Featuredస్టేట్ న్యూస్

దిశ హత్య కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌!

దిశ హత్య కేసు నిందితులు

ఎన్‌కౌంటర్‌!

  • దిశను సజీవదహనం చేసిన చోటే కాల్చివేత
  • సీన్‌ రీకన్‌స్టక్ష్రన్‌ కోసం తీసుకెళ్లిన పోలీసులు
  • చటాన్‌పల్లి వంతెన వద్ద పోలీసులపై దాడి
  • రాళ్లవర్షం కురిపిస్తూ తప్పించుకొనేందుకు యత్నం
  • అప్రమత్తమై కాల్పులు జరిపిన పోలీసులు
  • నలుగురు నిందితులు అక్కడికక్కడే మృతి
  • ఘటన స్థలంలోనే పంచనామ.. భారీగా తరలివచ్చిన ప్రజలు
  • పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు
  • ఘటన స్థలంలో పోలీసులపై పూలవర్షం కురిపించిన స్థానికులు

హైదరాబాద్‌

హైదరాబాద్‌ వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. హత్యాచార ఘటన సీన్‌ రీకన్‌స్టక్ష్రన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను తీసుకొనేందుకు యత్నించినప్పటికీ సాధ్యం కాకపోవటంతో పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దిశను సజీవదహనం చేసిన చటాన్‌పల్లి వంతెన ప్రాంతంలోనే నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవటం గమనార్హం. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీపీ సజ్జనార్‌ నిర్దారించారు. ఈ తెల్లవారుజామున 3నుంచి 6గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఆయన వెల్లడించారు. చటాన్‌పల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశాన్ని సీపీ పరిశీలించారు. ఇదిలాఉంటే దిశ హత్యాచారం నిందితుల మృతదేహాలకు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలోనే శవపంచనామా నిర్వహించారు. స్థానిక మెజిస్టేట్ర్‌ సమక్షంలో శవపంచనామా పూర్తిచేశారు. ఒక్కో మృతదేహానికి ఒక్కో న్యాయాధికారి సమక్షంలో శపంచనామా నిర్వహించారు. ఏ1 నిందితుడు పాషా మృతదేహానికి ఫరూక్‌నగర్‌ తహసీల్దార్‌ పాండు నాయక్‌, ఏ2 నిందితుడు చెన్న కేశవుల మృతదేహానికి పొందుర్గు తహసీల్దార్‌ శ్రీకాంత్‌ శవపంచనామా నిర్వహించగా.. ఏ3 నిందితుడు శివ మృతదేహానికి నందిగామ తహసీల్దార్‌ హైదర్‌ అలీ, ఏ4 నిందితుడు నవీన్‌ మృతదేహానికి చౌదరిగూడ తహసీల్దార్‌ రాముడు శవపంచనామా నిర్వహించారు. తొలుత శవపరీక్షలు కూడా అక్కడే నిర్వహించాలనుకున్న పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. మృతదేహాలను మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి అక్కడే శవపరీక్షలు నిర్వహించారు. శవపరీక్షలు నిర్వహించేందుకు ఐదుగురు వైద్యులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకొని పంచనామా నిర్వహించారు.

ఘటన జరిగిన 10రోజుల్లోనే..!

దిశ హత్యాచారం, హత్య జరిగిన ఘటన జరిగి సరిగ్గా 10రోజుల్లోనే నిందితులు పోలీసులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెండారు. నవంబర్‌ 27న బుధవారం సాయంత్రం నుంచి దిశా కనిపించకుండా పోయింది. తన చెల్లితో మాట్లాడిన కొద్దిసేపటికే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నవంబర్‌ 28వ తేదీ గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ సమీపంలో దిశ దారుణ హత్యకుగురైనట్లు గుర్తించారు. 24వ నేషనల్‌ హైవే దగ్గర ఓ వంతెన కింద దారుణంగా హత్య చేసి గుర్తు తెలియకుండా పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. హత్యకు ముందు అత్యంత 

పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలతో దేశ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. నిందితులను ఉరితీయాలంటూ ప్రజలంతా ముక్తకంఠంతో నినదించారు. ఈ కేసును పటిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ జరిపి నవంబర్‌ 28న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఏ1 మహ్మద్‌, ఏ 2 జొల్లు శివ, ఏ 3 చెన్నకేశవులు, ఏ 4 నవీన్‌ కుమార్‌లుగా గుర్తించారు. వీరంతా లారీ డ్రైవర్‌లు, క్లీనర్లుగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించటంతో తామే హత్యాచారం చేసి పెట్రోల్‌పోసి హత్యచేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో నవంబర్‌ 29వ తేదీన షాద్‌ నగర్‌ పీఎస్‌లో నిందితులను విచారించారు. నిందితులకు 14రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. నవంబర్‌ 30న నిందితులను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. షాద్‌ నగర్‌ నుంచి నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలిస్తుండగా నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్‌ వినిపించాయి. డిసెంబర్‌ 04వ తేదీన నిందితులను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతినివ్వడంతో డిసెంబర్‌ 05వ తేదీన నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. కేసు రీకనస్టక్ష్రన్‌ నిమిత్తం నిందితులను హత్యజరిగిన ప్రాంతాలకు పోలీసులు తీసుకెళ్లారు. బుధవారం రాత్రి ఘటన జరిగిన ప్రాంతాల్లో నిందితులను తీసుకెళ్లగా దిశ సెల్‌ఫోన్‌ ఎక్కడ దాచిందో చెప్పడంతో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అదే రీతిలో గురువారం రాత్రి సమయంలోనూ షాద్‌నగర్‌లో ఘటన జరిగిన ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లారు. ఈ సమయంలో షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లి వంతెన వద్దకు నిందితులను తీసుకెళ్లడంతో వారు ఒక్కసారిగా పోలీసులపై ఎదురుతిరిగారు. పోలీసుల వద్ద ఉన్న గన్‌లను తీసుకొనే ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని నిరోధించారు. దీంతో నిందితులు పోలీసులపై రాళ్లదాడికి దిగి పరారయ్యేందుకు యత్నించారు. దీంతో ప్రాణరక్షణ కోసం పోలీసులు నిందితులపై కాల్పులు జరడపంతో అక్కడిక్కడే నిందితులు మృతిచెందారు.

పోలీసులపై పూలవర్షం..

దిశ హత్యాచార ఘటనలో నలుగురు నిందితులను పోలీసులను ఎన్‌కౌంటర్‌ చేసిన వేళ హైదరాబాద్‌ పోలీస్‌ విభాగానికి దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే చుట్టుపక్కల వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యాచారం జరిగినప్పటి నుంచి నిందితులపై జనం ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఎన్‌కౌంటర్‌ వార్త చెవిన పడేసరికి చుట్టు పక్కల వారంతా ఆనందంతో సమీపంలోని వంతెనపైకి చేరుకున్నారు. తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ.. పోలీసులపై పూల వర్షం కురిపించారు. ‘తెలంగాణ పోలీస్‌ జిందాబాద్‌.. సా¬ సీపీ సజ్జనార్‌’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు, నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో బాధితురాలి ఇంటి చుట్టు పక్కల ఉండే వాళ్లు పెద్ద ఎత్తున ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. కొందరు మిఠాయిలు పంచుకున్నారు. దీంతో దిశ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. కొందరు ఉద్యమకారులు పోలీసులకు స్వీట్లు పంచి, అభినందించారు. హైదరాబాద్‌ సహా విజయవాడ వంటి పలు నగరాల్లో యువతులు ఆనందోత్సాహాలతో డాన్సులు చేశారు. పోలీసుల తాజా చర్యతో తమకు భద్రతా భావం కలుగుతోందని కొందరు యువతులు పేర్కొన్నారు. ఎవరైనా మహిళకు అన్యాయం జరిగితే పోలీసులు అండగా ఉన్నారని ఈ ఘటనతో నిరూపితం అయిందని ఆనందం వ్యక్తం చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close