Featuredజాతీయ వార్తలు

దిశ మీద చర్చ

  • అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి
  • ‘దిశ’ ఘటనపై ఉభయసభల్లో నినాదాలు
  • మహిళలపై దాడులకు స్వస్తి పలకాలి
  • కఠిన చట్టాలు తేవాలన్న సభ్యులు
  • సభ సహకరిస్తే.. కఠిన చట్టం తెస్తాం
  • స్పష్టం చేసిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘దిశ’ హత్యాచార ఘటనపై సోమవారం ఉభయసభల్లో చర్చకు వచ్చింది. దిశ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ తరుఫున మల్కాజ్‌ గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి లోక్‌ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అదేవిధంగా ‘దిశ’ హత్య ఘటనపై పెరుగుతున్న నేరాలపై బీజేపీ ఎంపీ ప్రభాత్‌ ఝూ రాజ్యసభలో జీరో అవర్‌ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన సభ్యులు దిశ ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా కఠిన శిక్షలు విధించాలని కోరారు.

మహిళలపై దాడులకు స్వస్తి పలకాలి

  • చైర్మన్‌ వెంకయ్య

న్యూఢిల్లీ

మహిళలపై దాడులకు స్వస్తి పలకాలని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు అన్నారు. దిశ హత్య ఘటనపై రాజ్యసభలో చర్చ జరిగింది ఈ చర్చను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన దిశ హత్య కేసు మన సమాజానికి, మన వ్యవస్థకు తీవ్ర అవమానం అన్నారు. ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయో, వీటి పరిష్కార చర్యల కోసం మనం ఏదో ఒకటి చేయాలని, దిశ హత్య ఘటనపై ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను వెంకయ్య నాయుడు కోరారు.ఈ సందర్భంగా సభలో సభ్యులు మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అనంతరం మళ్లీ వెంకయ్య మాట్లాడుతూ.. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం చట్టాల వల్ల బాధితులకు న్యాయం జరగదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. హైదరాబాద్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసింది. చట్టాలు చేయడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాదని, సమస్య మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కోరారు. అంతకు ముందు రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో ఎన్నిచట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. నిందితులకు కఠినశిక్షలు పడేలా చేయాలన్నారు. చట్టాలు చేయడం ద్వారా మాత్రమే పరిష్కారం కాదని, సమస్య మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలని చెప్పారు. అనంతరం అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్‌ మాట్లాడుతూ.. దేశంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దిశను హత్య చేసిన నలుగురు నిందితులను డిసెంబరు 31లోపు శిక్షించాలన్నారు. మరణించేంత వరకు వారిని ఉరితీయాలని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీ సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు వెంటనే అమలు చేయాలని అన్నారు. శిక్షలు వెంటనే అమలైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై సభలోని అన్ని పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఘటన.. ఢిల్లీ ఘటనను గుర్తు చేసి మరోసారి ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసిందన్నారు. ఘటనకు ముందు పెట్రోలింగ్‌, రక్షణ చర్యలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్భయ చట్టంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సత్వర న్యాయం జరుగుతుందని భావన కలిగేలా తీర్పు ఉండాలన్నారు. సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ మాట్లాడుతూ.. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్న వారిని ఎటువంటి క్షమాభిక్ష లేకుండా బహిరంగంగా ఉరి తీయాలన్నారు. దీనికి ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలంటూ ప్రజలు నిలదీయాల్సిన సమయం ఇదేనని,నిర్భయకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె అన్నారు.

పార్లమెంట్‌లోనూ సుదీర్ఘచర్చ..

మరోవైపు లోక్‌సభలోను దిశ హత్యపై చర్చకు సభ్యులు పట్టుబట్టారు. ఈ అంశంపై జీరో అవర్‌లో చర్చించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ మల్కాజ్‌ గిరి ఎంపీ అనుమల రేవంత్‌ రెడ్డి లోక్‌భలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌ సభలో మధ్యాహ్నం 12 గంటలకు దిశ ఘటనపై చర్చజరిగింది.

కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. భద్రత ఉండే హైదరాబాద్‌ నగరంలో ఈ ఘటన జరగడం శోచనీయం అన్నారు. నియంత్రణ లేకుండా మద్యం అమ్మడం కూడా ఈ ఘటనకు దారితీసిందన్నారు. ఘటనను ఖండిస్తున్నామని, నిందితులను ఉరితీయాలన్నారు. కాకినాడ గీతా విశ్వనాథ్‌ మాట్లాడుతూ ఎంపీలు అందరూ ఈ ఘటనను ఖండించాలన్నారు. మోడీ, షాలు.. 370 బిల్లుతో భారత మాత తల ఎత్తుకునేలా చేశారు, అలాగే కఠినమైన బిల్లుతో నిందితులను శిక్షించాలన్నారు. మద్యం, డ్రగ్స్‌ను నియంత్రించాలన్నారు. బెంగాల్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ మాట్లాడుతూ హైదరాబాద్‌ దిషా ఘటనను ఖండించారు. దేశంలో ప్రతి స్త్రీ భయపడుతోందని, అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ..

కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. భద్రత ఉండే హైదరాబాద్‌ నగరంలో ఈ ఘటన జరగడం శోచనీయం అన్నారు. నియంత్రణ లేకుండా మద్యం అమ్మడం కూడా ఈ ఘటనకు దారితీసిందన్నారు. ఘటనను ఖండిస్తున్నామని, నిందితులను ఉరితీయాలన్నారు. కాకినాడ గీతా విశ్వనాథ్‌ మాట్లాడుతూ ఎంపీలు అందరూ ఈ ఘటనను ఖండించాలన్నారు. మోడీ, షాలు.. 370 బిల్లుతో భారత మాత తల ఎత్తుకునేలా చేశారు, అలాగే కఠినమైన బిల్లుతో నిందితులను శిక్షించాలన్నారు. మద్యం, డ్రగ్స్‌ను నియంత్రించాలన్నారు. బెంగాల్‌ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ మాట్లాడుతూ హైదరాబాద్‌ దిషా ఘటనను ఖండించారు. దేశంలో ప్రతి స్త్రీ భయపడుతోందని, అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ..

నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ప్రతి ఏడాది 33వేల అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయన్నా రు. మహిళలకు రక్షణ కల్పించే విధంగా కఠిన చట్టం తేవాలన్నారు. పార్టీలకు అతీతంగా చట్టం తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. దిషా హత్య ఘటన దేశమంతా కలిచివేసిందన్నారు. ఎంపీ అనుప్రియా పటేల్‌ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు సహించకూడదన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దిశ అత్యాచార నిందితులకు 30రోజుల్లోగా కఠిన శిక్షను అమలు చేయాలని అన్నారు. ఘటన జరిగిన వెంటనే పది బృందాలుగా మారి పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు ఎంపీ నామా తెలిపారు. హైదరాబాద్‌ దిశ ఘటన ఇప్పుడు దేశ సమస్యగా మారిందన్నారు. రాజస్థాన్‌, తమిళనాడు, యూపీల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుతో 30రోజుల్లోనే నిందితులను శిక్షించాలని నామ కోరారు.

సభ సహకరిస్తే.. కఠిన చట్టం తెస్తాం – రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

సభ సహకరిస్తే కఠిన చట్టం తెస్తామని లోక్‌సభలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. వెటర్నరీ డాక్టర్‌ అత్యాచారం, హత్య ఘటనను ఆయన ఖండించారు. ఈ ఘటన దేశాన్ని తలదించుకునేలా చేసిందన్నారు. ప్రతి ఒక్కర్నీ కలిచివేసిందన్నారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షను అమలు చేయాలని రాజ్‌నాథ్‌ అన్నారు. దేశంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవాలని, కఠినమైన చట్టం రూపొందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అన్ని పార్టీలు సహకరిస్తే కొత్త చట్టాన్ని తయారు చేస్తామని రాజ్‌నాథ్‌ అన్నారు. నిర్భయ కేసు తర్వాత కూడా దేశంలో ఇలాంటి ఘటనలు ఆగడంలేదని, ఒకవేళ సభలో ఏకాభిప్రాయం కుదిరితే, కఠిన చట్టాలను రూపొందిస్తామని స్పష్టం చేశారు.

చట్టాల సమీక్షకు కట్టుబడి ఉన్నాం: కిషన్‌ రెడ్డి

దారుణ హత్యకు గురైన దిశ అమాయకురాలని, డ్యూటీ, సర్వీస్‌ మైండెడ్‌ డాక్టర్‌ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దిశ అత్యాచార ఘటనపై జరిగిన చర్చ సందర్భంగా లోక్‌సభలో మంత్రి మాట్లాడారు. ఇది గంభీరమైన అంశమన్నారు. ప్రాంతానికి, భాషలకు సంబంధం లేకుండా యావత్‌ దేశం ఈ ఘటనను ఖండించిందన్నారు. ఐపీసీ, సీఆర్పీ సమీక్షకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వాటి డ్రాప్ట్‌లను కూడా సిద్ధం చేశామన్నారు. హైదరాబాద్‌లో దిశ కుటుంబసభ్యులను కలిశానని, నిర్భయ కేసులో కనీసం మృతదేహం దొరకిందని, కానీ ఇది భయంకరమైన సంఘటన అని మంత్రి అన్నారు. అత్యాచార నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వం కఠిన చట్టం తయారీ కోసం రెఢీగా ఉందన్నారు. 112 నంబర్‌తో ఎమ్జ్గం/న్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌ ఉందన్నారు. 101, 102, 108 నంబర్లను అన్నీ కలపాలన్నారు. భారత సర్కార్‌.. మహిళల అంశంలో, ప్రాసిక్యూషన్‌, ఇన్వెస్టిగేషన్‌కు కట్టుబడి ఉందన్నారు. ఉగ్రవాదం పట్ల ఎలా పనిచేస్తున్నామో.. అదే విధంగా నిందితులను శిక్షిస్తామన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close