ఆశావహుళకు నిరాశే…

0
  • అనుకోని వారికే అందళం
  • మండలి చైర్మన్‌గా కడియం శ్రీహరి..?
  • ప్రభుత్వ విప్‌గా దాస్యం వినయ్‌భాస్కర్‌…?
  • ఓడిన మాజీ మంత్రులకు నో చాన్స్‌
  • అట్టాహాసంగా కేబినెట్‌ విస్తరణ (ప్రభాకర్‌ నూటెంకి..హైదరాబాద్‌) (ఆదాబ్‌ హైదరాబాద్‌ ): తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కుతాయని ఆశించిన మాజీ మంత్రులు, ఎమ్మల్యేలకు నిశే కలిగిందని చెప్పవచ్చు. ముఖ్మమంత్రి కేసిఆర్‌ కేబినెట్‌లో గత ప్రభుత్వంలో కొలువులు చేసిన మంత్రులు ఎక్కువ శాతం అందరికి మంత్రి పదవులు వస్తాయనే ఆశల పల్లకిలో ఉన్నారు. అయితే గత నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసిఆర్‌ గవర్నర్‌ను కలిసి మాఘశుద్ద పౌర్ణమి రోజు ఫిబ్రవరి 19న మహూర్తం ఖరారు చేయడంతో పాటు మరో 8 మందిని కేబినెట్‌ మంత్రులుగా ప్రకటించడంతో ఆశావాహులందరిలో నిరాశ పవనాలు వీస్తున్నాయి. కాగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి సోమవారం రోజుకి సరిగ్గా 70 రోజులు కావడంతో పాటు ముఖ్మమంత్రి కేసిఆర్‌ పుట్టిన రోజుతో కలుపుకొని 71 రోజు కావడంతో మంత్రి వర్గ విస్తరణ కూడా అదే రోజు జరపాలనే నిర్ణయంతో పాటు మహుర్తం కూడా పక్కాగా

కుదరడంతో ఈ నెల 19న కేబినెట్‌ విస్తరణకు పచ్చజెండా ఊపారు. దీనికి గవర్నర్‌ కూడా అంగీకారం తెలపడంతో అసెంబ్లీ ప్రాంగణాన్ని అన్ని విధాలుగా అన్ని హంగులతో ముస్తాబు చేస్తున్నారు. కాగా తెలంగాణలో మంత్రి పదవులు ఆశించిన వారికి జాబితాలో వారి పేర్లు రాకపోవడంతో కొంత మేరకు నిరాశ చెందినప్పటికి మంత్రి వర్గ విస్తరణకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా మంత్రి వర్గ విస్తరకు భారీ స్థాయిలో హాజరు కానున్నారు. అలాగే వీరితో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లాల నుండి కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం 33 జిల్లాలకు చెందన ఆయా జిల్లాల నామినేటెడ్‌ పదవులను ఆశిస్తున్న ప్రజా ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు.

మండలి చైర్మన్‌గా కడియం శ్రీహరి…?

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఈ సారి శాసన మండలి చైర్మన్‌గా నియమిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాజకీయ రంగంలో అపార అనుభవం కలిగిన కడియం శ్రీహరికి గతంలో ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రస్తుతం ఆయనకు మండలి చైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వరంగల్‌ పచ్చిమ నియోజకవ వర్గం నుంచి మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన దాస్యం వినయ్‌ భాస్కర్‌కు ప్రభుత్వ విప్‌ పదవి ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే వినయ్‌ భాస్కర్‌కు ఒక వేల ప్రభుత్వ విప్‌ పదవి ఇవ్వకుంటే పార్టీలో కీలక పదవిని కట్టబెట్టాలనే సంకల్పంతో ముఖ్మమంత్రి కేసిఆర్‌ ఉన్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో మరో సీనియర్‌ నేత మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజక వర్గం నుండి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపోంది మూడు సార్లు మంత్రి పదవిని నిర్వహించిన మాజీ మంత్రి డిఎస్‌ రెడ్యానాయక్‌కు రోండో విడతలో మంత్రి పదవి దక్కే చాన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కీలక శాఖలైన రెవెన్యూ, పంచాయితీరాజ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ, నీటి పారుదల శాఖల వంటి ముఖ్యమైన శాఖలను ముఖ్యమంత్రే స్వయంగా నిర్వహంచనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటి వరకు మంత్రి వర్గంలో మొదటి స్థానంలో మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజెందర్‌లు ఉంటారని అంతా అనుకున్న సమయంలో వారు మంత్రి వర్గంలో లేకపోవడంతో అంతా అవాక్కయ్యారు.

కేంధ్ర రాజకీయాలలోకి హరీష్‌, ఈటెల..?

రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి బాధ్యతలను మాజీ మంత్రి కెటిఆర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. అయితే రాష్ట్రం నుంచి 17 స్థానాల్లో పార్లమెంట్‌ సభ్యులు ఎన్నికైతే కేంద్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ చక్రం తిప్పనున్న నేపద్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌తో పాటు మరి కొందరు ఆయనకు నమ్మకమైన నేతలు అవసరం కాబట్టి ఆయన నమ్మిన నాయకులను రాష్ట్ర క్యాబినెట్‌ చోటు ఇవ్వకుండా కేంద్రం వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో పార్టీ పూర్తి బాధ్యతలు కేటిఆర్‌కు అప్పగించి సీఎంకు నమ్మకస్తులైన హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌లతో పాటు మరికొంత మంది నాయకులను కేంద్ర రాజకీయాలవైపు మళ్ళించనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలకు సముచిత న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సుదీర్ఘంగా సమాలోచనలు జరిపిన అనంతరం కేబినెట్‌లోకి మరో 8 మంది తీసుకోవడంమే కాకుండా మళి విడిత మరి కొంత మందికి అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. కాగా ఈసారి ఉమ్మడి పది జిల్లాల్లో ఖమ్మం, నల్గొండ జిల్లాల నుండి మంత్రి పదవులు దక్కక పోవడంపై పలువురు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.

ఎన్నికల్లో ఓడిన మాజీ మంత్రులకు నో ఎంట్రీ….

గత రెండున్నర నెలల క్రితం రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలనై మాజీ స్పీకర్‌తో పాటు మాజీ మంత్రులకు ఈ సారి ప్రభుత్వంలో ఎలాంటి చాన్స్‌ ఉండే అవకాశం కనిపించట్లేదు. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూధనాచారి ఓటమి పాలు కావడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు ఏదో ఒక మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో ఆయన ఆశలకు నీళ్లు వొదినట్లయింది. అలాగే మరో మాజీ మంత్రి ఆజ్మీరా చందూలాల్‌తో పాటు తుమ్మల నాగేశ్వర్‌రావులు ఘోరంగా ఓటమి పాలు కావడంతో వారితో పాటు మరి కిందరు ఓడిన నాయకులకు ఈ సారి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు దక్కవనే చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here