Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

నేరుగా ఇంటికే పింఛన్‌!

గ్రామ వాలంటీర్లు లంచం తీసుకుంటే సీఎం ఆఫీస్‌కు పిర్యాదుచేయండి

 • వైఎస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంతంగా జరుపుతాం
 • సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తాం
 • ఈ ఏడాదికి రూ.84వేల కోట్లు రుణాలు
 • చెన్నూరు షుగర్‌ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తాం
 • గోదావరి జలాలను శ్రీశైలానికి తీసుకొస్తే ఈ ప్రాంతం మారుపోతుంది
 • కర్ణాటక నుంచి దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేదు
 • కృష్ణానది ఆయకట్టు ప్రశ్నార్థంగా మారింది
 • 200 బోర్‌వెల్స్‌ కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా బోర్లు వేస్తాం
 • డిసెంబర్‌ 26న స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తాం
 • అదేరోజు కుందూ నదిపై రెండు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన
 • ఏపీ సీఎం వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
 • కడప జిల్లా నుంచి నవరత్నాల అమలుకు శ్రీకారంచుట్టిన జగన్‌

కడప : నేరుగా ప్రతీ ఇంటి తలుపుతట్టి పింఛన్‌ అందిస్తామని, సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిఅన్నారు. సోమవారం కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సభా వేదికపైకి చేరుకున్న సీఎం అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామసుబ్బమ్మ అనే మహిళకు రూ.7 లక్షల చెక్కు అందించి వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల లోపే వృద్దాప్య పింఛనును రూ.2,250కు పెంచామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5.4లక్షల పింఛన్లు మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి మీ తలుపు తట్టి పింఛను ఇస్తారని, అదేరోజు నుంచి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఇంటికి వచ్చి వివరిస్తారన్నారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరని, ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫిర్యాదు చేయవచ్చునని జగన్‌ సూచించారు. ఇక నుంచి వైఎస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతామని, ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014-15లో పింఛన్లకు రూ.3,378 కోట్లు ఖర్చు చేయగా.. 2015-16లో రూ.5,201 కోట్లు, 2016-17లో 5,270 కోట్లు, 2017-18లో రూ.5,436 కోట్లు ఖర్చు చేశారు. కానీ.. 2018-19లో మాత్రం ఎన్నికలకు నాలుగు నెలల ముందు రూ.8,234 కోట్లు ఖర్చు చేశారని, నెల తిరగకుండానే మా ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.15,675 కోట్లు ఖర్చు చేసిందని జగన్‌ వివరించారు.

సున్నా వడ్డీకే పంట రుణాలు..

రైతుల పంట రుణాలకోసం కేవలం ఈ ఏడాదికి రూ.84వేల కోట్లు రుణాలు అందించాలని నిర్ణయించామని, పంట రుణాలు తీసుకున్న రైతులు నిర్ణీత గడువులోగా తిరిగి చెల్లిస్తే వాటిపై ఏమాత్రం వడ్డీ చెల్లించనక్కర్లేదన్నారు. జూన్‌ 1నుంచి జులై 7వరకు కడప జిల్లాలోనే రూ.1000 కోట్ల పంట రుణాలు 

ఇచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకుంటామని, అన్నదాతలకు తోడుగా వైఎస్‌ఆర్‌ భరోసా పథకం తీసుకొచ్చామని జగన్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఇవ్వాల్సిన ఈ పథకాన్ని ఏడు నెలల ముందే ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 70శాతం మంది రైతులకు హెక్టారులోపు పొలమే ఉందని, రైతు భరోసా కింద 70లక్షల మంది రైతులకు రూ.8,750 కోట్లు ఇవ్వబోతున్నామని జగన్‌ తెలిపారు. తుపాన్లు వచ్చినప్పడు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ ఇవ్వలేదని, గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పుడు మేం ఇస్తున్నామన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లపై రోడ్డు పన్నురద్దు చేశామని, రైతు భరోసా వంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని జగన్‌ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని, అరటి రైతుల గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదని, రైతుకు జరగరానిది జరిగితే రూ.7 లక్షలు చెక్కు అందిస్తాం అని భరోసా ఇచ్చారు.

26న కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తా

చెన్నూరు షుగర్‌ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ¬దాలో తొలిసారి కడప జిల్లాకు వచ్చిన ఆయన జమ్మలమడుగులో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పారు. నాణ్యతను పరిశీలించేందుకు ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్‌, రైతుల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్‌ కమిటీలకు ఎమ్మెల్యేలే గౌరవ చైర్మన్లుగా ఉంటారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. గోదావరి జలాలను శ్రీశైలానికి తీసుకొస్తే ఈ ప్రాంతం మారుపోతుందని అన్నారు. కర్ణాటక నుంచి దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేదని, కృష్ణానది ఆయకట్టు ప్రశ్నార్థంగా మారిందని అన్నారు. 200 బోర్‌వెల్స్‌ కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా బోర్లు వేస్తామని జగన్‌ అన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌ కలగా మిగిలిపోయిందని జగన్‌ అన్నారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఎన్నో డ్రామాలు చేసిందని విమర్శించారు. డిసెంబర్‌ 26న స్టీల్‌ఎ/-లాంట్‌కు శంకుస్థాపన చేస్తానని సీఎం పేర్కొన్నారు. స్టీల్‌ఎ/-లాంట్‌ ఏర్పాటు అయితే సుమారు 20వేల మందికి ఉద్యోగాలు వస్తాయని జగన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 26న కుందూ నదిపై రెండు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తామన్నారు. కుందూనది నుంచి ఎత్తిపోతల ద్వారా తెలుగుగంగకు నీళ్లు వస్తాయని.. అలాగే గండికోట రిజర్వాయర్‌కు 20 టీఎంసీల నీళ్లు తీసుకొస్తామని జగన్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాదిమంది రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close