బిజినెస్

హైదరాబాద్‌లో డిజిటల్‌ పరివర్తనలో ఎస్‌ఎంఈలకు తోడ్పడంలో కీలకంగా మారిన టాటా టెలీ బిజినెస్‌ సర్వీసెస్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): భారతదేశ అగ్రగామి ఎంటర్‌ ప్రైజ్‌ కనెక్టివిటీ సొల్యూషన్‌ ప్రొవైడర్‌ అయిన టాటా టెలీ బిజినెస్‌ సర్వీసెస్‌ (టీటీబీఎస్‌) తన ఫ్లాగ్‌ షిప్‌ కస్టమర్‌ ప్రోగ్రామ్‌ ”డూ బిగ్‌ ఫోరమ్‌లో పలు రకాల సాంకేతిక పరిష్కారాలను ప్రద ర్శించింది. ” స్మార్ట్‌ సొల్యూషన్స్‌” థీమ్‌ తో ఈ ప్రదర్శన సాగింది. ఎస్‌ఎంఈలకు చెందిన తొంభై మంది ప్రతినిధులు ఈ కార్యక్ర మానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఎంఈ ఆపరేషన్స్‌ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ కె.ఎస్‌ కాళిదాస్‌ టీటీబీఎస్‌ కార్యక్ర మం గురించి వివరించారు. ”సాంకేతిక సంచలనాలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో సామర్థ్యాలను గరిష్ఠ స్థాయి లో వినియోగించుకునేందుకు సాంకేతికత సాయం పొందడం ఎస్‌ఎంఈలకు తప్పనిసరిగా మారింది. ప్రగతిశీలక డిజిటల్‌ ఉత్ప్రేరకంగా మేము ఈ తరగతిలోనే అత్యుత్తమ సాంకేతిక పరిష్కారాలను సహేతుక ధరలకు ఎస్‌ఎంఈలు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించుకునేలా అందించడాన్ని విశ్వసిస్తాం” అని అన్నారు. ఉదాహరణకు ఎంతగానో ప్రశంసలు పొందిన స్మార్ట్‌ ఆఫీస్‌ ఒక వ్యయ ప్రభావపూరిత సింగిల్‌ బాక్స్‌ సొల్యూషన్‌. వాయిస్‌, డేటా, నెట్‌ వర్క్‌ స్టోరేజ, యాప్స్‌ను యాక్సెస్‌ చేసేం దుకు ఇది వీలు కల్పిస్తుంది. వ ద్ధి చెందుతున్న ఎస్‌ఎంఈలు మరియు స్టార్టప్‌లకు స్మార్ట్‌ ఆఫీస్‌ అనేది ఒక వరం లాంటిది. కనెక్టివిటీని ఏర్పరచుకునేందుకు, యూనిఫైడ్‌ కమ్యూనికేషన్‌ ఉపకరణాలు సమకూర్చుకునేందుకు బాధపడాల్సిన అవసరం లేదు. మేము పూర్తిస్థాయిలో హార్డ్‌ వేర్‌ అందిస్తాం. ఇది ఐపీ ఆధా రిత ఇంటిగ్రేటెడ్‌ కమ్యూనికేషన్‌ మౌలిక వసతులను అందిస్తుంది. వాయిస్‌, డేటా, మరియు వీడియోలను మెరుగుపర్చబడిన క్లౌడ్‌ తో సపోర్ట్‌ చేస్తుంది. అందుకు మేము ఏమీ తీసుకోం. ఈ బాక్స్‌ ద్వారా అందించే సేవలకు మాత్రమే తీసుకుంటాం. మీరు ఉప యోగించే దాన్ని బట్టి చెల్లించే విధానం. ఇదెంతో అందుబాటు రేట్లతో, విశ్వసనీయంగా, ఉపయోగించేం దుకు సులభంగా ఉంటుంది. ఎస్‌ఎంఈలకు, స్టార్టప్‌ లకు ఎంతగానో తోడ్పడు తుంది” అని అన్నారు కాళిదాస్‌. ఎస్‌ఎంఇ విభాగం శరవేగంగా వద్ధి చెందుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వేగంగా ముందుకెళ్తోంది. సాంకేతికలు వ్యయాలను తగ్గించడం మాత్రమే గాకుండా వాటి కార్యకలాపాల్లో సమగ్ర భాగమని కూడా అవి గుర్తించాయి. కార్యాలయాలను, భాగస్వాములను అనుసంధానం చేయడం ద్వారా ఆయా సంస్థలు తమ కస్టమర్లను వేగంగా చేరుకోవడంలో, తమ సేవలను వారికి అందించడంలో, సంస్థలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవడంలో సాంకేతికత వాటికి తోడ్పడుతోంది. ఈ సందర్భంగా స్మార్ట్‌ వీపీఎన్‌ గురించి శ్రీ కాళిదాస్‌ వివరించారు. ”డేటాతో సుసంపన్నమైన భవిష్యత్‌ కార్యకలాపాలను నిర్వహించేందుకు వేగం, భద్రత మరియు ఆధా రపడదగిన కనెక్టివిటీ అనేది డిజిటల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ అజెండాలో ముందుభాగంలో ఉంటుంది. మా స్మార్ట్‌ వీపీఎన్‌ పరిష్కారాలు ఎస్‌ఎంఈలను అవి తమ వద్ధి అవకాశాలను గరిష్ఠం చేసుకునేం దుకు, కనెక్టివిటీ వ్యయాలను ఆప్టిమైజ్‌ చేసుకునేందుకు, కస్టమర్‌ అనుభూతిని మెరుగుపరుచుకు నేందుకు మరియు క్లౌడ్‌ వేదికలకు తక్షణ యాక్సెస్‌ తో భద్రమైన రీతిలో చేరుకునేందుకు వీలు కల్పిస్తాయి. ఎస్‌ఎంఈలు డిజిట ల్‌గా మారుతున్నందున క్లౌడ్‌ ఆధారిత సర్వర్ల ను ఎంచుకోవడం ద్వారా అవి బాగా లబ్ధి పొందుతున్నప్పటికీ, ట్రాన్సిట్‌లో ఉండే తమ డేటాను కాపాడుకునేందుకు, అదే విధంగా ఈ సేవలను నిజంగా ఎవరు యాక్సెస్‌ చేస్తున్నారనే దాన్ని నిర్వహించు కోవడంలో, పర్యవేక్షిం చుకోవడంలో మాత్రం ఇబ్బందులు పడుతు న్నాయి. స్మార్ట్‌ వీపీఎన్‌తో అవి ఇప్పుడు ఉపయోగించడానికి ఎంతో సులభంగా ఉండే మరియు అత్యంత సురక్షితమైన ఇంటర్‌ ఫేజ్‌ ను పొందవచ్చు. లొకేషన్‌ స్పెసిఫిక్‌ సర్వర్లను ఎంచుకోవచ్చు. ఇవన్నీ కూడా హై బ్యాండ్‌ విడ్త్‌ను పొందేందుకు మరియు నిరంతరా యంగా ఇంటర్నెట్‌ ను యాక్సెస్‌ చేసేందుకు వీలు కల్పిస్తాయి” అని అన్నారు. భారీగా మూలధనం అవసరమైన నేపథ్యంలో క్లౌడ్‌ సేవలను నెలకొల్పుకోవడం, వాయిస్‌, క్లౌడ్‌ స్టోరేజ్‌, డేటా సెక్యూరిటీ సేవలను పొందేందుకు సాంకేతికతను అనుసరిం చడం అనేది ఎస్‌ఎంఈలకు కీలక సవాలుగా మారింది. టాటా టెలీ బిజినెస్‌ సర్వీసెస్‌ అందించే పరిష్కారాలు ఎస్‌ఎంఈలు ప్రముఖ కార్పొరెట్‌ సంస్థలకు దీటుగా తమ కార్యకలాపాలను నిర్వహించుకోవడంలో సహకరిస్తాయి. అందుబాటు ధరలకే వీటిని పొందవచ్చు. డిజిటల్‌ అంతరాన్ని తగ్గించుకోవచ్చు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close