రాహుల్‌గాంధీకి దీదీ సర్కార్‌ షాక్‌!

0

పశ్చిమ బెంగాల్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ను బెంగాల్‌లో అడుగుపెట్టకుండా చేశారు మమతా బెనర్జీ. ఆయన హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. స్థలం కొరత కారణంగానే.. అనుమతి ఇవ్వడం లేదంటూ తేల్చి చెప్పారు పోలీసులు. దీంతో ఆదివారం జరగాల్సిన సభను రద్దు చేసుకున్నారు రాహుల్‌. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి షాక్‌ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిలిగురిలో రాహుల్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు బెంగాల్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇవాళ సిలిగురిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌. ఈ సభలో రాహుల్‌ ప్రసంగించాల్సి ఉంది. సభకు అన్ని ఏర్పాట్లు పూర్తైన తర్వాత కాంగ్రెస్‌ నేతలకు, బెంగాల్‌ అధికారయంత్రాంగం షాకిచ్చింది. రాహుల్‌ హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరిస్తున్నట్లు డార్జిలింగ్‌ జిల్లా అధికారులు తెలిపారు. స్థలం కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో చేసేది ఏవిూ లేక ఆదివారం జరగాల్సిన సభను రద్దు చేసుకున్నారు రాహుల్‌. మమతా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. హెలికాఫ్టర్‌ ల్యాండింగ్‌, సభకు సంబందించి అన్ని పత్రాలను తాము సకాలంలో ఇచ్చినప్పటికి రాహుల్‌ పర్యటనను అడ్డుకోవడం దారుణమన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, ప్రత్యర్థి పార్టీలపై చౌకబారు విధానాలను అనుసరిస్తోందని దుయ్యబట్టింది. జాతీయ పార్టీ అధ్యక్షుడి విషయంలో ఈ విధంగా వ్యవహరించడం చూస్తుంటే, రాహుల్‌కు అధికార తృణమూల్‌ పార్టీ ఎంతగా భయపడుతోందో అర్థమవుతోందని ఘాటుగా విమర్శించింది. బెంగాల్‌ ప్రభుత్వ ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, యూపీసీఎం యోగి ఆదిత్యానాత్‌ విషయంలో కూడా దీదీ ఇలాగే వ్యవహరించారు. వీరి హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు దీదీ ప్రభుత్వం అనుమతి నిరా కరించింది. ఇది బీజేపీ, టీఎంసీల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. బెంగాల్‌ ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా వ్యవహ రించడం లేదని కమలదళం కస్సుమంది. ఇప్పుడు రాహుల్‌ గాంధీకి సైతం అనమతి నిరాకరించడంతో.. కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here