హెచ్చుల మారి డీల్‌ : రాహుల్‌

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): బీజేపీ నేతలు మమ్మల్ని ఎంతైనా తిట్టండి భరిస్తా.. కానీ మేమడిగిన రాఫెల్‌ వ్యవహారంలో అవకతవకలపై మాకు సమాధానం ఇవ్వండి అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. రాఫెల్‌ డీల్‌ విూద ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన పార్లమెంట్‌ ఆవరణంలో మాట్లాడారు.. పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని రూ.560 కోట్ల విలువైన డీల్‌ రూ.1600 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. రాఫెల్‌ డీల్‌ను ప్రధాని మోడీ ఇష్టారాజ్యంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. తాను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చాక ఆర్ధిక మంత్రి నన్ను తిట్టవచ్చని అన్నారు. రాఫెల్‌ డీల్‌ లో అవకతవకలు లేకపోతే వివరాలు ఎందుకు బయటపెట్టరని ప్రశ్నించారు. హాల్‌ లాంటి సంస్థలను కాదని అనిల్‌ అంబానీకి ఎందుకు

అప్పగించారో చెప్పాలన్నారు. నేను ప్రేమతో అడుగుతున్నాను.. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఆ తరువాత తిట్టుకోండి అని రాహుల్‌ అన్నారు. మేం అధికారంలోకి రాగానే రాఫెల్‌పై పూర్తి విచారణ జరుపుతామని రాహుల్‌ అన్నారు. రాఫెల్‌లో జరిగిన అవకతవకలను బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్‌ సమావేశాల సమయంలో మాజీ రక్షణ శాఖ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ వద్ద ఉన్నాయంటూ బయటకు వచ్చిన ఆడియో టేపులను రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. ఆ ఆడియో టేపులో ఉన్న వివరాలను సభ ముందు ఉంచేందుకు రాహుల్‌ గాంధీ ప్రయత్నించారు. అయితే, దానికి అరుణ్‌ జైట్లీ అభ్యంతరం తెలిపారు. మనోహర్‌ పారికర్‌ పేరుతో ప్రచారం జరుగుతున్న ఆడియో టేపులను కృత్రిమంగా సృష్టించారని అరుణ్‌ జైట్లీ ఆరోపించారు. అలాంటి టేపులను సభలో ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. ఈ టేపు నిజమైనదేనని రాహుల్‌ నిరూపించగలరా? అని సవాలు విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రివిలేజ్‌ మోషన్‌ను రాహుల్‌ ఎదుర్కోవాల్సి ఉంటుందనీ, అలాగే సభ నుంచి సస్పెండ్‌ అవుతారని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here