దేవేందర్‌ గౌడ్‌ సంస్థల్లో ఐటీదాడులు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో ఐటీ సోదాలు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. తమపై కేంద్రం వివక్ష చూపిస్తోందని.. అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన నేతలపై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని స్వయంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉమ్మడి రాష్ట్రంలో ¬ం మంత్రిగా పనిచేసిన దేవేందర్‌ గౌడ్‌, అతని కుమారుడు వీరేంద్ర నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం 20 బృందాలుగా వచ్చిన ఐటీ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది. డ్యూక్‌ బిస్కెట్‌ కంపెనీ, డీఎస్‌ఏ బిల్డర్స్‌ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని, ఐటీ చెల్లింపులు సక్రమంగా చెల్లించడం లేదనే ఆరోపణలతో తనిఖీలుచేసినట్లు తెలిసింది. అంతేగాకుండా రవి ఫుడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, డీఎస్‌ఏ బిల్డర్స్‌ అండ్‌ కన్‌ స్టక్షన్స్ర్‌, శాంతారామ్‌ కన్‌ స్టక్షన్స్ర్‌ లపై ఐటీ దాడులు జరిగాయి. దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌ ఉప్పల్‌ నుంచి మహాకూటమి (తెదేపా) అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి బుధవారమే ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే తమపై ఎలాంటి దాడులు జరిగినా భయపడేది లేదని వీరేందర్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here