Featuredస్టేట్ న్యూస్

ఘోర రోడ్డు ప్రమాదం

ఒకేకుటుంబంలో ఐదుగురి మృతి

  • శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆమనగల్‌ సమీపంలో హైదరాబాద్‌-కల్వకుర్తి ప్రధాన రహదారిపై ఘటన చోటు చేసుకుంది. ఇన్నోవా వాహనం లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై ఎస్సై మల్లేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్‌ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ వైపు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్గాప్రసాద్‌, ఆయన కుమారుడు శాంతన్‌, బావ రాజు, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన భార్య విజయలక్ష్మి, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే విజయలక్ష్మి ప్రాణాలు విడిచారు. కారు డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close