ఢిల్లీని కప్పేసిన కాలుష్యం

0

– సుప్రిం తీర్పును పాటించని ఢిల్లీ వాసులు

– రాత్రంతా టపాసుల మోతతో దద్దరిల్లిన ఢిల్లీ

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీని కాలుష్య కప్పేసింది. దీపావళి సందర్భంగా ఢిల్లీ వాసులు రాత్రంతా టపాసుల మోత మోగించడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో కాలుష్య స్థాయి తీవ్రంగా ఉంది. గురువారం ఉదయం కూడా ఢిల్లీ వీధుల్లో కాలుష్యపు పొగదట్టంగా అలుముకుంది. ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో గాలినాణ్యతా సూచీ(ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) 999కి పడిపోయింది. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ నేషనల్‌ స్టేడియం వద్దకూడా 999గా నమోదైంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలో ఈ దీపావళికి గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే కాల్చాలంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో పాటు కేవలం రెండుగంటల పాటు మాత్రమే బాణసంచా కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే సుప్రీం తీర్పును చాలా మంది స్థానికులు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. రాత్రి 10దాటినా టపాసులు పేల్చారని చెప్పారు. అయితే

ఎంతమంది నిబంధనలను ఉల్లంఘిచారో దర్యాప్తు చేస్తున్నామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కాలుష్య స్థాయి తీవ్రంగా ఉంటోంది. ఇక్కడ కాలుష్యం సాధారణం కంటే 8రెట్లు ఎక్కువగా ఉంటోంది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ దీపావళికి గ్రీన్‌క్రాకర్స్‌ వాడాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అవి కూడా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కేవలం రెండు గంటలు మాత్రమే పేల్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే తీర్పుతో మాకేంటీ అనుకుంటూ చాలా మంది రాత్రంతా టపాసులు పేల్చడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి పడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here