Thursday, April 25, 2024

రేవంత్‌ నమ్ముకుంటే ఆగంకాక తప్పదు

తప్పక చదవండి
  • కామారెడ్డి, కొడంగ్‌లో తుక్కుగా ఓడించాలి
  • రేవంత్‌, కాంగ్రెస్‌లను ఓడిస్తేనే దరిద్రం పోతది
  • కొడంగల్‌ సభలో సిఎం కెసిఆర్‌ విమర్శలు

కొడంగల్‌ : రేవంత్‌ రెడ్డి లాంటి దొంగలతో రాష్టాన్రికి తీరని నష్టం జరుగుతందని., ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు..పొయేద్ది లేదని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. రేవంత్‌, కాంగ్రెస్‌ లాంటి వారిని తరిమితే తప్ప దరిద్రం వదలదని అన్నారు. కొడంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ రేవంత్‌ టార్గెట్‌గా మండిపడ్డారు. కామారెడ్డిలో కూడా పోటీకి వచ్చాడని, అక్కడ తుక్కుతుక్కుగా ఓడించబోతున్నారని, ఇక్కడా ఓడిస్తేనే కొడంగల్‌ బాగుపడుతుందని అన్నారు. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి పెద్ద భూకబ్జాదారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారు. రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదు. రేవంత్‌ నోరు తెరిస్తే గబ్బు. ఆయన టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులపైకి రేవంత్‌ తుపాకీ పట్టుకొని వెళ్లారు. కాంగ్రెస్‌ నేతలకు వ్యవసాయం గురించి ఏవిూ తెలియదు. రేవంత్‌ రెడ్డి ఏనాడైనా వ్యవసాయం చేశారా? పొలం దున్నారా? అందుకే ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నీతి నియమం లేని వ్యక్తి రేవంత్‌ రెడ్డి. రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడిన ఆయన తీరును ప్రజలంతా టీవీల్లో చూశారు. ఇవన్నీ చేసినా రేవంత్‌ రెడ్డి మళ్లీ సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రేవంత్‌ సీఎం అవుతాడని
ఓట్లేస్తే కొడంగల్‌ పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుందని అన్నారు. కొడంగల్‌లో పనులన్నీ చేసి పెట్టే నరేందర్‌ రెడ్డి కావాలా? ఉత్త మాటలు చెప్పే రేవంత్‌ రెడ్డి కావాలా? ప్రజలే తేల్చుకోవాలని పిలుపు ఇచ్చారు.ఇప్పుడు కొడంగల్‌లో సరిపోలేదని.. కామారెడ్డిలో నాపై పోటీకి వస్తున్నారు. రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లో చిత్తుగా ఓడిరచాలి. నేనే సీఎం అనేవాళ్లు కాంగ్రెస్‌లో 15 మంది ఉన్నారు. అయినా కాంగ్రెస్‌ గెలిస్తే కదా.. రేవంత్‌ సీఎం అయ్యేది. రేవంత్‌ సీఎం అవుతాడని ఓట్లేస్తే కొడంగల్‌ పరిస్థితి మళ్లీ మొదటికే. ప్రజలు ఇవన్నీ గమనించాలి. కొడంగల్‌లో పనిచేసే నరేందర్‌ రెడ్డి కావాలా? వట్టిమాటలు చెప్పే రేవంత్‌ రెడ్డి కావాలా? ప్రజలే తేల్చుకోవాలి. ఎమ్మెల్యేగా ఎవరుంటే కొడంగల్‌ గౌరవం పెరుగుతుందో ప్రజలే నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి పెద్ద భూకబ్జాదారు అని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటు న్నారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయలేదని.. రేవంత్‌ నోరు తెరిస్తే గబ్బు అని ఎద్దేవా చేశారు. నీతి నియమం లేని వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని ఆరోపించారు. ఎమ్మెల్యేలను రూ.50 లక్షల డబ్బుల బ్యాగుతో కొంటూ పట్టుబడ్డారని గుర్తు చేశారు. కొడంగల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లో చిత్తు చిత్తుగా ఓడిరచాలని కోరారు. ఎవరికి వారు నేనే సీఎం అని కాంగ్రెస్‌ లో దాదాపు 15 మంది తిరుగుతూ ఉంటారని అన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే కదా.. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యేదని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు