బిజినెస్

ఏప్రిల్‌-నవంబరులో తగ్గిన పసిడి దిగుమతులు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-నవంబరులో దేశంలోకి 20.57 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.45 లక్షల కోట్ల) విలువైన బంగారం దిగుమతి అయ్యింది. 2018-19 ఇదే కాలం నాటి 22.16 బి.డా. (సుమారు రూ.1.57 లక్షల కోట్ల) దిగుమతులతో పోలిస్తే, ఈసారి 7 శాతం తగ్గింది. ఇందువల్ల దేశ కరెంటు ఖాతా లోటు 133.74 బిలియన్‌ డాలర్ల నుంచి 106.84 బి.డా.కు దిగి వచ్చింది. 2019 జులై-ఆగస్టు-సెప్టెంబరులలో పసిడి దిగుమతులు ఏడాది క్రితంతో పోలిస్తే తగ్గాయి. అయితే పండుగ సీజన్‌ కావడంతో అక్టోబరులో 5 శాతం పెరిగి 1.84 బి.డా.కు, నవంబరులో 6.6 శాతం అధికంగా 2.94 బి.డా.కు చేరాయి. ఆభరణాల తయారీ కోసం అధికంగా పసిడిని మనదేశం దిగుమతి చేసుకుంటోంది. ఏడాదికి 800-900 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అవుతోంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close