప్పక చదవండి
  • ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించదానికి మీడియా సహకరించాలి

ఇబ్రహీంపట్నం : రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని రంగారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని రూమ్ నెం.15లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ లాంఛనంగా ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను ఎంసిఎంసి పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు వంటివి సకాలంలో ఆమోదిస్తూ, మంజూరు చేయాలని సూచించారు.

షాటిలైట్ ఛానెల్స్ లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని అన్నారు. వార్తా పత్రికలు, ఈ-పేపర్‌లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్లు, సోషల్ మీడియా, మూవీ హౌస్‌లు మరియు సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను ఎంసిఎంసి నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల పై ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని స్పష్టం చేసారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించదానికి మీడియా పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, భూపాల్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారిణి ఎన్.పద్మశ్రీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ నర్సింహ, అడిషనల్ పిఆర్ఓ బి.బాలేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు….

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు