Featuredస్టేట్ న్యూస్

మాములు మత్తులో…జిల్లా విద్యాశాఖాధికారి?

డిప్యూటీ ఈవో అండతో అదనపు తరగతులు

షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసి చేతులు దులుపుకున్నా అధికారులు

ఎనిమిది నెలలు గడుస్తున్న ఫలితం శూన్యం

పాఠశాలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 660

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైద రాబాద్‌): ఐక్యూ ఇంటర్నే షనల్‌ పాఠ శాల యాజమా న్యంతో కుమ్మకై అవినీతికి పాల్పడ్డ జిల్లా విద్యా శాఖ అధికారి, ముషీరాబాద్‌ ఉప విద్యాశాఖ అధికారి సామ్యూ ల్‌ రాజ్‌ పూర్తి సహకారంతో 8,9, 10 వ తరగతులను ఎలాంటి అనుమతులు లేకుం డా పాఠశాల యాజమాన్యం కొంత కాలం నుండి తరగతులను కొనసాగిస్తుందని విద్యార్థి తల్లిదం డ్రులు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని తరగతులు కొన సాగు తున్న విషయం తెలిసి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఉప విద్యా శాఖ అధికారి విధి నిర్వహణ ఎంత నిర్లక్ష్యంగా ఉంద న్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఐక్యూ ఇంటర్నేషనల్‌ పాఠశాల యజమాన్యం బోగస్‌ బదిలీ సర్టిఫికెట్‌ జారీచేసిన విషయ ంపై విద్యార్థి తండ్రి మహమ్మద్‌ అమీన్‌ తేదీ 24 – 5 – 2019 ఉప విద్యాశాఖ అధికారి సామ్యూల్‌ రాజ్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం పాఠశాల యాజమాన్యానికి ఉప విద్యాశాఖ అధికారి మొహమ్మద్‌ అమీన్‌కి పాఠశాల కరస్పాండెంట్‌ మొహ మ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌ తేదీ 21.5.2019 రోజున జారీచేసిన బదిలీ సర్టిఫికెట్‌ నెంబర్‌ 279506లో పాఠశాలకు పదవ తర గతి వరకు అనుమతులు ఉన్నట్టు తెలపడం జరిగింది. ఈ విషయంపై డిప్యూటీ ఈవో ఐ క్యూ ఇంటర్నేషనల్‌ పాఠశాల ప్రిన్సిపల్‌కి షోకాజ్‌నోటీస్‌ =ష.చీశీ 221/వీదీ/2019.స్‌ 30.05.2019 ద్వారా 24 గంటల్లోగా వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వ డం జరిగింది. పాఠశాల యాజమాన్యం తేదీ 31. 05.2019 షోకాజ్‌ నోటీస్‌ కి సమాధానం ఇవ్వడం జరిగింది.

కానీ డిప్యూటీ ఈవో సామ్యూల్‌ రాజ్‌, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట నరసమ్మ కోర్టు ఆదేశాల ప్రకారం చీటింగ్‌ కేసు నమోదయిన ఈ రోజు వరకు కూడా పాఠశాల పై చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. పాఠశాల యాజమాన్యంతో లోపాయకారి ఒప్పం దం కుదు ర్చుకున్న విద్యాశాఖ అధికా రులు చర్యలు తీసు కోక పోవ డానికి ముఖ్య కార ణమని విద్యార్థి తల్లిదం డ్రులు ఆరోపి స్తున్నారు. తెలం గాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రభుత్వ పాఠ శాలలో విద్యా ప్రమాణాలు పెంచి నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను భవిష్యత్తు లో మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచన దక్పథంతో అన్ని సామాజిక వర్గాలకు సర్వ వసతులతో గురుకుల పాఠ శాలలు ఏర్పాటు చేశారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి పై సుమారు లక్షా 20 వేల రూపాయలు ప్రతి సంవ త్సరం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచడానికి ఎంతో కషి చేస్తుంది. మెరుగైన విద్యను విద్యార్థులకు అందించాలని నిష్ఠ ద్వారా ఉపాధ్యా యులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి ప్రభుత్వ పాఠశా లల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారులు లక్షల రూపాయల ప్రజల సొమ్ము జీతం రూపంలో పొందుతూ స్వార్థ ప్రయోజనాల కోసం, అతి ఆశతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేస్తుం డడం బాధాకరం. నియమ నిబంధనలకు విరుద్ధంగా పాఠశా లలు కొనసాగుతున్న యాజమాన్యంతో లోపాయికారీ ఒప్పం దాలు కుదుర్చుకొని విద్యాహక్కు చట్టానికి, ప్రభుత్వ ఆకాంక్షలకు తూట్లు పొడుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి అవినీతి అధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

  • ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధి ఐక్యూ ఇంటర్నేషనల్‌ పాఠశాల పై జిల్లా విద్యాశాఖ అధికారికి, ముషీరా బాద్‌ మండల ఉప విద్యాశాఖ అధికారికి వివరణ కోరగా స్పందించని అధికారులు.
  • ఐ క్యూ ఇంటర్నేషనల్‌ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి….. ఫరీదుద్దీన్‌ సామాజిక కార్యకర్త

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల యాజమాన్యం. విద్యాశాఖ నుండి అనుమతులు లేని తరగతులను నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న పాఠశాల యాజమాన్యం, చట్ట వ్యతిరేకంగా బోగస్‌ బదిలీ సర్టిఫికెట్లు జారీచేసిన ఐ క్యూ ఇంటర్నేషనల్‌ పాఠశాల పై కోర్టు ఆదేశాల ప్రకారం సంబంధిత పోలీస్‌ స్టేషన్లో చీటింగ్‌ కేసు నమోదు అయిన అధికారులు పాఠశాల పై చర్యల తీసుకోకపోవడంతో అధికారుల, యాజ మాన్యం మధ్య లోపాయకారి ఒప్పందం ఎంత బలంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. ముషీరాబాద్‌ మండలం ఉప విద్యాశాఖ అధికారి సామ్యూల్‌ రాజ్‌ ను సస్పెండ్‌ చేయాలి.

  • జిల్లా విద్యాశాఖ అధికారి, డిప్యూటీ ఈవో పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి… సుదర్శన్‌ కవి, రీసెర్చ్‌ స్కాలర్‌

పాఠశాల యాజమాన్యం నీతిమాలిన పనులు చేస్తూ, బోగస్‌ బదిలీ సర్టిఫికెట్లు జారీ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి, ఉప విద్యాశాఖ అధికారి పాఠశాల పై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close