ధోనీకి మరో ముద్దుపేరు ‘తాలా’

0

చెన్నై : మహేంద్ర సింగ్‌ ధోనీ… ‘కెప్టెన్‌ కూల్‌’గా గుర్తింపు తెచ్చుకున్న ఈ క్రికెటర్‌కు ఉన్న ఫాలోయింగ్‌ చూస్తూ పిచ్చెక్కిపోద్ది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ధోనీ… తన ఫ్యాన్స్‌ను ఆటపట్టిస్తూ ఎంతో వినయంగా నడుచుకుంటాడు. కూల్‌గా ఉంటూనే ఖేల్‌ ఖతం చేస్తాడు. అందుకే ఫ్యాన్స్‌ అతన్ని ముద్దుగా కెప్టెన్‌ కూల్‌ అని పిలుచుకుంటారు. అలాగే మహీ, ఎమ్‌ఎస్‌డీ అని కూడా ధోనిని ప్రేమగా పిలుచుకుంటారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా రాణిస్తున్న ధోనికి మరో ముద్దుపేరు(నిక్‌ నేమ్‌) కూడా వచ్చి చేరింది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ అతన్ని ముద్దుగా ‘తాలా’ అంటూ పిలుచుకుంటున్నారు. తమిళ్‌లో తాలా అంటే లీడర్‌ అని అర్థం. కెప్టెన్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను విజయపథంలో నడిపిస్తున్నాడు కాబట్టి ధోనిని తాలా పిలుచుకుంటున్నారు. అయితే తనకు ఫ్యాన్స్‌ పెట్టుకున్న ముద్దు పేర్లలలో ‘తాలా’ చాలా స్పెషల్‌ అంటున్నాడు ధోని. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ ముగిసిన తర్వాత జట్టు విజయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చారు. ‘ తాలా నాకు వేరీ స్పెషల్‌ నిక్‌ నేమ్‌. తమిళనాడులో ఎక్కడికి వెళ్లినా నన్ను ధోని అని కాకుండా ‘తాలా’ అని పిలుస్తారు. సీఎస్‌కే ఫ్యాన్స్‌ నన్ను ఆ ముద్దు పేరుతో పిలవడం నా అదష్టం. నా ముద్దుపేర్లలలో ‘తాలా’ వెరీ స్పెషల్‌. సీఎస్‌కే ఫ్యాన్స్‌ ప్రతిసారి నాకు, మా టీమ్‌కు సపోర్ట్‌గా నిలిచారు. వారినిని ఎప్పటికి మరిచిపోను’ అని ధోని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here