Featuredస్టేట్ న్యూస్

డిప్యూటీ స్పీకర్‌గా.. పద్మారావు ఏకగ్రీవర

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమ వారం అసెంబ్లీ సమావేశాలు ప్రారం భమైన అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి.. పద్మారావు డిప్యూటీ స్పీకర్‌ అని అధికారికంగా ప్రకటిం చారు. ఎన్నిక అనంతరం ఈ సంద ర్భంగా పద్మారావుగౌడ్‌ను సీఎం కేసీఆర్‌, దానం నాగేందర్‌, కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు కలిసి అభినందనలు తెలి యజేశారు. కాగా.. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికలో భాగంగా శనివారం నామి నేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావు గౌడ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 2014 నుంచి 2018 వరకు పద్మారావు ఎక్సైజ్‌, అబ్కారీ మరియు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

మార్గదర్శకంగా నిలిచేలా కలిసి పనిచేద్దాం – పద్మారావు

ఇతర రాష్ట్రాల శాసనసభలకు మార్గదర్శకంగా నిలిచేలా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మనమంతా కలిసి పనిచేద్దామని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత పద్మారావు గౌడ్‌ మాట్లాడారు.. శాసనసభ సభా నాయకులు సీఎం కేసీఆర్‌, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకులు, శాసనసభ్యులు.. తెలంగాణ రెండో శాసనసభకు నన్ను ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.  ప్రజాస్వామ్య వ్యవస్థకు చట్టసభలే పట్టుగొమ్మలని, ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన శాసనసభకు గౌరవ ఉప సభాపతిగా ఎన్నికైన తర్వాత సభలో నిష్పక్షపాతంగా, ప్రజలకు ఉపయోగపడే చర్చలు ఈ సభలో చోటు చేసుకోవాలని ఇందుకోసం సభ్యులందరికీ సముచిత అవకాశాలు కల్పించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయమన్నారు. చట్టసభలు ఎక్కడైతే స్ఫూర్తివంతంగా, ఉపయుక్తమైన చర్చలు చేస్తూ ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు నెలవులుగా ఉంటాయో అక్కడ ఆయా సమాజాలు అద్భుతమైన అభివృద్ధిని, ఫలితాలను ఆవిష్కరించుకుంటున్నాయన్నారు. ఉపసభాపతిగా ఎన్నికయ్యేందుకు విూరంతా ఏ విధంగా సహకరించారో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా శాసనసభలో నా కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ఇదే సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని పద్మారావు అన్నారు. వర్తమాన తరానికే కాకుండా భావితరాల వారికి స్ఫూర్తివంతంగా సభా 

కార్యక్రమాలు నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హావిూ ఇస్తున్నాననని, మన శాసనసభ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు ఉప సభాపతిగా నా ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవం చేసి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పినందుకు మరొక్కసారి సభలోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అధికారపక్షవారమైనా, ప్రతిపక్షవారమైనా మన అంతిమ లక్ష్యం ఉన్నతమైన మానవీయ విలువలను పెంపొందించడమే కాబట్టి మనమంతా కలిసి పని చేయగలిగితే అద్భుతమైన ఫలితాలను సాధించగల్గుతామన్నారు. మన శాసనసభకు దేశంలోనే ఒక ప్రత్యేకత ఉందని, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని, చక్కటి పంథాలో సభ నిర్వహణ జరుగుతుందని మన శాసనసభకు కీర్తి, ప్రతిష్ఠ ఉందని పద్మారావు తెలిపారు. ఈ ప్రతిష్ఠతను మరింతగా ఇనుమడింపజేసేందుకు విూ అందరి సహకారం తీసుకొని విూరు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి సభా గౌరవం మరింతగా పెరిగేందుకు కృషి చేస్తానని హావిూ ఇస్తున్నాననని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పెంపొందిస్తూ మంచి సంప్రదాయాలకు శ్రీకారం చుడుతూ మన శాసనసభ ఇతర శాసనసభలకు మార్గదర్శకంగా నిలిచేలా మనమంతా కలిసి పని చేద్దామని కోరుకుంటున్నానని అన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close