Featuredస్టేట్ న్యూస్

‘ధర్మపీఠం’ దారి తప్పిస్తున్నారు..?

న్యాయదేవత కళ్ళకు గంతలు

  • మూడోకన్ను తెరువమ్మా..!
  • రింగు తిప్పుతున్న ఖాకీ
  • వంత పాడుతున్న ఉద్యోగులు
  • పేదోడికి ‘న్యాయం’ దక్కేనా..?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

స్వతంత్ర భారతావనిలో ప్రజాస్వామ్యం ముసుగులో అరాచక శక్తులు రాజ్యమేలితే… నాలుగో సింహం ‘ముడతలు పడిన మడతలు నాలుకతో..’ నోరు పెగలటం లేదు. పత్రికా ప్రపంచం నోరెత్తలేని పరిస్థితి దాపురిస్తే.. నిర్భాగ్యులను ఓదార్చే ‘న్యాయదేవత’ ఉందనే భరోసా ఈ దేశాన్ని నడిపిస్తోంది. అమ్మలాంటి న్యాయదేవతను కరుకుదనం కలిగిన ‘ఖాకీ’ కటువుగా, కపటంగా మోసం చేస్తుంది. దాని వెనుక ఓ ఐపిఎస్‌ ముసుగులు వేస్తూ కరతాళ నృత్యం చూస్తున్నాడు. ప్రతి ఖాకీ సిగ్గు పడాలి.తలదించుకోవాలి. అది వారికే కాదు.. ప్రతి పౌరుడికీ అవమానమే..! ‘తప్పులు సరిదిద్దుకోవాలని కోరుకోం’. భారత పౌరులుగా ‘హెచ్చరిక’… అంటే ఖాకీ ‘ఇగో’ దెబ్బతింటుంది. అందుకు సగౌరవంగా, సగర్వంగా ఆ నీచ సంఘటనలకు మీరే మీకిష్టమైన పేరు పెట్టుకోండి. అరాచకీయానికి అధికార దుర్వినియోగం తోడైతే ఇలాంటి అమానవీ కోణంతో కూడిన సంఘటనలు జరుగుతాయి. ఈ బరితెగింపు ఏస్థాయికి చేరిందంటే… ఓ న్యాయమూర్తి సంతకాలనే ఖాకీ నిసిగ్గుగా, నిగర్వంగా దర్జాగా ఫోర్జరీ చేసింది. అవినీతి పరుల కోణంలో కోర్టు ధిక్కారణ ధోరణులను ధిక్కరిస్తూ..(?) ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ఆధారాలతో ధైర్యంగా ముందుకు వస్తుంది. ఇక చర్యలు తీసుకోవల్సింది.. పోలీసు బాసులా..? వారికీ చేత కోకపోతే… హైకోర్టు ఈ దృష్టాంతాలపై ‘తప్పుడు పనులు చేసిన వారి భవిష్యత్తు’ నిఖార్సుగా నిర్ణయిస్తుంది.

అన్యాయం జరిగింది ఇలా..: (గమనిక: భద్రతా కారణాల దృష్ట్యా బాధితుని పేరు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచడం జరిగింది) ఎక్కడైనా, ఎవరైనా పిర్యాదు చేసిన తరువాత నిందితులను విచారణకు పిలుస్తారు. సాక్ష్యాధారాలు ఉంటే నిబంధనల మేరకు అరెస్ట్‌ లేదా స్టేషన్‌ బెయిల్‌. ఈ కేసులో మాత్రం సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేష్‌ బాబు (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తిని ‘బాస్‌’ ఆదేశాల మేరకు పిర్యాదు లేకుండానే (సి.సి. పుటేజులు భద్రం) పోలీస్‌ తరహా ‘లిప్టింగ్‌’ చేశారు. నాటి బస్‌ టికెట్ల నకళ్ళను కూడా ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ గుంభనంగా సంపాదించింది. తాపీగా ఆ మరుసటిరోజున పిర్యాదు స్వీకరణ, అనంతరం సంబంధిత పోలీసులకు ట్రాన్స్‌ పోర్టు ఇచ్చినట్లు రికార్డులలో ఎక్కించారు. మరి 2014, సెప్టెంబరు 19వ తేదిన వీరికి ప్రయాణ అనుమతి ఇస్తే… సెప్టెంబరు18న అదే పోలీసులు బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుని ఆఫీసు పరిసర ప్రాంతాలలోని సి.సి.పుటేజులలో పోలీసులు చేసిన హంగామాను ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ సంపాదించింది. మరో 24 గంటల ‘పోలీసు మార్కు విచారణ’ జరిగింది. వైద్య పరీక్షల అనంతరం ”తొలి అరెస్టు” సగర్వంగా చూపారు.

9 రోజులు – 3 కథలు: ‘అసలు ఉద్దేశ్యం’ నెరవేరక పోవడంతో రకరకాల సంప్రదింపులు తొమ్మిది రోజుల పాటు జరిగాయి. ఎక్కడ బాధితుడు మహేష్‌ బాబు రాజీ పడలేదు. దీంతో ‘బాస్‌’ ప్రాపకం కోసం మళ్ళీ మోడువారిన ‘ఖాకీ మెదళ్ళు’ తమ ఆలోచనలకు పదును పెట్టాయి. పొలిటికల్‌ పవర్‌, పోలీసులు కలసి ఏంచేసినా అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది. అదే అవకాశంగా మళ్లీ అదే కేసు, అదే ఎఫ్‌ఐఆర్‌, అదే నేరంపై, అవే సెక్షన్లు… ఎంచక్కా మరోసారి అరెస్టు కార్యక్రమం కానిచ్చారు. ఈ సందర్భంగా పోలీసు కస్టడీలో రికార్డుల ప్రకారం ఉన్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఒకసారి చెప్పారు. మరోసారి నిందితుడే ‘తానే స్వయంగా వచ్చి లొంగిపోయినట్లు’ రికార్డుల పరంగా పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాలు బేఖాతరు: బాధితుడు మహేష్‌ బాబు అన్ని ఆధారాలతో జిల్లా న్యాయస్థానం ముందుంచడంతో ప్రైవేటు కంప్లైంట్‌ రూపంలో పోలీస్టేషన్‌ కు చేరింది. ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్‌ అయింది. ఇక్కడే మరో ఖాకీ ట్విస్ట్‌.. సహజంగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఉద్యోగి కన్న పైస్థాయి అధికారికి విచారణ బాద్యతలు అప్పగించాలి. ఇక్కడ అభియోగాలు ఎదుర్కొంటుంది ఓ ఎస్పీ స్థాయి ఉద్యోగి. ఆయన పైస్థాయి ఉద్యోగి చేత విచారణ జరగాలి. కానీ చేసింది మాత్రం ఎస్‌.ఐ. స్థాయి ఉద్యోగి. అంటే ఇక్కడే కేసును పాతిపెట్టే ప్రక్రియ ఘనంగా జరిగింది. ఆడియో, వీడియో, డాక్యుమెంటరీ ఆధారాలను పక్కన పెట్టి ‘కేసు క్లోజ్‌’ సిగ్గు లేకుండా చేశారు.

అధికారులు ఎంతగా తెగించారంటే.: బాధితుడు న్యాయస్థానంలో న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేదు. అయినా బాధితుడి తరఫున న్యాయవాది ఈయనే అంటూ చూపారు. దీనిపై బార్‌ కౌన్సిల్‌ కు ఫిర్యాదు అందింది. విచారణ కొనసాగుతోంది.

ఃూచీ:

తాజా నిర్వాకం: సంబంధిత కేసుల పరంపరలో ఓ కేసుకు సంబంధించి గతంలో పని చేసి బదిలీపై వెళ్ళిన న్యాయమూర్తి సతకంతో తాజా తేదీలతో కూడిన దిద్దుబాటుతో కూడిన సమన్లు వెళ్ళాయి. చేసిన అమానవీయ, నికృష్ట పనికి సిగ్గు పడాల్సింది పోయి.. గద్దాయింపులు, బెదిరింపులు.

న్యాయవిచారణకు ఆదేశం: హైకోర్టుకు అందిన ఫిర్యాదు మేరకు హైకోర్టు విజిలెన్స్‌ శాఖ (ఆర్‌ఓసి నెం. 2088/2018, తేది: 08.03.2018) దర్యాప్తు అంకం ప్రారంభించింది. ఇందులో ఏకంగా సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తిపైనే (ఫైల్‌ నెం. 08/2019) ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా… ఖాకీలు అత్యుత్సాహంతో చేసిన మరో నిర్వాకం ఏమిటంటే… 2014లో అక్కడ పనిచేసిన న్యాయమూర్తి సంతకంతో ఏకంగా సమ్మన్స్‌ నెం. 287/2014 సిసి నెం. 784/2016 పేరుతో… జులై 7, 2019, ఉదయం 10.30గంటలకు రావాలని… ఏప్రిల్‌26, 2019న తాఖీదులు పంపారు. ఔరా.. స్వతంత్ర భారతంలో ఖాకీ లీలలు. విశ్వదాభిరామ వినురా వేమా..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close