బికినీ ఎటాక్‌ తో ఆఫర్‌ పట్టేసిందా?

0

రియా చక్రబర్తి తెలుసు కదా? తెలుగులో ‘తూనీగా తూనీగా’ సినిమాలో నటించిన ఈ భామ తర్వాతా బాలీవుడ్‌ కు వెళ్లి సెటిల్‌ అయిపోయింది. పోయినేడాది ‘జలేబీ’ అనే హిందీ సినిమాలో నటించింది. సినిమా సూపర్‌ హిట్టేమీ కాలేదు కానీ ఆ సినిమా పోస్టర్లతో తెగ పాపులర్‌ అయింది. ఒక రైలు పెట్టె కిటికీ నుంచి వేలాడుతూ హీరోకు పెట్టిన జిమ్నాస్టిక్‌ లిప్పు లాకు ఆమెకు యూత్‌ లో భారీ ఫాలోయింగ్‌ సంపాదించిపెట్టింది. ఈ భామ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ కావడంతో నెటిజనులపై తరచుగా బికినీ ఎటాక్స్‌ చేస్తూ ఉంటుంది. మరి ఆ దాడి ఫలితమో.. మరోటో కానీ తాజాగా ఈ భామకు ఒక తమిళ సినిమా ఆఫర్‌ వచ్చింది. హరీష్‌ కళ్యాణ్‌ హీరోగా సంజయ్‌ భారతీ దర్శకత్వంలో ‘ధనుసు రాశి నేయర్గళే’ అనే ఒక రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ తెరకెక్కుతోంది. హరీష్‌ కళ్యాణ్‌ గతంలో ‘ఇస్పేట్‌ రాజావుమ్‌ ఇదయ రాణియుమ్‌’ అనే హిట్‌ సినిమాలో నటించాడు.తన కొత్త సినిమా ‘ధనుసు రాశి నేయర్గళే’ లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఆ ఇద్దరిలో ఒక హీరోయిన్‌ గా ఈ జలేబి బ్యూటీని ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌ ను ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. రియా చక్రబర్తి ఇప్పటివరకూ పలు భాషల సినిమాల్లో నటించింది కానీ కోలీవుడ్‌ లో మాత్రం డెబ్యూ ఫిలిం. ఈ సినిమాలో హీరో పాత్ర జ్యోతిష్యంపై నమ్మకంతో ఉంటుందట. హీరో పెళ్ళికి సిద్ధమైన సమయంలో ఆ నమ్మకం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది ఈ సినిమాలో కథాంశం అని సమాచారం. ఫుల్‌ ఫన్‌ ఎంటర్టైనర్‌ గా సాగుతుందట. ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమాను శ్రీ గోకులం మూవీస్‌ పతాకంపై గోకులం గోపాలన్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో జలేబీ బ్యూటీ సౌత్‌ లో పాగా వేస్తుందా లేదా అనేధీ వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here