అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న గోపిని అభినందిస్తున్న డిజిపి మహేందర్ రెడ్డి.

0

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డిజిపి పర్యటన
★ పోలీస్‌ అధికారులతో డీజీపీ సమీక్ష

(భద్రాద్రి, భూఫాల్ పల్లి, ఆదాబ్ హైదరాబాద్)
కొత్తగూడెంలోని ఇల్లందు క్లబ్‌లో పోలీస్‌ అధికారులతో డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల భద్రతపై చర్చించామని, కొత్తగూడెం జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. ఆధునిక టెక్నాలజీ, ఫేషియల్ ఐడెంటిఫై ద్వారా కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే సమాచారాన్ని సేకరించాలని మహేంద్‌రెడ్డి ఆదేశించారు.

భూపాలపల్లిలోనూ…:
భూపాలపల్లి జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులకు పలు సూచనలు చేశారు. ప్రజా ప్రతినిధులకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలకతీతంగా పోలీసు యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ భాస్కరన్‌ను ఆదేశించారు. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు లేవని డీజీపీ స్పష్టం చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here