Featuredస్టేట్ న్యూస్

అమీన్‌ పూర్‌లో కూల్చివేతలు.. తొలి గునపం పేదల పైనే

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): అమిన్‌ పూర్‌ మున్సిపల్‌ పరిధిలో వందల ఎకరాల లో కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను రక్షించేందుకు మండల తహసీల్దార్‌ విజయ్‌ ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాదారులకు ఫలహారంగా మారా యని, బహుళ అంతస్తుల భవనాలకు హెచ్‌. ఎం .డి .ఎ .సైతం అనుమతులను మంజూరు చేస్తుందని వరుస కథనాలను ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రికలో ప్రచురించిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా బీరంగూడ గ్రామంలోని సర్వే నంబర్‌ 994 లో నిర్మించిన అక్రమ కట్టడాలను తహశీల్దార్‌ నేతత్వం లోని బందం గుర్తించి కూల్చి వేతను ప్రారంభిం చింది. ఇక ముందు కబ్జాలను నిరోధించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. కాగా ప్రభుత్వ స్థలాల్లో ఎకరాలను కబ్జా చేసుకొని దత్త సాయి పేరుతో భవనం నిర్మించినా, రాజకీయ నాయకులు బినామీ పేర్లతో బహుళ అంతస్తుల భవనం నిర్మించినా వారి జోలికి పో యే సాహసం చేయని అధికారులు నిరుపేదలైన వారి ఇళ్లను కూల్చి వేయడం తగదని విమర్శలున్నాయి.మరోవైపు తొలుత ప్రభుత్వ స్థలాల్లో తిష్ట వేసుకుని కూర్చున్న బడాబాబుల పని పట్టాలని ఆ తర్వాతే తమ జోలికి రావాలని నిరాశ్రయులైన బాధితులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ రెవెన్యూ అధి కారులు సమన్వయంతో పని చేసిన నాడే కబ్జాలను నివారించ గలరని అంతవరకు ఎమ్మార్వో కూల్చు కుంటూ పోతే, మున్సి పల్‌ అధికారులు అనుమతులు మంజూరు చేసుకుంటూ వస్తారని వారు ఎద్దేవా చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close