ధోనీ.. ‘భోజనం తయార్‌’ లాంటోడు

0
Mohali: Chennai Super Kings captain Mahendra Singh Dhoni during the practice ahead of Sunday’s match against Kings XI Punjab at the Punjab Cricket Association Stadium in Mohali on Saturday. PTI Photo by Arun Sharma(PTI4_14_2018_000275b)

చెన్నై : భారత జట్టుకు మహేంద్రసింగ్‌ ధోనీ భోజనం తయార్‌లాంటి ఆటగాడని, ఎల్లప్పుడూ జట్టుకు అందుబాటులో ఉంటాడని భారత మాజీ క్రికెటర్‌ క ష్ణమాచార్య శ్రీకాంత్‌ అన్నాడు. రానున్న ప్రపంచకప్‌లో నాలుగో స్థానానికి ధోనీ తప్ప మరెవరూ న్యాయం చేయలేరని పేర్కొన్నాడు. అయితే, నాలుగో స్థానంలో బ్యాట్స్‌మెన్‌ కావాలన్న ఆలోచనతో సెలక్షన్‌ బందం ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన శ్రీకాంత్‌.. నాలుగో స్థానం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతుండటం గమనిస్తున్నాను. కానీ, నా అభిప్రాయం ప్రకారం ఆ స్థానంలో ఆడేందుకు ఇప్పటికే టీమిండియాకు ధోనీ ఉన్నాడు. నాలుగో స్థానంలో ధోనీకంటే బాగా మరెవరూ ఆడలేరని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ధోనీ రాణిస్తున్నాడని గుర్తు చేశాడు. ‘ధోనీ బ్యాటింగ్‌ స్ట్రైక్‌రేట్‌ ఈ మధ్య కొంచెం తగ్గి ఉండొచ్చు. కానీ, వన్డే ఫార్మాట్‌లో ధోనీకంటే బాగా బ్యాటింగ్‌ చేయగల బ్యాట్స్‌మెన్‌ ఎవరూ లేరు. ఛేదనలో జట్టుకు ధోనీ ఎంతగానో ఉపయోగపడతాడు. ధోనీ వికెట్‌ కీపింగ్‌ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన పని లేదు. నేను కపిల్‌ దేవ్‌, సచిన్‌ తెందుల్కర్‌ వంటి దిగ్గజాలతో కలిసి ఆడాను. తన ఆటతో ఇతర ఆటగాళ్లకు స్ఫూర్తి నింపగల క్రికెటర్లు మాత్రం కొంతమందే ఉంటారు. ధోనీ కూడా అదే కోవలోకి వస్తాడు. అందుకే చెన్నై సూపర్‌ కింగ్స్‌ను కూడా అంత విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు’ అని శ్రీకాంత్‌ తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ధోనీ 11 మ్యాచుల్లో 358 పరుగులు చేసి జట్టులో అందరి కంటే ముందున్నాడు. దీంతో పాటు దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రెండు మెరుపు స్టంపింగ్స్‌ చేసి తనకు మించిన వికెట్‌ కీపర్‌ లేడని మరోసారి నిరూపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here