Featuredరాజకీయ వార్తలు

అసెంబ్లీ ముందు ధర్నా

  • ముగిసిన సీఎల్పీ భేటీ
  • సమావేశం నుంచి బయటకు వచ్చిన కోమటిరెడ్డి

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహాం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావులు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయమై సీఎల్పీ అత్యవసరంగా ఆదివారం నాడు అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగింది. సీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.పార్టీ మారిన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ అసెంబ్లీ దగ్గర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అధికార టీఆర్‌ ఎస్‌ కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలుపారు. సీఎం కేసీఆర్‌ వికృత రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట ఒక్కసారిగా బైఠాయించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ అవుతుందని ఆరోపించారు. తాజాగా ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేసిందని, వారికి ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ ఎస్‌ కు 99 ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంటే మండలికి ఐదో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టిందని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు విమర్శించారు. టీఆర్‌ ఎస్‌ లో చేరనున్న పినపాక, అసిఫాబాద్‌ ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌ కు ఫిర్యాదు చేస్తామన్నారు. మరో వైపు కేసీఆర్‌ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై మరింత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కొనసాగించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ సర్కార్‌ నీరుగారుస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ అప్రజాస్వామిక విధానాలను తెలంగాణ సమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఉత్తమ్‌ అభిప్రాయపడ్డారు. పార్టీ మారాలని నిర్ణయం తీసుకొన్న ఇద్దరు ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. పినపాక, ఆసిపాబాద్‌ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఉత్తమ్‌ ప్రకటించారు. ఎంత డబ్బుతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేసిందో చెప్పాలన్నారు.ఈ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలకు ఇచ్చే డబ్బును టీఆర్‌ఎస్‌ ఎక్కడి నుండి తీసుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల తీర్పును అవమానపర్చే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ తీరును నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కూడ ఇదే రకంగా తమ పార్టీలో టీఆర్‌ఎస్‌ చేర్చుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విూకు బలం లేకున్నా ఐదో అభ్యర్ధిని ఎలా నిలబెట్టారని టీఆర్‌ఎస్‌ను ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు.

సీఎల్పీ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి 15మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరు కాగా, ఉపేందర్‌ రెడ్డి, పైలెట్‌ రోహిత్‌ రెడ్డి గైర్హాజరు అయ్యారు. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పోడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, సురేందర్‌, జగ్గారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్‌, హర్షవర్థన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.

పీసీసీ నాయకత్వంపై విసుర్లు

సీఎల్పీ భేటీ నుండి అర్ధాంతరంగా వెళ్లిన కోమటిరెడ్డి

సీఎల్పీ భేటీ నుండి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. పీసీసీ నాయకత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ఆదివారం నాడు సీఎల్పీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కొద్దిసేపు పాల్గొన్న తర్వాత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వెళ్లిపోయారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓ నేత మరణించినందునే తాను వెళ్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.తాను పార్టీ మారేందుకు సమావేశం నుండి వెళ్లిపోవడం లేదిన కూడ ఆయన ప్రకటించారు. మరోవైపు సీఎల్పీ భేటీ నుండి బయటకు వచ్చిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత అదే నాయకత్వంతో పార్లమెంట్‌ ఎన్నకలకు ఎలా వెళ్తామని ఆయన ప్రశ్నించారు. పీసీసీ నాయకత్వాన్ని కూడ మార్చాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మార్చారు. టీఆర్‌ఎస్‌ నాయకత్వం మూడు నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే, తమ పార్టీ నాయకత్వం మాత్రం నామినేషన్ల దాఖలు చివరి నిమిషంలో టిక్కెట్లను కేటాయించారని చెప్పారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయమై నెలల తరబడి జాప్యం చేశారని ఆయన విమర్శించారు. శత్రువు బలమైన వ్యక్తి… అందుకే బలమైన నాయకత్వం పీసీసీకి ఉండాలని ఆయన డిమాండ్‌ చేశారు. బలమైన నాయకత్వం ఉంటేనే తెలంగాణలో పార్టీని బతికించుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close