ఆలస్యం వ్యూహాత్మకం జాబితా నాన్చుడుతో కళ్ళెం

0

-కేసీఆర్‌ కట్టడి కోసమే

-చంద్రుడి వ్యూహం

-17మంది కోవర్టుల గుర్తింపు

-6న స్క్రీనింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కేసీఆర్‌ తిట్టాలంటే…: ఇంటి ముందు ముగ్గేస్తున్నా… ఆ ‘మగ్గు’లోకి అందరూ వస్తారని గులాబీనేత భావించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే..కేసీఆర్‌ ‘అద ష్ట ఆరు’ ఎందుకు…?

‘రంగ’స్థలంపై 944ఆల్‌ జీరోస్‌ 9… ఎందుకు..? ఎందుకూ పనికి రాని అప్ట్రాల్‌ ‘నల్లదొంగ’.. అతగాడి వెనుక లిక్కర్‌ లాబీ ‘మధు’రంగా చేసిన ప్రతి విషయం ఈ కలం దష్టిలో స్పష్టంగా వడపోతలో ఉంది.

17 మంది కోవర్టుల గుట్టు..: కాంగ్రెస్‌ పార్టీ నవంబర్‌1వ తేదీన ప్రకటించాల్సిన జాబితా ప్రకటన వాయిదా పడింది. దానికి పైకి ఎన్ని కారణాలు చెపుతున్నా… అంతర్గంతంగా ఏఐసీసీ టాస్క్‌ ఫోర్స్‌ కు కోవర్ట్‌ ల జాబితా అందింది. దీంతో కేంద్ర కాంగీయులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ జాబితాలో టిపిసీసి ప్రముఖులు గుబాళింపు కోసం వెంపర్లాడుతున్న వైనం వెలుగుచూసింది. దీంతో ఒక్కసారిగా ప్లాన్‌ ‘బి’ అమలు

చేయాలని అనుకుంది.

అందుకే జాప్యం: సరిగ్గా గురిచూసి కొట్టడానికి తన అమ్ముల పొదిలోని ‘జాప్యం’ బాణం ప్రయోగించింది. కోవర్టులు కూడ ఇది ఊహించని పరిణామం. ఈ కోవర్టులకు తోడు భాగస్వామ్య పార్టీల ఆశావాహుల జాబితాలో కూడా కోవర్టులు ఉన్నారని తెలంగాణ తెలుగుదేశం భావించింది. సంబంధించిన వివరాలు గుట్టుగా ఢిల్లీకి చేరవేసింది. ఏఐసీసీ ప్రతినిధులు కూడా ఇతర భాగస్వామ్య పక్షాల కీలక సభ్యులతో అంతర్గత చర్చలు జరిపారు. సీను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి మార్చింది కూడా ఇందుకే.

కేసీఆర్‌ ఎవరిని తిట్టిపోయాల..?: 50 రోజులలో 100 సభలు పెడతానన్న కేసిఆర్‌ నాలుగు సభలకే పరిమితం అయ్యారు. ఆయన ప్రచారం చేస్తే ఎవరిని తిట్టాలి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని విమర్శించ కుండా సభలు నిస్సారంగా మారిపోతాయి. సభలకు కూడా భారీ ఖర్చు పెట్టాల్సిందే.! అంతే కాకుండా తెరాస అభ్యర్థుల ఖర్చు తడిసిపోపెడు అవుతోంది. అధికారపార్టీ 60 రోజుల ఖర్చు… ప్రత్యర్థి అభ్యర్థుల 30 రోజుల ఖర్చు సరి సమానం. ఈలోగా వచ్చే పండుగల ఖర్చు అధికార పార్టీకి అదనం.

అంటే జాబితా ఎంత ఆలస్యం చేస్తే కూటమికి అంత లాభం. దీంతో కేసీఆర్‌ దూకుడుకు ‘కాంగీ జాబితా’ పకడ్బందీగా కళ్ళెం వేసింది.

ఢిల్లీలో పడిగాపులు: సీట్లు ఆశిస్తున్న ఆశావహులు ఢిల్లీ చేరుకున్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ వర్థంతి కూడా కలసి రావడంతో అందరూ ఇందిర సమాధి దగ్గర ‘శ్రధ్ధాంజలి’ ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశారు. ఏఐసీసీ ఆఫీసు దగ్గరలో మధ్య తరగతి హోటళ్ళు లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకొంత మంది దీపావళి ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయం తీసుకోలేక సతమతమౌతున్నారు.

6న స్క్రీనింగ్‌ కమిటీ భేటి: ఎట్టకేలకు అందరి సర్థుబాటు తరువాత ఈనెల 6న ఢీల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ భేటీకావాలని శనివారం అర్థరాత్రి తెలంగాణ కీలక నేతలకు ఏఐసీసీ సమాచారం పంపింది. ఈ సమావేశంలో ‘సీటు లభించని ఆశావాహులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం, పార్టీల పరంగా ఎవరిని ప్రచారానికి వాడుకోవాలి, సినీ తారలను ఏ మేరకు ఎక్కడ, ఏవిధంగా ఉపయోగించుకోవాలి’ అనే విషయాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది.

చివరిలో అధికారిక వీడియో, ఆడియోలు:

ఎన్నికల సమరంలో సామ, దాన, బేధ దండోపాయలు ఉంటాయి. అందులో భాగంగా ‘తెరాస’ వ్యవహారాలకు సంబంధించి ప్రత్యేక వీడియో, ఆడియోలు రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. మరి అవి ఏరూపంలో ఎవరిని, ఏవిధంగా ఇరుకున పెడతాయో వేచిచూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here