Featuredస్టేట్ న్యూస్

చీకట్లో డిగ్రీ పరీక్షలు…

పాస్‌ గ్యారంటీ అమలు కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం స్టడీ సెంటర్‌ గీతాంజలి జూనియర్‌ కాలేజీ యాజమాన్యం మాస్‌ కాపీయింగ్‌కు ఏర్పాట్లు….

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

కూకట్‌ పల్లి (ఆదాబ్‌హైదరాబాద్‌): జగద్గిరిగుట్టలోనీ సక్సెస్‌ క్రియేటివ్‌ పాఠశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం డిగ్రీ పీ.జీ. పరీక్షలను శుక్రవారం రాత్రి నిబం ధనలకు విరుద్ధంగా నిర్వహిం చారు. సుమారు 200కు పైగా హాజరైన విద్యార్థులు మాస్‌ కాపీయింగ్కు పాల్పడు తుండగా సమాచారం అందు కున్న స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. దీనితో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి పలువురు విద్యార్థులు గోడదూకి పారిపోయారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం నుండి స్టడీ సెంటర్‌గా అనుమతులు తీసుకున్న గీతాంజలి జూనియర్‌ కాలేజీ యాజమాన్యం తన కాలేజీ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని సక్సెస్‌ క్రియేటివ్‌ స్కూల్‌ లో మాస్‌ కాపీయింగ్‌ కోసం పూర్తి ఏర్పాటు చేసి శుక్రవారం రాత్రి పరీక్షలను నిర్వహిం చారు. కాలే జీ యాజమాన్యం దూరవిద్యా కేంద్రం నుండి డిగ్రీ పీజీ కోర్సుల్లో గ్యారెంటీగా పాస్‌ చేయిస్తామని భరోసా కల్పించి వేలాది రూపా యలను వసూలు చేసినట్లు సమాచారం.ఈ విధంగా నగరంలోని ఎల్‌ .బి. నగర్‌ రామంతపూర్‌, ఎస్‌ .ఆర్‌. నగర్‌ ,జగద్గిరిగుట్ట కేంద్రాలుగా అడ్డగోలు వ్యవహారం గత కొన్ని సంవత్స రాలుగా కొనసాగిస్తున్నట్లు తెలి సింది. విద్యార్థులు కాపీయింగ్కు పాల్‌ పడుతుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు గీతాంజలి జూనియర్‌ కాలేజీ యాజమాన్యం ప్రతినిధి బ్రహ్మయ్య ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాస్తూ ఉన్న విద్యార్థుల పూర్తి వివరాలను సేకరిస్తున్న పోలీసులు పారిపోయిన విద్యార్థులను గుర్తింతచేందుకు పూర్తి స్థాయి దర్యాప్తును చేపడుతున్నారు.కాగా విద్యను వ్యాపారంగా మార్చి అనర్హులను అందలం ఎక్కించి లక్షలాది రూపాయలను ఆలోచి స్తున్న గీతాంజలి జూనియర్‌ కాలేజీ యాజమాన్యం పై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్‌ చేశారు. పాస్‌ గ్యారెంటీ ఆశలు చూపించి విద్యార్థులకు జీవితా లతో ఆటలాడుకుంటున్న నిర్వాహకులు నగరంలోని మరో నాలుగు కేంద్రాలలోనూ ఈ విధంగానే మాస్‌ కాపీయింగ్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, పోలీసులు ఈ వ్యవ హారం పైన విచారణ జరిపించి నగరంలోని వివిధ కేంద్రాలలో జరుగుతున్న పరీక్షల వివరాలను సేకరించి పరీక్షలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

చీకట్లో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాల్లో చీకట్లు నింపుతున్న యాజమాన్యాన్ని అందుకు సహకరిస్తున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం అధికారులను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. షెడ్యూ ల్‌ ప్రకారం డిగ్రీ పీజీ పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల నుం డి 5 గంటల వరకు నిర్వహించాలని, కానీ పాస్‌ గ్యారంటీనీ అమలుచేసేందుకు కాలేజీ యాజమాన్యం తన కాలేజీకి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పరీక్షలు నిర్వహించడం గమనార్హం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close