Featuredజాతీయ వార్తలు

గృహనిర్బంధం నుంచి గౌతమ్‌కు విముక్తి

(న్యూఢిల్లీ, ఆదాబ్ హైదరాబాద్): పౌర హక్కుల నేత గౌతమ్ నవలఖా గృహనిర్బంధం నుంచి విముక్తి పొందారు. జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అయిన నవలఖాను .. పుణె పోలీసులు గృహనిర్బంధం చేశారు. బీమాకోరేగావ్ అల్లర్ల కేసులో దేశవ్యాప్తంగా అయిదుగురు పౌర హక్కుల నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో గౌతమ్ కూడా ఉన్నారు. గృహనిర్బంధం నుంచి గౌతమ్‌ను విముక్తి చేయాలంటూ ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. దిగువ కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చంటూ కొన్ని రోజుల క్రితం ఈ కేసులో సుప్రీం తీర్పునిచ్చింది. ట్రాన్సిట్ రిమాండ్ ఆర్డర్‌ను కూడా ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది. ఇదే కేసులో వరవరరావు, అరుణ్ ఫెరిరా, వెర్నన్ గొంజాల్వెస్, సుధా భరద్వాజ్‌లు కూడా గృహనిర్బంధంలో ఉన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close