Featuredజాతీయ వార్తలు

‘నిర్భయ’ నిందితులకు డెత్‌ వారెంట్‌..?

  • రాష్ట్రపతి నిర్ణయం..!
  • ‘ఉరి’ కోసం కొత్త తలారి
  • ఆ తాడు పటిష్టం
  • చివరి గిమ్మిక్కులు చెల్లవు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

‘నిర్భయ’ చట్టం వచ్చింది. కానీ.. నిందితులకు ఇప్పటిదాకా వారికి పడ్డ ‘ఉరిశిక్ష’ అమలు కాలేదు. ఇందుకు సంబంధించిన ‘డెత్‌ వారెంట్‌’ త్వరలో జారీకానున్నది. దాంతో నిబంధనలకు అనుగుణంగా వచ్చే జనవరిలో ఆ నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు కానున్నది. అయితే ప్రస్తుతం తిహార్‌ జైలులో తలారీ అందుబాటులో లేరు. కొత్త తలారీ కోసం తిహార్‌ జైలు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ఈ మరణశిక్షలు అమలు జరిగితే వచ్చే ఏడాది జరిగే తొలి మరణశిక్షలు ఇవే. అమ్మాయిలను వెంటాడి, వేధించి..చంపే మానవ మృగాలకు ఓ హెచ్చరిక. అయితే ఇవే చివరి ఉరిశిక్షలు కావాలని భావిద్దాం.

అసలేం జరిగింది..: దక్షిణ ఢిల్లీలో 2012 డిసెంబరు 16వ తేదీన కదులుతున్న బస్సులో ఒక పారా మెడికల్‌ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు పక్కన పడేశారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె అదే సంవత్సరం డిసెంబర్‌ 20 న కన్నుమూసింది. ఈ కేసులో బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచడం కోసం ఆమె పేరును నిర్భయగా నిర్ణయించారు. అంతే కాకుండా ఆ పేరుపై మహిళల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. నేరానికి పాల్పడ్డ వారిలో ఒకరు బాల నేరస్థుడు కావడంతో సంస్కరణ గృహానికి పంపించారు. ఒక నేరస్థుడు రాంసింగ్‌ తానున్న జైలు లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురికి ఉరిశిక్ష పడింది.

క్షమాభిక్ష వద్దు: ఈ కేసులో నిందితుల్లో వినయ్‌ శర్మ అనే నిందితుడు క్షమాభిక్షకు అభ్యర్థించాడు. ఈ అర్జీని ఆమోదించ వద్దని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కు గట్టిగా సిఫారసు చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కు ఈ మేరకు దస్త్రాన్ని పంపించింది. ”అత్యంత అత్యంత క్రూరమైన దురాగతంలో సస నిందితులతో ఈ నిందితుడు పాల్గొన్నాడు. ఇలాంటి ఘోరమైన నేరాలకు మరెవరూ పాల్పడకుండా చూడాలంటే అతనికి అసాధారణ శిక్ష విధించాల్సిందే. క్షమాభిక్ష దరఖాస్తులో ఏమాత్రం పస లేదు. దానిని తిరస్కరించాలని గట్టిగా సిఫార్సు చేస్తున్నాం” అంటూ ఢిల్లీ ¬ంమంత్రి సత్యేందర్‌ జైన్‌ కేంద్ర ¬ంశాఖకు పంపిన దస్త్రంలో పేర్కొన్నారు.

క్షమాభిక్ష తిరస్కరించండి -కేంద్ర ¬ంశాఖ: రాష్ట్రపతికి సిఫార్సు చేసిన ¬ంశాఖ నిర్భయ కేసులో దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ ను తిరస్కరించామని కేంద్ర ¬ంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ కేసులో ‘వినయ్‌ శర్మ’ అనే దోషి క్షమాభిక్ష అభ్యర్థనను ¬ంశాఖ తిరస్కరిస్తూ… రాష్ట్రపతికి పంపింది. ఈ కేసులో వినయ్‌ శర్మతో పాటు దోషులుగా తేలిన మరో ముగ్గురికి సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం వీరు తిహార్‌ జైల్లో ఉన్నారు. ఇందులో వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోగా.. మిగతా ముగ్గురు దరఖాస్తు చేసుకోలేదు. ఒకవేళ దోషుల అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరిస్తే.. త్వరలోనే వారికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రపతి ఆగ్రహం: రాజస్తాన్‌ లో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కోవింద్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘రేపిస్ట్లకు క్షమాభిక్ష అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.

చివరిగా..: ‘రేపిస్టుల’ విషయంలో రాష్ట్రపతి నిర్ణయం తెలిసిపోయింది. అంటే నిర్భయ దోషులు నలుగురు త్వరలో ‘డెత్‌ వారెంట్‌’ రాగానే వారి తలలు ‘ఉరి’కి వేళ్ళాడతాయి.

‘డెత్‌ వారెంట్‌’ అమలులో ఎన్ని మలుపులో…: డెత్‌ వారెంట్‌ అమలులో ఎన్ని మలుపులు ఉంటాయి. దోషులకు జైలులో ఒకవైపు ఉరి ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు వారం నుంచి 24 గంటల ముందు సంబంధిత అధికారులు లేఖ అందజేస్తారు. అలా పంపే వీలు లేకపోతే… పోస్టల్‌ ద్వారా తెలియబరుస్తారు. (కసబ్‌ కేసులో పాకిస్థాన్‌ లోని అతగాడి కుటుంబ సభ్యులకు అలానే సమాచారం చేర వేశారు). దీనిపైన కూడా న్యాయపరమైన పోరాటం చేయవచ్చు. అయితే అవి నిలబడవు. అయినా చివరి క్షణంలో ఏ చిన్న విన్నపం (క్యూరేటివ్‌ పిటిషన్‌) వచ్చినా…అర్ధరాత్రి తర్వాత కూడా సుప్రీంకోర్టు అసాధారణ విచారణ జరుపుతుంది. ‘ఉరి’ ప్రక్రియను మొత్తం సవిూక్షిస్తుంది. డెత్‌ వారెంట్‌ సక్రమమే ‘క్యూరేటివ్‌ పిటిషన్‌’ పై మళ్లీ విచారణ అక్కర్లేదని ఇప్పటి వరకు ‘సుప్రీం’ చెప్పిన కేసులే ఉన్నాయి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close