Featuredఅంతర్జాతీయ వార్తలు

రావణ రాజ్యంలో రాక్షస మేథం..

  • పేలుళ్ళతో దద్దరిల్లిన కొలంబో
  • 207 మంది మృతి..550 మందికి తీవ్ర గాయాలు
  • చర్చిల్లో తెగిపడ్డ శరీర భాగాలు, ఛిద్రమైన మతదేహాలు
  • ఈస్టర్‌ పండుగ రోజు ఆరు ప్రార్ధనా స్థలాల్లో బాంబుపేలుళ్ళు
  • ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ హస్తం.. లంక ప్రభుత్వం నిర్ధారణ

కొలంబో: రావణరాజ్యం శ్రీలంక అట్టుడికిపోతోంది. అల్లకల్లోలంగా మారింది. క్రైస్తవ ప్రార్థనా సంస్థలు, హోటళ్లను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా సాగిన బాంబు దాడులు యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరగొలిపేలా చేశాయి. జీసస్‌ పునరుజ్జీవితుడౌతాడని భావించే ఈస్టర్‌ సండే రోజు శ్రీలంకలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాలను తిలకించడానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులే టార్గెట్‌గా ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్దారించాయి ఆ దేశ భద్రతా బలగాలు. రాజధాని కొలంబోలని సెయింట్‌ ఆంథోని చర్చి, పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న నెగొంబోలని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చి, తూర్పు తీర ప్రాంతంలోని బట్టికలోవాలోని స్థానిక చర్చిలపై బాంబు పేలుడు స ష్టించారు. ఒక్క కొలంబో చర్చిలోనే 42 మందికి పైగా భక్తులు మత్యువాత పడ్డారు. బట్టికలోవా చర్చిలో మరో 10 మంది దుర్మరణం పాలైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. ఈ మూడు చర్చిలతో పాటు షాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌ బరి హోటళ్లపై బాంబుదాడులు చోటు చేసుకున్నాయి. శ్రీలంకలో చోటు చేసుకున్న పేలుళ్ల సందర్భంగా మతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆరంభంలో 24 మంది మ తిచెందగా.. కొన్ని నిమిషాల వ్యవధిలో ఈ సంఖ్య 52కు చేరుకుంది. మరో రెండు గంటల వ్యవధిలో మతుల సంఖ్య 207 కి చేరింది. 550 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటం వల్ల

మతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుల సంఖ్య వందల్లో ఉండటం వల్ల సరైన వైద్య చికిత్స దొరకట్లేదు. కొలంబో, బట్టికలోవాల్లోని అన్ని ఆసుపత్రులు, చివరికి స్థానిక క్లినిక్‌ లు కూడా గాయపడ్డ వారితో నిండిపోయాయి. చర్చిల్లో తెగిపడ్డ శరీర భాగాలు, ఛిద్రమైన మ తదేహాలతో అల్లకల్లోలంగా తయారైంది అక్కడి పరిస్థితి. క్షతగాత్రులు, వారి బంధుమిత్రుల రోదనలతో శ్రీలంకలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్‌ల సైరన్‌ లతో స్థానిక ప్రాంతాలన్నీ మారుమోగిపోతున్నాయి. శ్రీలంకలో ఇంత పెద్ద ఎత్తున మారణకాండ చోటు చేసుకోవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. శ్రీలంకలో ప్రత్యేక దేశం కోసం లిబరేషన్‌ ఆఫ్‌ తమిళ టైగర్స్‌ ఈలం (ఎల్టీటీఈ) సాగించిన యుద్ధంలో వందలాది మంది హతమయ్యారు. అది గతం. తాజాగా చోటు చేసుకున్న మారణ హోమం వెనుక ఇస్లామిక్‌ ఉగ్రవాదం ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీలంకపై ఇస్లామిక్‌ ఉగ్రవాదం విరుచుకుని పడిన ఘటనలు ఆ దేశంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ సారి ఈస్టర్‌ సండేను దష్టిలో పెట్టుకుని నరమేథాన్ని సష్టించడం పట్ల ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈస్టర్‌ సండే నాడు ఆ దేశంలో జరిగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు హాజరయ్యే విదేశీ పర్యటకులను టార్గెట్‌ గా చేసుకున్నారని అక్కడి పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. దాడుల తీరుతెన్నులు, ఉగ్రవాదులు ఎంచుకున్న ప్రదేశాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. శ్రీలంక- ప్రధానంగా బౌద్ధమతాన్ని అనుసరించే దేశం. సింహళీయుల్లో అధిక శాతం జనాభా బౌద్ధిజాన్ని అనుసరిస్తుంటారు. శాంతికాముకుడు గౌతమ బుద్ధుడు సూచించిన అహింసా మార్గంలో నడిచే దేశంగా శ్రీలంకకు ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉంది. అందుకే లంకేయుల పేర్లల్లో భారతీయ తత్వం కనిపిస్తుంటుంది. కొంతకాలంగా అక్కడి సామాజిక పరిస్థితులు మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవలి కాలంలో అక్కడ క్రైస్తవం విస్త తమైందని అంతర్జాతీయ స్థాయి విశ్లేషకులు చెబుతున్నారు. సింహభాగం సింహళీయులు క్రైస్తవాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీలంకలో నివసించే సంప్రదాయ ముస్లింలు కూడా క్రైస్తవాన్ని స్వీకరిస్తున్నారంటూ ఇదివరకు వార్తలొచ్చాయి. ఈ మత మార్పిడి వ్యవహారం ఇస్లాం ఉగ్రవాదం ఆగ్రహానికి కారణమై ఉండొచ్చంటూ అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈస్టర్‌ సండేను ఇస్లామిక్‌ ఉగ్రవాదం టార్గెట్‌ గా చేసుకోవడం వెనుక ప్రధాన కారణం మత మార్పిడులే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

శ్రీలంక నరమేథం ఐసిస్‌ పనే.. జిహాదీలుగా నిర్ధారణ రాజధాని

కొలంబో సహా మూడు వేర్వేరు ప్రాంతాల్లోని క్రైస్తవ ప్రార్థనా స్థలాలు, హోటళ్లపై దాడులు చేసి, నరమేథానికి పాల్పడిన ఘటన వెనుక భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ హస్తం ఉందని తేలింది. ఐసిస్‌ ఆత్మాహూతి దళ సభ్యులు ఈ ఘటనకు కారణమని శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జహ్రెయిన్‌ హుస్సేన్‌, అబు మొహమ్మద్‌ అనే ఉగ్రవాదులు రెండు ప్రాంతాల్లో ఆత్మాహూతి దాడులకు పాల్పడినట్లు అధికారులు దవీకరించారు. జిహాద్‌ పేరుతో దాడులు చేసినట్లు గుర్తించారు. ఈస్టర్‌ నాడు ఆరు ప్రార్ధనా స్థలాల్లో బాంబుపేలుళ్లతో దద్దరిల్లిన కొలంబో పర్యాటకుడి రూపంలో.. శ్రీలంక మారణ కాండ వెనుక..భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ హస్తం ఉన్నట్లు శ్రీలంక ప్రభుత్వం నిర్ధారించింది. ఐసిస్‌ ఆత్మాహూతి దళం ఈ దాడులు చేసినట్లు తేలింది. జహ్రెయిన్‌ హుస్సేన్‌, అబు మొహమ్మద్‌ రెండు ప్రాంతాల్లో ఈ దాడులకు తెగబడినట్లు శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. జహ్రెయిన్‌ హుస్సేన్‌.. పర్యాటకునిగా షాంగ్రిలా హోటల్‌ కు వెళ్లినట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. షాంగ్రిలా హోటల్‌ లో ప్రవేశించిన అనంతరం తనను తాను పేల్చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. మరో ఉగ్రవాది అబు మొహమ్మద్‌ బట్టికలోవాలోని చర్చిపై దాడికి పాల్పడ్డాడని అధికారులు గుర్తించారు. అతను కూడా పర్యాటకుడి రూపంలో చర్చి వద్దకు వెళ్లి ఉంటాడని శ్రీలంక అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రాథమికంగా ధవీకరించింది. మిగిలిన నాలుగు చోట్ల కూడా ఇదే తరహాలో ఆత్మాహూతి దళ సభ్యులే దాడులు చేసి ఉంటారని, దీనికి సంబంధించిన ఆధారాలు ఇంకా ఏవీ తమ చేతికి చిక్కలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. తొలి పంజా.. సిరియాపై పట్టు కోల్పోయిన తరువాత ఐసిస్‌.. భారీ ఎత్తున మారణ హోమానికి పాల్పడటం ఇదే తొలిసారి. సిరియాలో ఐసిస్‌ ఆధీనంలో ఉన్న అనేక ప్రాంతాలను అమెరికా, ఫ్రాన్స్‌ , రష్యానేత త్వంలోని సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ఐసిస్‌ ఉగ్రవాదులను తరిమికొట్టాయి. ఈ ఉదంతం తరువాత క్రమేణా ఐసిస్‌ తన పట్టు కోల్పోతూ వచ్చింది. ఇక ఐసిస్‌ పనైపోయిందనుకుని ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా ఆ సంస్థ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. విధ్వంసాన్ని సష్టించారు. 207 మందికి పైగా ప్రజలను పొట్టన బెట్టుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం ఐసిస్‌ చరిత్రలో కూడా ఇదే తొలిసారి అయి ఉండొచ్చని అంటున్నారు. శ్రీలంకను టార్గెట్‌ గా చేసుకుని విలాయాన్ని సష్టించారు. జిహాద్‌ పేరుతో ఈ దాడులు చేశారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరో నాలుగు చోట్ల దాడులూ వారి పనే.. హోటల్‌ షాంగ్రిలా సహా బట్టికలోవాలోని చర్చిపై ఐసిస్‌ ఆత్మాహుతి దళ ఉగ్రవాదులే దాడులు చేశారని తేలడంతో.. ఇక మిగిలిన నాలుగు చోట్ల విధ్వంసాన్ని సష్టించింది కూడా వారే అయి ఉంటారని శ్రీలంక భద్రతా బలగాలను ఓ నిర్ధారణకు వచ్చాయి. జిహాదీల దాడులు అనే కోణంలో తమ దర్యాప్తును మొదలు పెట్టాయి. గుడ్‌ ఫ్రైడేకు ముందు రోజు లేదా అంతకుముందే- ఐసిస్‌ ఉగ్రవా దులు శ్రీలంక చేరుకుని ఉండొచ్చని అనుమాని స్తున్నాయి. పర్యాటకుల రూపంలో వచ్చి, దాడులు చేశారా? లేక స్థానికుల ను ఈ ఘాతుకానికి పురిగొల్పారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

పలు ఆస్పత్రుల్లో రక్తం కొరత… సెయింట్‌ ఆంథోనీ చర్చిలో మొదటి పేలుడు జరగ్గా.. సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిలో రెండో బాంబు పేలింది. మూడో పేలుడు బట్టికలోవ ప్రాంతంలోని చర్చిలో జరిగింది. అనంతరం హోటళ్లలో పేలుళ్లు జరిగాయి. బట్టికలోవ ప్రాంతంలో ఈస్టర్‌ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగే పేలుడులో మ తిచెందినవారిలో అత్యధికులు చిన్నారులే. ఇక్కడి క్షతగాత్రులను తరలించిన బట్టికలోవ టీచింగ్‌ ఆస్పత్రిలో రక్తం కొరత నెలకొంది. నెగోంబోలో సైతం రక్తం కొరత ఉంది. రక్తం కొరత తీవ్రంగా ఉన్నట్టు సమాచారం. పేలుళ్ల ధాటికి చర్చిలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పైకప్పులు కుప్పకూలిపోయాయి. జనం కూర్చునే బల్లలన్నీ తునాతునకలయ్యాయి.

ఆస్పత్రుల వద్ద అంతులేని ఉద్వేగం.. ఈ ఘటనలతో కొలంబోలో పెను విషాదం అలముకుంది. మతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నాంటాయి. ఘటనా స్థలాలు, ఆస్పత్రుల వద్ద అంతులేని ఉద్వేగ వాతావరణం నెలకొంది. వందలాది మంది గాయపడటంతో వారిలో ఎవరైనా తమ వారు ఉన్నారా అని చాలామంది ఆస్పత్రులకు పరుగులు తీసి తమ వారి కోసం ఆరా తీస్తున్నారు. శ్రీలంకలోని నేషనల్‌ తోహిద్‌ జమాత్‌ (ఎన్‌టీజే) సంస్థ ఆత్మహుతి దాడులకు పాల్పడుతుందని కొన్ని రోజుల క్రితమే ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించిందని అధికారులు తెలిపారు. దీనిపై 10 రోజుల కిందటే అధికారులకు సమాచారం ఇచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో శ్రీలంక పోలీస్‌ విభాగం అధిపతి ప్రభుత్వ ఉన్నతాధికారులకు హెచ్చరికలు జారీచేసినట్టు సమాచారం. ఎన్‌టీజే రాడికల్‌ ముస్లిం వర్గం గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

శ్రీలంక అధ్యక్షుడు దిగ్భ్రాంతి… మారణకాండపై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వరుస దాడులతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కొలంబో సహా ముఖ్యమైన ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. పదేళ్ల క్రితం శ్రీలంకలో ముగిసిన అంతర్యుద్ధం అనంతరం ఇదే అతి పెద్ద దాడిగా చెబుతున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close